గోదారమ్మకు ఇంద్రకరణ్ ప్రత్యేక పూజలు

నిజామాబాద్ : శ్రీరాం సాగ‌ర్ ప్రాజెక్ట్ జలకళను సంతరించుకుంది. ఈ క్రమంలో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి బుధ‌వారం శ్రీరాం సాగ‌ర్ ప్రాజెక్ట్ ను సంద‌ర్శించారు. ఈ సందర్భంగా ఆయన గోదార‌మ్మ‌కు ప్ర‌త్యేక పూజలు చేశారు. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీరాం సాగ‌ర్ ప్రాజెక్ట్ లోకి భారీగా నీరు వ‌చ్చి చేరుతుందని ఆయన చెప్పారు. ఈ ప్రాజెక్టు ఆయకట్టుకింద పంటల సాగుకు నీటిని విడుదల చేస్తున్నామని ఆయ తెలిపారు. ఖరీఫ్ సీజన్ కు కూడా నీటిని […] The post గోదారమ్మకు ఇంద్రకరణ్ ప్రత్యేక పూజలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

నిజామాబాద్ : శ్రీరాం సాగ‌ర్ ప్రాజెక్ట్ జలకళను సంతరించుకుంది. ఈ క్రమంలో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి బుధ‌వారం శ్రీరాం సాగ‌ర్ ప్రాజెక్ట్ ను సంద‌ర్శించారు. ఈ సందర్భంగా ఆయన గోదార‌మ్మ‌కు ప్ర‌త్యేక పూజలు చేశారు. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీరాం సాగ‌ర్ ప్రాజెక్ట్ లోకి భారీగా నీరు వ‌చ్చి చేరుతుందని ఆయన చెప్పారు. ఈ ప్రాజెక్టు ఆయకట్టుకింద పంటల సాగుకు నీటిని విడుదల చేస్తున్నామని ఆయ తెలిపారు. ఖరీఫ్ సీజన్ కు కూడా నీటిని విడుదల చేయాలని ప్రణాళికలు తయారు చేస్తున్నామని ఆయన చెప్పారు. పోచంపాడు జెన్ కో కేంద్రంలో ఊహించని విధంగా రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి అవుతుందని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నిర్మ‌ల్ జిల్లా క‌లెక్ట‌ర్ యం. ప్ర‌శాంతి, ఎస్సారెస్సీ ఎస్ఈ శ్రీనివాస్ రెడ్డి, ఈఈ రామారావు, టిఆర్ఎస్ నాయ‌కులు స‌త్య‌నారాయ‌ణ గౌడ్, రాంకిష‌న్ రెడ్డి, మ‌ల్లికార్జున్ రెడ్డి, ప‌త్తిరెడ్డి రాజేశ్వ‌ర్ రెడ్డి, గోవ‌ర్ద‌న్ రెడ్డి, నిర్మ‌ల్ ఎంపిపి రామేశ్వ‌ర్ రెడ్డి, జడ్ పిటిసి జీవ‌న్ రెడ్డిలు పాల్గొన్నారు.

Minister Indrakaran Reddy Worshiped To Godavari River

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post గోదారమ్మకు ఇంద్రకరణ్ ప్రత్యేక పూజలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: