కచ్చలూరు బోటు బయటికొచ్చింది

  ధర్మాడి బృందం కృషి ఫలించింది పాపికొండల యాత్రలో మునిగిన బోటు38 రోజుల తర్వాత వెలికితీత లభించిన ఎనిమిది మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా చెదిరిపోయాయి డిఎన్‌ఎ పరీక్షల తర్వాత బంధువులకు అప్పగింత హైదరాబాద్ : తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో రాయల్‌వశిష్ట బోటును వెలికితీయడంలో ధర్మాడి సత్యం బృందం విజయం సాధించింది. బోటు ముని గి 38 రోజుల తర్వాత ఎట్టకేలకు బోటుతో పాటు 8 మృతదేహాలను ఒడ్డుకు చేర్చారు. మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉండటంతో […] The post కచ్చలూరు బోటు బయటికొచ్చింది appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ధర్మాడి బృందం కృషి ఫలించింది

పాపికొండల యాత్రలో మునిగిన బోటు38 రోజుల తర్వాత వెలికితీత
లభించిన ఎనిమిది మృతదేహాలు
గుర్తుపట్టలేని విధంగా చెదిరిపోయాయి
డిఎన్‌ఎ పరీక్షల తర్వాత బంధువులకు అప్పగింత

హైదరాబాద్ : తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో రాయల్‌వశిష్ట బోటును వెలికితీయడంలో ధర్మాడి సత్యం బృందం విజయం సాధించింది. బోటు ముని గి 38 రోజుల తర్వాత ఎట్టకేలకు బోటుతో పాటు 8 మృతదేహాలను ఒడ్డుకు చేర్చారు. మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉండటంతో డిఎన్‌ఎ పరీక్షలు నిర్వహించి మృతదేహాలను వారి సంబంధీకులకు అప్పగిస్తామని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ఈక్రమంలో ధర్మాడి సత్యం బృందం, స్కూబా డైవర్లు తీవ్రంగా శ్రమించి నది లో నుంచి బోటును వెలికితీయడంలో శ్రమించా రు. బోటులో ఉన్న మృతదేహాల కారణంగా దుర్వాసన వస్తుండటంతో ఎవరూ బోటు వద్దకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది.

బోటులో గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న 8 మృతదేహాలను గుర్తించారు. పూర్తి గా కుళ్లిపోయి ఎముకలు బయటపడుతున్నాయి. గత నెల 15న 77 మందితో పాపికొండల పర్యటనకు బయలుదేరిన వశిష్ఠ బోటు కచ్చులూరు సమీపంలో గోదావరిలో మునిగిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 39 మంది మృతిచెందగా, 26 మంది సురక్షితంగా బయటపడ్డారు. మరో 12 మంది ఆచూకీ తెలియలేదు. దీంతో అప్పటి నుంచి నదిలో మునిగిపోయిన బోటును వెలికితీసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. బోటును వెలికితీసే బాధ్యతను కాకినాడకు చెందిన ధర్మాడి సత్యంకు అప్పగించారు. మునిగిపోయిన బోట్లు, పడవలను వెలికితీయడంలో మంచి నైపుణ్యం ఉన్న ధర్మాడి సత్యం.. తన బృందంతో గత కొన్నిరోజులుగా బోటును వెలికితీసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు.

ఫలితం లేకపోవడంతో విశాఖ నుంచి స్కూబా డైవర్లను తీసుకొచ్చారు. వారు నదీగర్భంలోకి వెళ్లి ఇసుకులో కూరుకుపోయిన బోటు కు లంగర్లు, ఐరన్ రోప్ కట్టడంతోఅతికష్టం మీద పొక్లెనర్‌లతో బయటకు లాగారు. గత 38 రోజులుగా నదీ గర్భంలోనే బోటు ఉండటంతో పూర్తిగా ధ్వంసమైంది. బోటులో ఐదు మృతదేహాలు కనిపిస్తున్నప్పటికీ.. అందులో ఇంకా ఎన్ని మృతదేహాలు ఉన్నాయన్నది అధికారికంగా ప్రకటించలేదు.

నీటిలో తేలియాడుతున్న మరికొన్ని మృతదేహాలను ఒడ్డుకు చేరుస్తున్నారు.ఎన్ని అవాంతరాలు ఎదురైనా పట్టువీడకుండా బోటువెలికితీసిన ధర్మాడి సత్యం బృందానికి సమీప గ్రామాల ప్రజలు అభినందనలు తెలిపారు. బోటును ఒడ్డుకు చేర్చిన అనంతరం ధర్మాడి సత్యం మీడియాతో మాట్లాడుతూ.. లోతు ఎక్కువగా ఉండటం వల్లే వెలికితీత ప్రక్రియ ఆలస్యమైందని తెలిపారు. బోటు ను వెలికితీసినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. బోటు వెలికితీతలో విశాఖ స్కూబా డైవర్లు చేసిన కృషి మరువలేనిదని చెప్పారు.

ధర్మాడికి ప్రశంసల వెల్లువ
ఆపరేషన్ రాయల్ వశిష్ట బోటును వెలికితీయడం లో విజయం సాధించిన ధర్మాడి సత్యం బృందంపై అటు ప్రజలు, ఇటు అధికారులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. సెప్టెంబర్ 28న ధర్మాడి సత్యం బృందం ఆపరేషన్ రాయల్ వశిష్ట మొదలు పెట్టిం ది. ఐదు రోజుల పాటు గాలింపు ప్రక్రియ సవ్యం గా సాగినప్పటికీ.. మళ్లీ వరద పోటెత్తడంతో ఈ నెల 3న ఆపరేషన్ నిలిపివేశారు. వరద తగ్గుముఖం పట్టిన తర్వాత మళ్లీ 16న బోటును వెలికితీసే ప్రయత్నాలు ముమ్మరం చేసి సక్సెసయ్యారు.

Royal Vashishta boat extraction

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కచ్చలూరు బోటు బయటికొచ్చింది appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: