‘రాములో రాములా…‘ ప్రోమో చూశారా?

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తోన్న క్రేజీ మూవీ ‘అల వైకుంఠపురంలో’. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్, రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బన్నీకి జోడీగా రెండోసారి పొడుగుకాళ్ళ సుందరి పూజా హెగ్డే నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. తాజాగా మూవీలోని ‘రాములో రాములా…‘ అనే రెండోవ పాట ప్రోమోను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఓ క్లబ్ లో వచ్చే ఈ పాటలో అల్లు […] The post ‘రాములో రాములా…‘ ప్రోమో చూశారా? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తోన్న క్రేజీ మూవీ ‘అల వైకుంఠపురంలో’. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్, రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బన్నీకి జోడీగా రెండోసారి పొడుగుకాళ్ళ సుందరి పూజా హెగ్డే నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. తాజాగా మూవీలోని ‘రాములో రాములా…‘ అనే రెండోవ పాట ప్రోమోను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఓ క్లబ్ లో వచ్చే ఈ పాటలో అల్లు అర్జున్, పూజాహెగ్డే కలిసి హుషారుగా వేసే స్టెప్పులు ఆకట్టుకుంటున్నాయి. ఈపాట ఆడియోతోపాటు విజువల్ సూపర్ గా ఉంది. కాగా, ‘సామజవరగమన…’ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ఈ సాంగ్ కూడా అదే రేంజ్ లో మాంచి కిక్ ఇచ్చేలా ఉంది. ఈ పాటకు కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా… థమన్ సంగీత సారథ్యంలో అనురాగ్ కులకర్ణి, మంగ్లీ పాడారు. ఈ చిత్రంలో టబు, రాజేంద్రప్రసాద్, తనికెళ్ల భరణి, మురళీ శర్మ, సునీల్, నవదీప్, సుశాంత్, నివేతా పేతురాజ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇక, ఈ చిత్రాన్ని వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి అన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు చిత్రయూనిట్.

Ramuloo Ramulaa.. song promo released

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ‘రాములో రాములా…‘ ప్రోమో చూశారా? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: