ఆత్మాహుతి దాడితో మోడీని చంపేస్తా

ఇస్లామాబాద్: భారత ప్రధాని నరేంద్ర మోడీని ఆత్మాహుతి దాడితో చంపేస్తానంటూ పాకిస్తానీ గాయని-నటి రబీ పిర్జాదా మరోసారి బెదిరించింది. బాంబులతో కూడిన జాకెట్‌ని ధరించిన ఫోజుతో మంగళవారం తన ట్విట్టర్ ఖాతాలో తన ఫోటోను పోస్ట్ చేసిన పిర్జాదా భారత ప్రధానమంత్రి మోడీని జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్‌తో పోల్చింది. తనను తాను కశ్మీరీ ముద్దు బిడ్డగా అభివర్ణించుకున్న పిర్జాదా ఆత్మాహుతి బాంబు దాడితో మోడీని హతమారుస్తానంటూ బెదిరించింది. అయితే పిర్జాదా పోస్ట్‌కు సోషల్ మీడియాలో తీవ్ర […] The post ఆత్మాహుతి దాడితో మోడీని చంపేస్తా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఇస్లామాబాద్: భారత ప్రధాని నరేంద్ర మోడీని ఆత్మాహుతి దాడితో చంపేస్తానంటూ పాకిస్తానీ గాయని-నటి రబీ పిర్జాదా మరోసారి బెదిరించింది. బాంబులతో కూడిన జాకెట్‌ని ధరించిన ఫోజుతో మంగళవారం తన ట్విట్టర్ ఖాతాలో తన ఫోటోను పోస్ట్ చేసిన పిర్జాదా భారత ప్రధానమంత్రి మోడీని జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్‌తో పోల్చింది. తనను తాను కశ్మీరీ ముద్దు బిడ్డగా అభివర్ణించుకున్న పిర్జాదా ఆత్మాహుతి బాంబు దాడితో మోడీని హతమారుస్తానంటూ బెదిరించింది. అయితే పిర్జాదా పోస్ట్‌కు సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదురయ్యాయి.

కొందరు పాకిస్తానీ నెటిజన్లు కూడా పాకిస్తాన్‌ను అప్రతిష్ట పాల్జేసే విధంగా ఉన్న ఈ పోస్ట్‌పై పిర్జాదాను తిట్టిపోశారు. కాగా, గత నెలలో కూడా ఒక వీడియో పోస్ట్ ద్వారా పాములు, మొసళ్లతో ప్రధాని మోడీని చంపేస్తానంటూ పిర్జాదా బెదిరించింది. వాస్తవాధీన రేఖ మీదుగా పాములు, మొసళ్లను ఇండియాలోకి పంపించి మోడీని చంపించి వేస్తానంటూ ఆమె ఒక వీడియో పోస్ట్ చేసింది. ఆగస్టు 17న కశ్మీరీ సమస్యపై పిర్జాదా ఒక పాటను విడుదల చేసింది. ఆ సందర్భంగా ట్వీట్ చేస్తూ కశ్మీరీలైన తాము పాకిస్తాన్‌ను ఎల్లప్పుడూ ప్రేమిస్తామని ఆమె చెప్పుకొచ్చింది.

Pak singer threatens Modi with suicide attack, Rabi Pirzada was brutally trolled on twitter by netizens including Pakistani users

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఆత్మాహుతి దాడితో మోడీని చంపేస్తా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: