చిన్నప్పటి నుంచే పరిచయం చేయాలి

  కొంతమంది పిల్లలకు ఆటలైనా, బయటకు వెళ్లాలన్నా చాలా ఇష్టం, సరదా కూడా. ఎగ్జిబిషన్లు మనిషికి ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తాయి. అన్ని వయసుల వారినీ అలరిస్తాయి. అందుకే ఆర్ట్ ఎగ్జిబిషన్, బుక్ ఎగ్జిబిషన్, ఫిల్మ్ ఫెస్టివల్స్ అంటే పిల్లలు కూడా ఆసక్తి కనబరుస్తారు. అయితే, ఇలాంటి వాటికి పిల్లల్ని వెంట తీసుకెళ్లడానికి చాలా మంది తల్లిదండ్రులు ఇష్టపడరు. పిల్లలతో వెళ్తే విసిగిస్తారని భావిస్తారు. పైగా ఇవి పిల్లలకు అర్థం కావని అనుకుంటారు. అయితే ఇలాంటి […] The post చిన్నప్పటి నుంచే పరిచయం చేయాలి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

కొంతమంది పిల్లలకు ఆటలైనా, బయటకు వెళ్లాలన్నా చాలా ఇష్టం, సరదా కూడా. ఎగ్జిబిషన్లు మనిషికి ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తాయి. అన్ని వయసుల వారినీ అలరిస్తాయి. అందుకే ఆర్ట్ ఎగ్జిబిషన్, బుక్ ఎగ్జిబిషన్, ఫిల్మ్ ఫెస్టివల్స్ అంటే పిల్లలు కూడా ఆసక్తి కనబరుస్తారు. అయితే, ఇలాంటి వాటికి పిల్లల్ని వెంట తీసుకెళ్లడానికి చాలా మంది తల్లిదండ్రులు ఇష్టపడరు. పిల్లలతో వెళ్తే విసిగిస్తారని భావిస్తారు. పైగా ఇవి పిల్లలకు అర్థం కావని అనుకుంటారు. అయితే ఇలాంటి ప్రదేశాలకు పిల్లలను తరచూ తీసుకెళ్లడం ద్వారా వీటిల్లో ఏదో విశేషం ఉందన్న భావన వారిలో కలుగుతుంది.

పుస్తకాలను, పెయింటింగ్స్‌నూ, సినిమాలను మొదట్లో పైపైనే చూస్తారేమో కానీ, పోనుపోను వాటిపై తెలియకుండానే ఆసక్తిని పెంచుకుంటారు. వారి వ్యక్తిత్వ నిర్మాణంలో వీటి ప్రభావం కూడా ఎంతో ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. ఆర్ట్, బుక్స్ వంటి విషయాలను ఒక్కసారిగా అర్థం చేసుకోవడం కాస్త కష్టమే. వీటిని అర్థం చేసుకోవడమనేది సహజంగా దశలుదశలుగా జరిగే ప్రక్రియ. అందుకే ఇలాంటి విషయలపై బాల్యం నుంచే అవగాహన కలిగించడం మంచిది. దీనివల్ల వారి భావి జీవితానికి ఎంతో ప్రయోజనం కలుగుతుంది.

Exhibitions introduce a new world to man

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post చిన్నప్పటి నుంచే పరిచయం చేయాలి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: