కెసిఆర్ హయాంలోనే పోలీసుల కీర్తి, ప్రతిష్టలు పెరిగాయి: మంత్రి ఎర్రబెల్లి

  వరంగల్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం హయాంలోనే తెలంగాణ రాష్ట్ర పోలీసులకు ప్రజల్లో గౌరవ మర్యాదలు, కీర్తిప్రతిష్టలు పెరిగాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరషరా, గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలోని ఆత్మకూరు మాడల్ పోలీస్‌స్టేషన్‌ను బుధవారం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖామంత్రి, స్థానిక ఎంఎల్‌ఎ చల్లా ధర్మారెడ్డి, పోలీస్ కమిషనర్ డాక్టర్ విశ్వనాథ్ రవీందర్, వరంగల్ రూరల్ కలెక్టర్ హరితలతో కలిసి ప్రారంభించారు. సుమారు […] The post కెసిఆర్ హయాంలోనే పోలీసుల కీర్తి, ప్రతిష్టలు పెరిగాయి: మంత్రి ఎర్రబెల్లి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

వరంగల్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం హయాంలోనే తెలంగాణ రాష్ట్ర పోలీసులకు ప్రజల్లో గౌరవ మర్యాదలు, కీర్తిప్రతిష్టలు పెరిగాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరషరా, గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలోని ఆత్మకూరు మాడల్ పోలీస్‌స్టేషన్‌ను బుధవారం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖామంత్రి, స్థానిక ఎంఎల్‌ఎ చల్లా ధర్మారెడ్డి, పోలీస్ కమిషనర్ డాక్టర్ విశ్వనాథ్ రవీందర్, వరంగల్ రూరల్ కలెక్టర్ హరితలతో కలిసి ప్రారంభించారు.

సుమారు రూ.కోటి పదిలక్షల వ్యయంతో నిర్మించబడిన మాడల్ పోలీస్‌స్టేషన్‌ను ప్రారంభించిన మంత్రి నూతన పోలీస్‌స్టేషన్ భవనంలో పోలీస్ విభాగానికి సంబంధించిన గదులను స్థానిక ఎంఎల్‌ఎ, కలెక్టర్, పోలీస్ అధికారులు ప్రారంభించడంతో పాటు స్మార్ట్ పోలీస్‌స్టేషన్ పనితీరుతో పాటు ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీని వినియోగించుకొని పోలీసులు నేరాల నియంత్రణతో పాటు నేరస్తులను గుర్తించే తీరుపై వరంగల్ సిపి రవీందర్ మంత్రికి వివరించారు.

ఈ సందర్భంగా స్థానిక ఎంఎల్‌ఎ చల్లా ధర్మారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ.. గతంలో పోలీసులు వినియోగించుకునేందుకు జీపు లేకపోవడంతో ఉన్న వాహనాలకు ఇందనం కొరత ఉండేదని, కాని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం తెలంగాణ ప్రభుత్వం హయాంలో పోలీసుల పనితీరును మెరుగుపరిచేందుకుగాను రాష్ట్రంలోని ప్రతి పోలీస్‌స్టేషన్‌కు రెండు పోలీస్ వాహనాలను అందజేయడంతో కొంతమంది రాజకీయ నాయకులు పోలీసులను విమర్శించడం జరిగిందని, కాని నేడు పోలీసులకు వాహనాలను అందజేయడం ద్వారా ప్రజల నుండి ఫిర్యాదు వచ్చిన పది నిముషాల్లోనే సంఘటనా స్థలానికి చేరుకొని సమస్య పరిష్కారించడం జరుగుతుందన్నారు.

దీంతో పోలీసుల పట్ల ప్రజలకు నమ్మకం కలిగిందని, ముఖ్యంగా ప్రస్తుత రోజుల్లో పోలీసులు ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీని వినియోగించుకొని నేరాలను నియంత్రించడంతో పాటు నేరస్తులను గుర్తించి వారిని పట్టుకోవడంలోనూ పోలీసులు వేగం పెంచారని, గతంలో ఎన్ని నేరాలు చేసిన సదరు నేరస్తులకు శిక్షలు పడేవికావని, కాని కెసిఆర్ నాయకత్వంలో అవలంభించిన విధానాల ద్వారా నేడు పోలీసులు కేసులను పారదర్శకంగా దర్యాప్తు చేసి నేరస్తులకు కోర్టులో శిక్షలు పడేవిధంగా పనిచేస్తున్నారన్నారు.

రాష్ట్రంలో నేరస్తులకు శిక్షల సంఖ్య ఘణనీయంగా పెరగడంతో ప్రజలకు పోలీసులపై నమ్మకం కలిగిందని, ముఖ్యంగా ఇటీవల జరిగిన ఆరునెలల చిన్నారిపై జరిగిన అత్యాచారం, హత్య సంఘటనలో నేరస్తుడికి మరణ శిక్ష విధించడం ద్వారా వరంగల్ కమిషనరేట్ పోలీసులు దేశంలో చరిత్ర సృష్టించారని, ఈ విధంగా కొనసాగితే ప్రజలకు పోలీసుల పట్ల విశ్వాసం ఉంటుందని, రాష్ట్రంలో పోలీసులు ప్రతి కేసును చాలెంజ్‌గా తీసుకొని కేసులను పరిష్కరించడం జరుగుతుందన్నారు. తద్వారా దేశంలోనే తెలంగాణ పోలీసులకు ప్రత్యేక గుర్తింపు రావడంతో పాటు రాష్ట్రంలో నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టాయన్నారు.

ముఖ్యంగా భూకబ్జాలకు పాల్పడే వారిపట్ల కఠినంగా వ్యవహరించడంతో పాటు వారు ఏస్థాయిలో ఉన్నా వారిని ఉపేక్షించేది లేదని మంత్రి తెలిపారు. అంతకుముందు ఈ సమావేశంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాలను నియంత్రిండంతో పాటు నేరస్తులను గుర్తించి వారికి శిక్షలు పడేందుకుగాను పోలీసులు అవలంభిస్తున్న తీరును వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ విశ్వనాథ్ రవీందర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఈస్ట్‌జోన్ డిసిపి నాగరాజు, పోలీస్ హౌసింగ్ బోర్డు డిఈ శ్రీనివాస్, మామునూరు ఎసిపి శ్యాంసుందర్, ఆత్మకూరు, గీసుకొండ, శాయంపేట, మామునూరు ఇన్స్‌పెక్టర్లు మహేందర్, శివరామయ్య, వెంకటేశ్వర్లు, రాజుతో ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Launch of Atmakur Model Police Station

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కెసిఆర్ హయాంలోనే పోలీసుల కీర్తి, ప్రతిష్టలు పెరిగాయి: మంత్రి ఎర్రబెల్లి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: