హైదరాబాద్ : బుధ, గురువారాల్లో తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఎపిలలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. గత 24 గంటలుగా బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. అంతేకాక పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్రమైన అల్పపీడనం కేంద్రీకృతమై ఉండడం, వచ్చే 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉండడంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో వచ్చే రెండు రోజుల్లో తుఫానుగా మారే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. వర్షాలు కురుస్తున్న సమయంలో పిడుగులు పడే అవకాశం ఉందని, ఈ క్రమంలో చెట్ల పక్కన, విద్యుత్ స్తంభాల పక్కన నిల్చోరాదని, ఇరు రాష్ట్రాల లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు హెచ్చరించారు.
Heavy Rains In Telugu States TS And AP
Related Images:
[
See image gallery at www.manatelangana.news]
The post నేడూ… రేపు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.