చరిత్ర పూర్వయుగ ఆధారాలు

రామగిరి ఖిల్లా ఎక్కడం మొదలుపెట్టి మొదటి దర్వాజకు చేరుకోగానే విరిగిన దర్వాజ, మొండికోట కనిపిస్తాయి. విరిగిన ద్వారానికి కుడి పక్కన క్రీ.శ. 1478సం. నాటి తుమ్మీఖాన్ 10 వేల రూకలు ఖర్చుపెట్టి చేయించిన కోట దర్వాజ శాసనం వుంది. దర్వాజ నుంచి ఎడమ వైపుకు గొల్లభామల దిక్కు పోతే పెండ్లిబావి. బాయి దాటినంక 100మీ.ల దూరంలోని చిన్నగుహలో లింగం లేని పానవట్టం వుంది. ఈ గుహలోనే ఎరుపు రంగులో వేసిన రాతి చిత్రాలు అగుపిస్తాయి. ఈ రాతి […] The post చరిత్ర పూర్వయుగ ఆధారాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

రామగిరి ఖిల్లా ఎక్కడం మొదలుపెట్టి మొదటి దర్వాజకు చేరుకోగానే విరిగిన దర్వాజ, మొండికోట కనిపిస్తాయి. విరిగిన ద్వారానికి కుడి పక్కన క్రీ.శ. 1478సం. నాటి తుమ్మీఖాన్ 10 వేల రూకలు ఖర్చుపెట్టి చేయించిన కోట దర్వాజ శాసనం వుంది. దర్వాజ నుంచి ఎడమ వైపుకు గొల్లభామల దిక్కు పోతే పెండ్లిబావి. బాయి దాటినంక 100మీ.ల దూరంలోని చిన్నగుహలో లింగం లేని పానవట్టం వుంది. ఈ గుహలోనే ఎరుపు రంగులో వేసిన రాతి చిత్రాలు అగుపిస్తాయి. ఈ రాతి చిత్రాలలో ఒక మనిషి, ఒక ఎద్దు, గుర్తించడానికి వీలుకాని జంతువుల బొమ్మలు రెండు, మరొక మనిషి బొమ్మ అగుపిస్తున్నాయి. బొద్దు గీతలలో వున్న ఈ రాతి చిత్రాలు శైలిని బట్టి, వస్తువును బట్టి చాల్కోలిథిక్ పీరియడ్‌కు చెందినవని చెప్పవచ్చు.

రామగిరిఖిల్లాకు అన్ని తొవ్వలు తెలిసిన చరిత్రకారుడు, మార్గదర్శి (గైడ్) సముద్రాల సునీల్ అన్వేషణలో చరిత్ర పూర్వయుగపు ఆధారాలు కొన్ని కొత్తగా వెలుగు చూశాయి. తెలంగాణ రాష్ట్రంలో పెద్దపల్లిలోని రామగిరి ఖిల్లాది ప్రత్యేక చరిత్ర. తెలంగాణ చరిత్రలో రామగిరికొక పేజీ తప్పనిసరి. తెలంగాణలో చరిత్ర పూర్వయుగం, తొలి చారిత్రక దశలు, చారిత్రక యుగం చరిత్ర -సంస్కృతులను అధ్యయనం చేయడానికి రామగిరి ఒక మచ్చుతునక. రామగిరి ఖిల్లా ఎక్కడం మొదలుపెట్టి మొదటి దర్వాజకు చేరుకోగానే విరిగిన దర్వాజ, మొండికోట కనిపిస్తాయి. విరిగిన ద్వారానికి కుడి పక్కన క్రీ.శ. 1478సం. నాటి తుమ్మీఖాన్ 10 వేల రూకలు ఖర్చుపెట్టి చేయించిన కోట దర్వాజ శాసనం వుంది. దర్వాజ నుంచి ఎడమ వైపుకు గొల్లభామల దిక్కు పోతే పెండ్లిబావి. బాయి దాటినంక 100మీ.ల దూరంలోని చిన్నగుహలో లింగం లేని పానవట్టం వుంది. ఈ గుహలోనే ఎరుపు రంగులో వేసిన రాతి చిత్రాలు అగుపిస్తాయి.

ఈ రాతి చిత్రాలలో ఒక మనిషి, ఒక ఎద్దు, గుర్తించడానికి వీలుకాని జంతువుల బొమ్మలు రెండు, మరొక మనిషి బొమ్మ అగుపిస్తున్నాయి. బొద్దు గీతలలో వున్న ఈ రాతి చిత్రాలు శైలిని బట్టి, వస్తువును బట్టి చాల్కోలిథిక్ పీరియడ్‌కు చెందినవని చెప్పవచ్చు. కొత్త రాతి యుగం నుంచి పెదరాతి యుగానికి పరిణమించే సమయంలోని మానవ సంస్కృతి ప్రతిబింబాలనవచ్చు. నేటికి 4, 5 వేల సంవత్సరాలకు పూర్వానివి ఈ రాతి చిత్రాలు.

ఈ గుహకు అవతలి వైపు గుహలో పదునైన మొన వున్న పరికరంతో గీరి గీసిన గీరబొమ్మలు (పెట్రోగ్లైఫ్స్) వున్నాయి. ఈ బొమ్మలలో ఎడమ చేత త్రిశూలం ధరించిన నిలబడ్డ వేటగాడు, పక్కన పెద్దపక్షి అగుపించాయి. ఈ చిత్రాలు రాతి చిత్రాల వేసే కాలానికి పూర్వానివి. ఠాకూర్ రాజారాం సింగ్ నర్రఏషాలపల్లెలో ఇటువంటి పెట్రోగ్లైఫ్స్ ను చూసి, వాటిని మధ్యరాతి యుగం చిత్రాలని రాశాడు. వాటిని మనం వివి కృష్ణశాస్త్రి పుస్తకంలో చూడవచ్చు. పోలికలతో ఈ రామగిరి పెట్రోగ్లైఫ్స్ కూడా మధ్యరాతి యుగం నాటి చిత్రాలని చెప్పవచ్చు. రాజారాం సింగ్‌కే రామగిరికొండ మీద విశేషమైన సూక్ష్మరాతి పరికరాలు రాశులుగా లభించాయి. అక్కడికి 10మీ.ల దూరంలోనే పెదరాతి యుగానికి చెందిన రాళ్ళకుప్ప సమాధులు 36 వున్నాయి. ఇవన్నీ రాతినేల మీదనే రాతి కుప్పలతో ఏర్పరచిన సమాధులు.

చాలా అరుదైనవి. వీటిలో మొదటి వరుసలో 6 వ సమాధి దాటగానే పడిపోయిన మెన్హర్ కనిపిస్తుంది. మిగతా చోట్ల సమాధుల అంచుల్లో రాళ్ళ పేర్పుతో నిలిపిన రాతి స్తంభాల వంటి మెన్హర్లు ప్రతి సమాధికి కనిపిస్తాయి. ఈ సమాధులలో కొన్నింటిలో ఎముకలు దొరికాయి. ఆ పరిసరాల్లో ఇనుము చిట్టేలు, బండలపై రాతిబొద్దులు(కప్ మార్క్స), కుండపెంకులు విరివిగా కనిపిస్తున్నాయి. వాటిని దాటిపోతే గొల్లభామలు, సూటిగా పోతే నందిముక్కు, దానికి ఎడమ వైపు నడిస్తే పాండవలొంకకు చేరుకుంటాం. అక్కడ 2 దిగుడు బావులు, ఒక చేద బావి వున్నాయి. ఆ పక్కన నివాసాల శిథిలాలు కనిపిస్తాయి. రామగిరిఖిల్లా మీద చరిత్ర పూర్వయుగ సంస్కృతి ఆనవాళ్ళు వెతికిన కొద్ది లభిస్తాయి. అన్వేషణ కొనసాగిస్తే ఇంకా చారిత్రకాధారాలు తప్పక లభిస్తాయి.

ramagiri temple history in telugu

శ్రీరామోజు, హరగోపాల్, 9949498698

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post చరిత్ర పూర్వయుగ ఆధారాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: