నాగుల చవితి.. ప్రకృతిలో ఓ భాగం

31న నాగుల చవితి సందర్భంగా..   కార్తీక మాసం శివకేశవులకే కాక సుబ్రహ్మణ్యస్వామికి కూడా విశేషమైనదిగా చెప్పుకోవచ్చు. ఈ మాసం పేరే కార్తికేయుని ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. అందుచేత ఈ మాసంలోని శుద్ద చవితి నాడు సర్పరూప సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి. ఈ రోజును ‘నాగుల చవితి’, ‘మహా చతుర్ధి’అంటారు. నాగుల చవితి, దీపావళి వెళ్లిన నాలుగో రోజున, కార్తీక చతుర్ధి నాడు వస్తుంది. ఈ రోజు పచ్చి చలిమిడి, చిమిలీ చేసుకుని, ఆవు పాలు, పూలు, పళ్ళు […] The post నాగుల చవితి.. ప్రకృతిలో ఓ భాగం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

31న నాగుల చవితి సందర్భంగా..

 

కార్తీక మాసం శివకేశవులకే కాక సుబ్రహ్మణ్యస్వామికి కూడా విశేషమైనదిగా చెప్పుకోవచ్చు. ఈ మాసం పేరే కార్తికేయుని ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. అందుచేత ఈ మాసంలోని శుద్ద చవితి నాడు సర్పరూప సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి. ఈ రోజును ‘నాగుల చవితి’, ‘మహా చతుర్ధి’అంటారు. నాగుల చవితి, దీపావళి వెళ్లిన నాలుగో రోజున, కార్తీక చతుర్ధి నాడు వస్తుంది. ఈ రోజు పచ్చి చలిమిడి, చిమిలీ చేసుకుని, ఆవు పాలు, పూలు, పళ్ళు కూడా తీసుకుని, పాము పుట్ట దగ్గరకు వెళ్లి, నాగదేవతకు పూజ చేసి, పుట్ట కన్నులలో ఆవు పాలు పోసి, చలిమిడి, చిమిలి కూడా వేసి, రెండు మతాబులు, కాకరపువ్వులు లాంటివి వెలిగించుకుంటారు. పుట్ట దగ్గరకు వెళ్ళటం అలవాటు లేని వారు ఇంట్లోనే పూజా ప్రదేశంలో చలిమిడి నాగేంద్రుడుని పెట్టుకుని, పూజ చేసుకుంటారు.

పాలు పోసి, చలిమిడి, చిమిలి, పాలు, పళ్ళు నైవేద్యం పెట్టుకుంటారు. నాగుల చవితి నాడు నాగేంద్రుని శివభావముతో అర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం.  వివాహం కానీ కన్యలు నాగుల చవితి చేసుకుంటే శీఘ్రంగా వివాహం జరుగుతుందని నమ్ముతారు. సంతానం లేని వారికి సంతాన యోగం కలుగుతుందని, మానసిక రుగ్మతలున్న వారికి మనోక్లేశాలు తొలిగి, ఆరోగ్య వంతులవుతారనీ, చెవి సంబంధించిన వ్యాధులు, చర్మ వ్యాధులు తొలిగి, పరిపూర్ణ ఆరోగ్యవంతులవుతారనీ భక్తులు నమ్ముతారు. అందుకే ఈ రోజు పుట్ట మన్నును శ్రద్ధగా చెవులపై ధరిస్తారు. యోగసాధన ద్వారా కుండలనీ శక్తి ని ఆరాధించడమే నాగులచవితి.

కుజ, రాహు దోషాలున్నవారు, సాంసారిక బాధలున్నవారు ఈ కార్తీకమాసంలో వచ్చే షష్టీ, చతుర్దశిలలో మంగళవారంగానీ, చతుర్దశి బుధవారం కలసివచ్చే రోజుకాని దినమంతా ఉపవాసం ఉండి నాగపూజ చేస్తారు. ఇలా చేయడం వల్ల పామును చంపిన పాప పరిహారం, ఆ పాపం వంశానికి తగులకుండా ఉంటుందని నమ్ముతారు. తైత్తిరీయ సంహిత నాగపూజా విధానాన్ని వివరించింది. వేపచెట్టు, రావిచెట్టు మొదట నాగవిగ్రహం ఉండటం పరిపాటి. ఈ విగ్రహాన్ని రెండు పాములు పెనవేసుకున్న ఆకారంతో తీరుస్తారు. ఈ రెండు పాములే ఇళా, పింగళాకి ప్రతీకలు. నాగులను సంతానం కోసం పూజించటం సంప్రదాయం. విప్పిన పడగతో, శివలింగంతో 8 వంకరల సర్పవిగ్రహం సుషుమ్నానాడికి, ఊర్ధ్వగామి అయిన కుండలినికి సంకేతం. నాగులచవితి రోజు పాములపుట్ట దగ్గరకి వెళ్ళి, పత్తితో వస్త్రాలు, యఙ్ఞోపవీతాల వంటి నూలు దారాలతో పుట్టలను అలంకరించి, పూజ చేసి, పుట్టలో పాలు పోయడం ఆనవాయితీ.

సర్పం మండలాకారం లేక పూర్ణవృత్తం, పూర్తి శూన్యం, ఈ పూర్ణంలో పూర్ణం తీసివేస్తే శేషమూ పూర్ణం. ఆ శేషమే ఆదిశేషంగా, అనంతమనే శేషశాయిగా, విష్ణువుకి తల్పంగా ఏర్పడింది అని అంటారు. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధనలో కూడా సర్పం ఉంటుంది. మరోవిధంగా చెప్పాలంటే, మన శరీరమే నవరంద్రాల పుట్ట, అందులోని పాము (కుండలనీశక్తి) ని ఆరాధించడమే నాగులచవితి. ఈ పుట్టలో అడుగున మండలాకారంలో చుట్టలు చుట్టుకుని పడుకున్న పాము (కుండలనీశక్తి) కామోద్రేకాలతో విషాన్ని కక్కుతూ ఉంటుంది, పాలు అనే యోగసాధన ద్వారా ఆ విషాన్ని హరించవచ్చు అనేది ఈ నాగులచవితిలోని అంతరార్ధం. కార్తీకమాసంలో సూర్యుడు కామానికి, మృత్యువుకూ స్థానమైన వృశ్చికరాశిలో సంచరిస్తాడు. ఈ కాలాన్ని, మృత్యువునూ జయించడానికి రుషులు, యోగులు చేసే నాగారాధన, సిద్ది సాధనా కాలమే కార్తీకమాసం.

 

Nagula Chavithi history in Telugu

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post నాగుల చవితి.. ప్రకృతిలో ఓ భాగం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.