సరిలేరు నాకెవ్వరు…

  13 సంవత్సరాల తరువాత విజయశాంతి మళ్ళీ సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో ప్రొఫెసర్ భారతి పాత్రను పోషిస్తోంది. ఈ సినిమాలో విజయశాంతి ఫస్ట్‌లుక్‌ను డైరెక్టర్ అనిల్ రావిపూడి ట్విట్టర్ వేదికగా విడుదల చేశాడు. ఈ పోస్టర్‌లో దర్జాగా కూర్చొని ఉంటుంది. సరిగ్గా 30 ఏళ్ల క్రితం ‘కొడుకు దిద్దిన కాపురం’లో మహేష్ బాబుకు తల్లి పాత్రలో నటించింది. విజయశాంతి 1991 లో కర్తవ్యం సినిమాలో నటించిన నటనకు […] The post సరిలేరు నాకెవ్వరు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

13 సంవత్సరాల తరువాత విజయశాంతి మళ్ళీ సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో ప్రొఫెసర్ భారతి పాత్రను పోషిస్తోంది. ఈ సినిమాలో విజయశాంతి ఫస్ట్‌లుక్‌ను డైరెక్టర్ అనిల్ రావిపూడి ట్విట్టర్ వేదికగా విడుదల చేశాడు. ఈ పోస్టర్‌లో దర్జాగా కూర్చొని ఉంటుంది. సరిగ్గా 30 ఏళ్ల క్రితం ‘కొడుకు దిద్దిన కాపురం’లో మహేష్ బాబుకు తల్లి పాత్రలో నటించింది.

విజయశాంతి 1991 లో కర్తవ్యం సినిమాలో నటించిన నటనకు జాతీయ ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకుంది. ఆమె ఏడుసార్లు దక్షిణాది ఫిలిం ఫేర్ పురస్కారాలను, ఆరు సార్లు ఉత్తమ నటి పురస్కారాన్ని, 2003లో దక్షిణ భారతదేశ ఫిలింఫేర్ లైఫ్ టైం అచీవ్‌మెంటు పురస్కారాన్ని పొందింది. నాలుగు రాష్ట్ర నంది అవార్డులను అందుకున్న అందగత్తె.

 

పుట్టిన తేదీ : 24 జూన్ 1966
పుట్టిన స్థలం : వరంగల్, తెలంగాణ
వృత్తి : నటి, రాజకీయం
అలవాట్లు : పాటలు వినడం, డాన్స్ చేయడం
మొదటి సినిమా : కళ్లుక్కుల్, తమిళ సినిమా 1980
భర్త : నందమూరి శ్రీనివాస్ ప్రసాద్

 

vijaya shanthi sarileru neekevvaru

 

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post సరిలేరు నాకెవ్వరు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.