పుప్పాల్‌గూడలోని 190 ఎకరాలు ప్రభుత్వానిదే

సుప్రీంకోర్టులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు భూముల విలువ సుమారు రూ.4 వేల కోట్లు కోకాపేట, మియాపూర్ భూముల కేసుల్లో ప్రభుత్వమే విజయం సాధిస్తుంది: రెవెన్యూ సంఘాలు   మనతెలంగాణ/హైదరాబాద్: గత ప్రభుత్వాల హయాంలో కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను కాపాడుకోవడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందడుగు వేస్తోంది. కబ్జాకు గురైన భూములకు సంబంధించి కోర్టు కేసులను గెలిచి, వాటిని వేలం వేసి వాటి ద్వారా నిధులను సమీకరించాలని సిఎం కెసిఆర్ నిర్ణయించిన విషయం తెలిసిందే. గత బడ్జెట్‌లో సిఎం […] The post పుప్పాల్‌గూడలోని 190 ఎకరాలు ప్రభుత్వానిదే appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

సుప్రీంకోర్టులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు
భూముల విలువ సుమారు రూ.4 వేల కోట్లు
కోకాపేట, మియాపూర్ భూముల కేసుల్లో
ప్రభుత్వమే విజయం సాధిస్తుంది: రెవెన్యూ సంఘాలు

 

మనతెలంగాణ/హైదరాబాద్: గత ప్రభుత్వాల హయాంలో కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను కాపాడుకోవడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందడుగు వేస్తోంది. కబ్జాకు గురైన భూములకు సంబంధించి కోర్టు కేసులను గెలిచి, వాటిని వేలం వేసి వాటి ద్వారా నిధులను సమీకరించాలని సిఎం కెసిఆర్ నిర్ణయించిన విషయం తెలిసిందే. గత బడ్జెట్‌లో సిఎం కెసిఆర్ ప్రభుత్వ భూముల అమ్మకానికి సంబంధించి విషయాన్ని ప్రస్తావించడంతో పాటు ఎస్‌డిఎఫ్ నిధుల ద్వారా రూ.10 వేల కోట్లను సమీకరిస్తామని సభా ముఖంగా పేర్కొన్నారు. ప్రస్తుతం మంగళవారం పుప్పాల్‌గూడలో 190 ఎకరాల భూమికి సంబంధించి కోర్టు కేసుకు సంబంధించి ప్రభుత్వం విజయం సాధించింది. సుమారు దీనివిలువ రూ.4 వేల కోట్లు ఉంటుందని రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. కొన్ని సంవత్సరాలుగా ఈ భూమికి సంబంధించిన కేసు కోర్టులో నడుస్తోంది. 2014 సంవత్సరంలో బంజరాభవన్‌కు భూమి కేటాయించాలని ప్రభుత్వం భావించింది. ఆ సమయంలో ఈ భూమి కబ్జాకు గురయినట్టు ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది. ఎలాగైనా కేసును గెలవాలన్న కృతనిశ్చయంతో సీనియర్ అధికారులకు ప్రభుత్వం బాధ్యతలను అప్పగించింది. అప్పటి నుంచి ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు. 2016 సంవత్సరంలో పుప్పాలగూడకు సంబంధించిన కేసును హైకోర్టులో ప్రభుత్వం గెలిచింది. అనంతరం కేసు ఓడిపోయిన వారు సుప్రీంకోర్టుకు వెళ్లడంతో మంగళవారం దీనిపై సుప్రీంకోర్టు తుది తీర్పును ప్రకటించింది. ఈ భూమి ప్రభుత్వానికే చెందుతుందని కోర్టు తీర్పునిచ్చింది. పుప్పాల్‌గూడ భూములకు సంబంధించిన కేసును ప్రభుత్వం గెలవడంతో కోకాపేటలోని 100 ఎకరాల భూమి, మియాపూర్‌లోని 500 ఎకరాల భూములకు సంబంధించిన కేసులను గెలవాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్టుగా అధికారులు పేర్కొంటున్నారు.

కోర్టు అడిగిన ప్రతి డాక్యుమెంట్

పుప్పాల్‌గూడ భూములకు సంబంధించి సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్న సమయంలో ప్రభుత్వం తరఫు లాయర్లు అడిగిన ప్రతి డాక్యుమెంట్‌ను అందించడంలో రాష్ట్ర రెవెన్యూ అధికారులు ముందున్నారు. ఈ నేపథ్యంలో పుప్పాల్‌గూడ కేసు త్వరతగతిన పరిష్కారం అయ్యిందని రెవెన్యూ వర్గాలు పేర్కొంటున్నాయి. మిగతా ప్రభుత్వ భూములకు సంబంధించిన కేసుల్లో కూడా కోర్టు అడిగిన ప్రతి డాక్యుమెంట్‌ను అందించాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించడంతో ఆ దిశగా అధికారులు ముందుకు వెళుతున్నారు.

ఆర్డీఓ స్థాయి అధికారులకు బాధ్యతలు

మియాపూర్‌తో పాటు పలు ప్రభుత్వానికి చెందిన భూములు కొందరు కిందిస్థాయి అధికారులు కబ్జాదారులతో కుమ్మక్కు కావడం వల్లే భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ శాఖతో పాటు రెవెన్యూ అధికారుల వద్ద ప్రభుత్వ భూములకు సంబంధించిన కచ్చితమైన డేటాను ఉండాలని, దీనివల్ల ప్రభుత్వ భూములను కాపాడుకోవచ్చని, ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్టుగా తెలిసింది. ఇప్పటికే పలు జిల్లాల్లో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని దీంతోపాటు హెచ్‌ఎండిఏ, జిహెచ్‌ఎంసి పరిధిలోని భూములకు సంబంధించిన భూములు సైతం కబ్జాదారుల గుప్పిట్లో ఉన్నాయని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ఈ భూములపై ప్రభుత్వం తరఫున కోర్టుల్లో ఇప్పటికే అధికారులు కౌంటర్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో కబ్జాకు గురైన భూములకు సంబంధించిన కేసులు గెలవాలన్న పట్టుదలతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. అందులో భాగంగానే రెవెన్యూ శాఖకు చెందిన ఆర్డీఓ స్థాయి అధికారులకు ఈ భూములకు సంబంధించిన కేసు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది.

ఆ భూములపై గెజిట్ జారీ చేయాలన్న ఆలోచనతో ముందుకు చాలావరకు భూ రికార్డుల ప్రక్షాళన పూర్తయినా రెవెన్యూ రికార్డుల్లోని 22 ఏ (1) నుంచి 22 డీ వరకు ఉన్న భూములను గుర్తించి నివేదికను ఇవ్వడంలో రెవెన్యూ అధికారులు నిర్లక్షం వహిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ భూములను గుర్తించి వెంటనే ఆ భూములపై గెజిట్ జారీ చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలిసింది. ఇప్పటికే ఈ భూములు గుర్తింపును త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం రెవెన్యూ వర్గాలను అప్రమత్తం చేసినట్టుగా సమాచారం.

కేసు గెలవడం సంతోషంగా ఉంది: రాజేంద్రనగర్ ఆర్డీఓ చంద్రకళ

పుప్పాల్‌గూడలోని 190 ఎకరాల భూములకు సంబంధించి కేసు సుప్రీం కోర్టులో  గెలవడం సంతోషంగా ఉంది. ప్రభుత్వం తరఫు లాయర్లు అడిగిన ప్రతి డాక్యుమెంట్‌ను రెవెన్యూ శాఖ తరఫున తాము అందజేశాం. ఈ విజయంతో మరిన్ని కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను కాపాడుకుంటాం. కోకాపేటతో పాటు మియాపూర్ భూములకు సంబంధించిన కేసులు కోర్టుల్లో నడుస్తున్నాయి. వాటిలో కూడా ప్రభుత్వమే విజయం సాధిస్తుంది.

 

190 Acrs Land Belongs to Telangana Govt: Supreme

The post పుప్పాల్‌గూడలోని 190 ఎకరాలు ప్రభుత్వానిదే appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: