పులావ్ ఇలా చేస్తే నోరూరుతుంది…

  పాలక్ పులావ్ కావల్సినవి : బియ్యం పావుకిలో, పాలకూర: 6 కట్టలు, ( చిన్నవి), ఉల్లిపాయ: ఒకటి, తాజా బఠాణీలు:అరకప్పు, పచ్చిమిర్చి: రెండు, వెల్లుల్లి రెబ్బలు: 4, అల్లం: అంగుళం ముక్క, జీలకర్ర: టీస్పూను, పులావ్ ఆకు: ఒకటి, లవంగాలు: రెండు, యాలకులు: రెండు, దాల్చిన చెక్క: అంగుళం ముక్క, కారం: టీస్పూను, పసుపు: అర టీస్పూను, గరం మసాలా:అరటీస్పూను, ఉప్పు: టీస్పూను, నూనె లేదా నెయ్యి: టేబుల్‌స్పూను తయారీ : ప్రెషర్ కుక్కర్‌లో నెయ్యి […] The post పులావ్ ఇలా చేస్తే నోరూరుతుంది… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

పాలక్ పులావ్

కావల్సినవి : బియ్యం పావుకిలో, పాలకూర: 6 కట్టలు, ( చిన్నవి), ఉల్లిపాయ: ఒకటి, తాజా బఠాణీలు:అరకప్పు, పచ్చిమిర్చి: రెండు, వెల్లుల్లి రెబ్బలు: 4, అల్లం: అంగుళం ముక్క, జీలకర్ర: టీస్పూను, పులావ్ ఆకు: ఒకటి, లవంగాలు: రెండు, యాలకులు: రెండు, దాల్చిన చెక్క: అంగుళం ముక్క, కారం: టీస్పూను, పసుపు: అర టీస్పూను, గరం మసాలా:అరటీస్పూను, ఉప్పు: టీస్పూను, నూనె లేదా నెయ్యి: టేబుల్‌స్పూను

తయారీ : ప్రెషర్ కుక్కర్‌లో నెయ్యి వేసి వేడెక్కాక జీలకర్ర వేసి వేయించాలి. పులావ్ ఆకు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క కూడా వేసి సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి ముక్కలు వేసి వేయించాలి. దంచిన పచ్చిమిర్చి ముద్ద, ఉల్లిముక్కలు వేసి వేగాక, సన్నగా తరిగిన పాల కూర వేసి వేగనివ్వాలి. బఠాణీలు వేసి ఓ నిమిషం వేగాక పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా వేసి కడిగిన బియ్యం కూడా వేసి కలిపి సుమారు అరలీటరు నీళ్లు పోసి మూతపెట్టి మూడు విజిల్స్ రానిచ్చి దించాలి.

మష్రూమ్ పులావ్

కావలసినవి : బాస్మతి బియ్యం: పావుకిలో, నెయ్యి: 2టేబుల్ స్పూన్లు, లవంగాలు: రెండు, యాలకులు: ఒకటి, దాల్చినచెక్క: అంగుళం ముక్క, ఉల్లిపాయలు: రెండు, వెల్లుల్లి రెబ్బలు: ఐదు, అల్లం :అంగుళం ముక్క మిరియాలపొడి: టేబుల్‌స్పూను, ఉప్పు: తగినంత, బటన్ పుట్టగొడుగులు: పావుకిలో

తయారీ : బియ్యం కడిగి నాననివ్వాలి. వెల్లుల్లి, అల్లం, మిరియాలు తగినన్ని నీళ్లు పోసి మెత్తని ముద్దలా రుబ్బాలి. ప్రెషర్ పాన్‌లో నెయ్యి వేసి కాగాక లవంగాలు, యాలకులు, దాల్చినచెక్క వేసి వేగాక సన్నగా తరిగిన ఉల్లిముక్కలు వేసి వేగాక రుబ్బిన మసాలా ముద్ద వేసి వేయించాలి. ఇప్పుడు కోసిన పుట్టగొడుగు ముక్కలు వేసి పది నిమిషాలు వేగనివ్వాలి. తరువాత కడిగి వడబోసి ఉంచిన బియ్యం, ఒకటిన్నర గ్లాసుల నీళ్లు పోసి మూతపెట్టి మూడు విజిల్స్ రానివ్వాలి. మూత తీశాక ఓ సారి కలిపి వడ్డించాలి.

అచరి పనీర్ పులావ్

కావలసినవి : పనీర్ ముక్కలు: ఒకటిన్నర కప్పులు, బియ్యం: కప్పు, నూనె: టేబుల్ స్పూను, ఆవాలు: టీస్పూను, జీలకర్ర: టీస్పూను, ఉల్లిగింజలు: టీస్పూను, పసుపు: పావు టీస్పూను, కారం: టీస్పూను,పెరుగు: అరకప్పు, పచ్చిమిర్చి ముద్ద: టీస్పూను, దాల్చినచెక్క: 2 అంగుళాల ముక్క, లవంగాలు: రెండు, షాజీరా: అరటీస్పూను, యాలకులు: రెండు, నూనె:టేబుల్‌స్పూను, ఉప్పు: తగినంత, కొత్తిమీర తురుము: టేబుల్ స్పూను

తయారీ : అన్నం విడిగా ఉడికించి ఆర నివ్వాలి. బాణలిలో టీస్పూను నూనె వేసి ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఉల్లిగింజలు వేసి వేయించాలి. తరవాత పసుపు, కారం వేసి స్టవ్ ఆఫ్ చేసి పెరుగు వేసి బాగా కలపాలి. ఇప్పుడు పచ్చిమిర్చి ముద్ద కూడా వేసి బాగా కలిపి పనీర్ ముక్కలు వేసి ఒకసారి కలిపి అరగంట సేపు పక్కన ఉంచాలి. మరో బాణలిలో మిగిలిన నూనె వేసి దాల్చిచెక్క, లవంగాలు, షాజీరా, యాలకులు వేసి ఓ నిమిషం వేగాక ఉడికించిన అన్నం వేసి కలపాలి. ఇప్పుడు పక్కన ఉంచిన పనీర్ ముక్కల్ని వేసి బాగా కలిపి మీడియం మంటమీద రెండు నిమిషాలు ఉడికించి, కొత్తిమీర చల్లి దించాలి.

 

Pulao Recipe in Telugu

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post పులావ్ ఇలా చేస్తే నోరూరుతుంది… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.