కశ్మీర్ అల్ ఖైదా చీఫ్ హతం

జమ్మూకశ్మీర్ : కశ్మీర్ అల్ ఖైదా చీఫ్ హమీద్ లెల్హారీ సహా మరో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయని జమ్మూకశ్మీర్ డిజిపి దిల్బగ్ సింగ్ తెలిపారు. అవంతిపురం సెక్టార్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో వీరు హతమైనట్టు ఆయన వెల్లడించారు. అల్ ఖైదా అనుబంధ సంస్థ అయిన అన్సర్ ఘజ్ వత్ ఉల్ హింద్(ఎజిహెచ్) పేరిట జమ్మూకశ్మీర్ లో ఉగ్ర కార్యకలాపాలు నిర్వహిస్తుందని ఆయన చెప్పారు. మంగళవారం సాయంత్రం జరిగిన ఎదురుకాల్పుల్లో హమీద్ లెల్హారి […] The post కశ్మీర్ అల్ ఖైదా చీఫ్ హతం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

జమ్మూకశ్మీర్ : కశ్మీర్ అల్ ఖైదా చీఫ్ హమీద్ లెల్హారీ సహా మరో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయని జమ్మూకశ్మీర్ డిజిపి దిల్బగ్ సింగ్ తెలిపారు. అవంతిపురం సెక్టార్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో వీరు హతమైనట్టు ఆయన వెల్లడించారు. అల్ ఖైదా అనుబంధ సంస్థ అయిన అన్సర్ ఘజ్ వత్ ఉల్ హింద్(ఎజిహెచ్) పేరిట జమ్మూకశ్మీర్ లో ఉగ్ర కార్యకలాపాలు నిర్వహిస్తుందని ఆయన చెప్పారు. మంగళవారం సాయంత్రం జరిగిన ఎదురుకాల్పుల్లో హమీద్ లెల్హారి సహా మరో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని ఆయన పేర్కొన్నారు. ఘటనాస్థలి నుంచి పెద్ద మొత్తంలో మందుగుండు సామగ్రి, పది ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు డిజిపి దిల్బగ్ సింగ్ వెల్లడించారు. పక్షం రోజుల క్రితం ఎజిహెచ్ కు కాబోయే చీఫ్ గా జకీర్ మూసా పేరును హమీద్ లెల్హారీ ప్రకటించారని, అయితే జకీర్ మూసా మే23న దక్షిణ కశ్మీర్ లోని త్రాల్ గ్రామంలో జరిగిన ఎన్ కౌంటర్ లో హతమయ్యాడని డిజిపి తెలిపారు.

Kashmir Al Qaeda Chief Hamid Lelhari Encounter

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కశ్మీర్ అల్ ఖైదా చీఫ్ హతం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: