నేను మారను…నేనింతే

  రెండు దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్న అందాల తార త్రిష కథానాయికగా ఇప్పటికీ బిజీ లైఫ్‌ను గడుపుతోంది. అయితే ఇన్నేళ్లలో తాను ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని కెరీర్‌లో అంచెలంచెలుగా ఎదిగానని అంటోంది త్రిష. “కెరీర్ ప్రారంభంలో కొందరు నన్ను… సన్నగా ఉన్నావు, సినిమాలకు పనికిరావని కామెంట్ చేశారు. పైగా మోడలింగ్ రంగం నుంచి వచ్చేవాళ్లు సినిమాల్లో రాణించలేరని అన్నారు. కాస్త లావెక్కు అని సలహా ఇచ్చినవారికి నేను ఒకటే సమాధానం చెప్పాను. నేను మారను… నేనింతే […] The post నేను మారను… నేనింతే appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

రెండు దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్న అందాల తార త్రిష కథానాయికగా ఇప్పటికీ బిజీ లైఫ్‌ను గడుపుతోంది. అయితే ఇన్నేళ్లలో తాను ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని కెరీర్‌లో అంచెలంచెలుగా ఎదిగానని అంటోంది త్రిష. “కెరీర్ ప్రారంభంలో కొందరు నన్ను… సన్నగా ఉన్నావు, సినిమాలకు పనికిరావని కామెంట్ చేశారు. పైగా మోడలింగ్ రంగం నుంచి వచ్చేవాళ్లు సినిమాల్లో రాణించలేరని అన్నారు. కాస్త లావెక్కు అని సలహా ఇచ్చినవారికి నేను ఒకటే సమాధానం చెప్పాను. నేను మారను… నేనింతే అని అన్నాను. ఆతర్వాత కెరీర్‌లో పట్టుదలతో దూసుకుపోయి టాప్ హీరోయిన్‌గా పాపులారిటీ తెచ్చుకున్నాను”అని ఈ భామ పేర్కొంది. కెరీర్ ప్రారంభం నుంచి పలువురు ముంబయ్ హీరోయిన్ల మధ్య త్రిష తనదైన శైలిలో రాణించి టాలీవుడ్, కోలీవుడ్‌లలో గ్లామరస్ తారగా క్రేజ్‌ను సంపాదించుకుంది.

Trisha still lives busy life as a heroine

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post నేను మారను… నేనింతే appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.