డిజిటల్ సోడా

  జేబులోంచి ఎలాగో అలాగ ఓ పది రూపాయల కాగితం తీసాను. ‘నో కాష్’, అన్నాడు కుర్రాడు. ‘నీ మొహం మండ!’ ‘పొద్దున్నే అలాంటి మాట ఎందుకు సార్?’ ‘మరి? చక్కగా చిల్లర చేతిలో పెడుతుంటే ఈ గోల ఏంటి గోలీ?’ ‘సార్, నేను ఎదిగాను. నన్ను గోలీ అనటం కరెక్ట్ కాదేమో.’ ‘ఓకే. వద్దన్నావుగా ఇదిగో సోడా కొట్టు.’ ‘చెప్పాను కదా సార్? ఇప్పుడు సోడా కూడా డిజిటలే! ఇదిగో ఇలా ప్రొసీడ్ అయిపోండి.’ అక్కడ […] The post డిజిటల్ సోడా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

జేబులోంచి ఎలాగో అలాగ ఓ పది రూపాయల కాగితం తీసాను.
‘నో కాష్’, అన్నాడు కుర్రాడు.
‘నీ మొహం మండ!’
‘పొద్దున్నే అలాంటి మాట ఎందుకు సార్?’
‘మరి? చక్కగా చిల్లర చేతిలో పెడుతుంటే ఈ గోల ఏంటి గోలీ?’
‘సార్, నేను ఎదిగాను. నన్ను గోలీ అనటం కరెక్ట్ కాదేమో.’
‘ఓకే. వద్దన్నావుగా ఇదిగో సోడా కొట్టు.’
‘చెప్పాను కదా సార్? ఇప్పుడు సోడా కూడా డిజిటలే! ఇదిగో ఇలా ప్రొసీడ్ అయిపోండి.’
అక్కడ బోర్డు చూసాను. వరుసగా ఎలా రిజిస్టర్ అవ్వాలి, ఏమి చేయాలి అనేది దాని మీద ఉంది.
‘రేయ్, ఇవ్వాళ ఇచ్చేయ్. రేపటి నుండీ…’
అతను చెయ్యి అడ్డం పెట్టాడు.
‘రెండు.’
‘ఏంటి? అలా చేస్తే రెండు సోడాలిస్తావా?’
‘నో సార్…రెండు కారణాలున్నాయి. మీరు రేపు కూడా ఇలాగే అడుగుతారు. తరువాత ఇప్పుడు మీరు రిజిస్టర్ అయి లాగ్ ఇన్ అయితే అసలు రేపటి నుండీ చక్కగా అకౌంట్‌లోకి డబ్బు!’
ఆ బోర్డు చూసాను. మొబైల్ తీసి అక్కడ ఉన్నట్లు ఒక్కొక్కటీ చేస్తూ పోయాను. మొబైల్ స్క్రీన్ లోంచి ఓ బొకే మొహం మీదకే పడ్డట్లయింది.ఓ అమ్మాయి గాలిలోకి ముద్దులు పంపుతూ డిజిటల్ స్వాగతం చెబుతోంది. ఇప్పుడర్థమయింది. ఇక్కడికి రాగానే ఆ బెంచీ మీద కుర్రాళ్లు ఏం చూస్తున్నారా మొబైల్‌లో అనుకున్నాను. అక్కడ ఎంత సేపు క్లిక్ కొట్టినా అది పోవటం లేదు.
కుర్రాడి వైపు చూసాను. అతను నవ్వుతున్నాడు. కొద్ది సేపు అలా పూలు రాలుతూనే ఉన్నాయి. ఇంతలో స్క్రీన్ మీద మోతీచూర్ లడ్డూలు, జంతికలు చెరో ప్లేట్లో ముందుకు వచ్చాయి. ఏదో ఒకటి ఎంచుకుని దాని మీద మొట్టికాయ వెయ్యమంటూ అవి ముందుకూ వెనక్కీ సెలయిన్ బాటిల్‌కి అలయిన్ అయిపోయిన ప్రాణంలా ఊగుతున్నాయి. నాలో సహనం నశిస్తోంది. పోనీలే అని లడ్డూల మీద వేలుంచాను. హమ్మయ్య!. ఒక కొత్త స్క్రీన్ వచ్చింది. అందులో నెట్ బ్యాంకింగు, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డ్ వగైరాలతో ఒకపట్టిక కనిపించింది. నెట్ బ్యాంకింగ్ నొక్కి నా బ్యాంకు పేజీలోకి వెళ్లాను. దిక్కుమాలిన గోలీ సోడాకి ఇంత గోలా? అనుకుంటూ పది రూపాయలు అని అందులో కొట్టి ధృవీకరించాను. ఓ అయిదు నిముషాల వరకూ ఏదీ కనిపించలేదు. అయిపోయింది! ఈ గోలీగాడు నా బ్యాంకు అకౌంట్ యావత్తూ గోల్ చేసాడనిపించింది. జీవితంలో గోలీ సోడా వద్దనుకున్నాను. ఇంతలోనే మొబయిల్ వెలుగు చూసింది. కానీ అక్కడ ఓ ప్రేమపావురం లాంటిది ముక్కున ఏదో పట్టుకుని ప్రేమసందేశం అందిస్తోంది-. సారీ…కనీసం వెయ్యి రూపాయలతో ఈ సర్కస్‌లోకి రావాలని అంటోంది.
వీడి గోలి సోడా కోసం వాడెవడికో ముందర వెయ్యి రూపాయలా? కుర్రాడు నా వైపే చూస్తున్నాడు. అందరి సమస్యలూ అతనికి బాగా అర్థమవుతున్నాయిలా ఉంది.
‘సార్, ఆ అకౌంట్ తో ఈ సోడా ఒక్కటే కాదు, ఇంకా చాలా కొనుక్కోవచ్చు!’
‘ఓహో! వ్యాపారం బాగుందయ్యా!’
‘అలాక్కాదు సార్. ఈ షాపే కాదు, ఎక్కడికైనా వెళ్లవచ్చు.’
‘పోన్లే…ఇప్పుడు నాకు సోడా అక్కరలేదు.’
వెనక్కి తిరిగాను.
‘సార్, సార్…’, అతను దగ్గరగా వచ్చాడు.
‘ఒక్కసారి చూడండీ….ఆ అమ్మాయిలు డిజిటల్ పేమెంట్ చేసి నాలుగు కూల్ డ్రింకులు, బర్గర్లూ కొన్నారు.మిమ్మల్ని చూసి ఏమనుకుంటారు?’
‘అడగమంటావా?’
‘వద్దు. అస్సలు బాగుండదు సార్. చూడండి సార్, ఎలా నవ్వుతున్నారో?’
‘నన్ను చూసి కాదు.అలా అని నిజంగా నవ్వొచ్చీ కాదు. అలా నవ్వుతూ ఉండాలని టి.వీలో అన్ని కార్యక్రమాలలో చెబుతారు!’
‘సార్!’
‘ఏమైంది?’
‘ఇంకో నిముషంలో మీరు కంఫర్మ్ చెయ్యకపోతే మళ్లీ మొదటికి వస్తుంది.’
‘రానీ!’
‘సార్, ప్లీజ్, మీకొకటి ఉచితంగా ఇస్తాను…ఇదిగోండి…’
‘ఏంటది?’
‘డిజిటల్ సోడా…మొదటిది మీదేనని సెల్ఫీ తీస్తాను!’
‘ఇలా ఎంత మందివి మొదటి ఫొటోలు తీసావు?’
‘అన్యాయం సార్. మీదే మొదటిది. కంఫర్మ్ చెయ్యండి సార్.’
పోన్లే అని కంఫర్మ్ చేసాను. ఒ.టి.పి వచ్చింది. అదీ కొట్టాను. స్క్రీన్ మీద కనకవర్షం కురిసింది. ‘ఇక ప్రపంచం మీదే’ అని సందేశం వచ్చింది. ఆ అమ్మాయి ‘బాయ్’ చెబుతూ వెళ్లిపోయింది.
‘సార్ ’
‘ఏంటి?’
‘కొట్టండి.’
‘ఎవర్ని?’
‘సార్, జోకులొద్దు. గోలీ సోడా మీద కొట్టండి. పది రూపాయలు నాకొస్తాయి.’
సోడా బొమ్మ మీద కొట్టాను. స్క్రీన్ మీద గోలీ సోడా పేలిపోయింది. మొబైల్ స్క్రీన్ మొత్తం గ్యాస్ నిండినట్లయింది. మెల్లగా క్లియర్ అయింది.
‘దయ చేసి నిరీక్షించండి.మీ అమూల్యమైన కోరికను మేము మర పడురున్నాం.’
‘మర ఏమిటిరా?పిండి కొడతావా మొహం మీదా
‘కాదు సార్. ప్రాసెస్ చేస్తున్నారు!’
‘రేయ్!’
‘సార్!’
‘సోడ ఇవ్వరా, పుణ్యం ఉంటుంది…’
‘సార్, నా అకౌంట్‌లోకి రాలేదు.’
‘గొంతు ఎండిపోతుందిరా!’
‘సార్, మీరూ అన్యాయం అయిపోతారు, నేనూ అన్యాయం అయిపోతాను.’
అక్కడ టోల్ ఫ్రీ నంబర్ నొక్కాను.
‘హిందీ కోసం సున్నా నొక్కండి. ఆంగ్లం కోసం రెండు సున్నాలు నొక్కండి. తెలుగు కోసం ముచ్చటగా మూడు సున్నాలు నొక్కండి.’
తెలుగు నొక్కి చెవి దగ్గర పెట్టాను.
‘మా సేవలు మీకు నచ్చినట్లయితే అయిదు అని కొట్టంది. లేకపోతే ఒకటి అని కొట్టండి.’
ఒకటి కొట్టాను. ఒక పాత తెలుగు పాట ట్యూన్ వినిపించింది- ‘భూమ్మీద సుఖపడితే తప్పు లేదురా, బులబాటం తీర్చుకుంటే తప్పు లేదురా.. తప్పే లేదురా!’
‘క్షమించండి, మా ఎక్సిక్యూటివ్లందరూ బిజీగా ఉన్నారు. మీ కాల్ మాకెంతో విలువైనది. దయ చేసి వేచి ఉండండి.!’
మళ్లీ ట్యూన్ ప్రారంభమైంది.
‘రేయ్!’
‘సార్, వచ్చిందా?’
‘ఏంటి వచ్చేది? చంపావు గదరా ఓ సోడా కోసం?’
‘సార్, మీరే అలా అనేస్తే ఎలా? ఆలోచించండి.’

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post డిజిటల్ సోడా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.