మున్సిపోల్‌కు రెడీ

  ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు ఇప్పటి నుంచే ప్రజల్లో తిరుగుతున్న ఆశావహులు సన్నద్ధ్దం అవుతున్న పార్టీ ఆదిలాబాద్ : గత కొన్ని నెలలగా కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికలపై కొనసాగుతున్న ఉత్కంఠ వీడింది. ఎన్నికలకు సంబంధించి వార్డుల విభజన, రిజర్వేషన్‌ల ఖరారు సక్రమంగా లేదని కోర్టులో పలు పిటిషన్‌లు దాఖలు కాగా వీటిని ఉన్నత న్యా యం స్థానం పరిశీలించి పిటిషనర్ల అ భ్యంతరాలను కొట్టివేస్తు ఎన్నికలకు గ్రీన్ సిగ్నిల్ ఇచ్చిన విషయం తెలిసిందే దీంతో ఎన్నికల […] The post మున్సిపోల్‌కు రెడీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
ఇప్పటి నుంచే ప్రజల్లో తిరుగుతున్న ఆశావహులు
సన్నద్ధ్దం అవుతున్న పార్టీ

ఆదిలాబాద్ : గత కొన్ని నెలలగా కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికలపై కొనసాగుతున్న ఉత్కంఠ వీడింది. ఎన్నికలకు సంబంధించి వార్డుల విభజన, రిజర్వేషన్‌ల ఖరారు సక్రమంగా లేదని కోర్టులో పలు పిటిషన్‌లు దాఖలు కాగా వీటిని ఉన్నత న్యా యం స్థానం పరిశీలించి పిటిషనర్ల అ భ్యంతరాలను కొట్టివేస్తు ఎన్నికలకు గ్రీన్ సిగ్నిల్ ఇచ్చిన విషయం తెలిసిందే దీంతో ఎన్నికల వాతావరణం రానుంది. ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్‌లు సైతం జారీ చేశారు. ఎన్నికల ముందు జరిగే ప్రక్రియ పూర్తి చేసుకోవడానికి హైకోర్టు గతంలోనే అనుమతివ్వడంతో ఆయా పార్టీల నాయకుల్లో ఆ శలు చిగురించాయి. వార్డుల నుంచి పోటీ చేసే అ భ్యర్థులు ఇప్పటి నుంచే ప్రజలతో మమేమవుతు పలు సమస్యల పరిష్కరానికి చోరవ చూపుతున్నారు.

గతంలో ఆదిలాబాద్ మున్సిపల్టీలో 36 వార్డులు ఉం డగా ప్రస్తుతం మావల మండలాన్ని వదిలి మిగితా కాలనీలు, రాంపూర్, అనుకుంటా, అర్లి(బి) గ్రామ పంచాయతీ పరిధిలోని ప లు గ్రామాలను ఆదిలాబాద్ మున్సిపల్టీలో విలినం చేశారు. దీంతో వార్డుల సంఖ్య 49కి చేరింది. ఈ వార్డుల విభజన గంధర గోళంగా ఇష్టారితీన చేశారని పలువురు కోర్టును ఆశ్రయించారు. దీనిపైన కోర్టు మున్సిపల్టీలో జరిగిన పొరపాట్లను సరిదిద్దాలని ఆదేశించిం ది. అప్పుడు అధికారులు వార్డులను ప ర్యటిస్తూ ఓటర్ల సంఖ్య, వార్డుల పరిధి తదితర అంశాలను సవరించారు. ఈ నెల 22న మున్సిపల్ ఎన్నికలకు హైకో ర్టు పచ్చజెండా చూపడంతో ఆయా రాజకీయ పార్టీలో సమయత్తం అవుతున్నాయి.

ఆయా పార్టీలకు చెందిన నా యకులు, మాజీ కౌన్సిలర్లు తమ ప్రయత్నాలు మొదలు పెట్టారు. కొంతమంది అయితే ఇప్పటి నుంచే వారి వారి కాలనీల్లో సమ్యల పరిష్కరానికి కృషి చేస్తున్నారు. రిజర్వేషన్ కలిసి వస్తే తమకు మద్దతు ఇవ్వాలని ప్రజలను కొరుతున్నారు. ఏర్పాట్లకు సన్నద్ధ్దం అవుతున్న అధికారులు: మున్సిపల్ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే వార్డుల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళ ఘణను చేపట్టారు.

అయితే గత ఎన్నికల్లో ఓటర్ జాబితలో తమ పేర్లు గల్లంతయ్యాయని అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఆందోళన జరిగిన విషయం విషయం విధితమే మున్సిపల్ ఎన్నికల్లో ఎలాం టి తప్పులు పునరావృతం కాకుండా జిల్లా కలెక్టర్ దివ్యదేవరాజన్ ప్రత్యేక చర్యలు చేప్టారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల అనుసారంగా ఓటర్ ఐడి కార్డును ఆన్‌లైన్‌లో అ నుసంధానం చేసుకునేలా అవగాహన కార్యక్రమాలు చేప్టారు.

అంతేకాకుండా మున్సిపల్, కలెక్టర్ కార్యాలయ ంలో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఓటరు జాబితాలో తమ పేరుతో పాటు పలు సవరణలు చేసుకునే విధంగా ఈ కేంద్రాల్లో వెలుసుబాటు కల్పించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చిన దాన్ని విజయవంతంగా నిర్వహించే విధంగా అధికారులు సిద్ధ్దంగా ఉన్నారు. అటు పోలీసులు సైతం ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటినుంచి ఆయా సమస్యాత్మక కాలనీలపై నిఘా సాధించారు.

Ready for Municipal Election

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మున్సిపోల్‌కు రెడీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: