ఓపెనర్‌గా రాణించడం ఆనందంగా ఉంది…

  రాంచీ: టెస్టుల్లో ఓపెనర్‌గా రాణించడం చాలా ఆనందంగా ఉందని టీమిండియా స్టార్ ఓపెనర్, హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ అన్నాడు. దక్షిణాఫ్రికా జట్టుపై మూడు టెస్టుల సిరీస్ ను భారత్ క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్ లో ఓపెనర్ గా బరిలోకి దిగిన రోహిత్(529) అద్భుతంగా ఆడాడు. ఓ డబుల్ సెంచరీ, రెండు భారీ సెంచరీలతో తన సత్తా చాటాడు. దీంతో చివరి టెస్టులో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకోవడంతోపాటు మ్యాన్ […] The post ఓపెనర్‌గా రాణించడం ఆనందంగా ఉంది… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

రాంచీ: టెస్టుల్లో ఓపెనర్‌గా రాణించడం చాలా ఆనందంగా ఉందని టీమిండియా స్టార్ ఓపెనర్, హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ అన్నాడు. దక్షిణాఫ్రికా జట్టుపై మూడు టెస్టుల సిరీస్ ను భారత్ క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్ లో ఓపెనర్ గా బరిలోకి దిగిన రోహిత్(529) అద్భుతంగా ఆడాడు. ఓ డబుల్ సెంచరీ, రెండు భారీ సెంచరీలతో తన సత్తా చాటాడు. దీంతో చివరి టెస్టులో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకోవడంతోపాటు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ను కూడా గెలుచుకున్నాడు. ఈ సందర్భంగా రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడాడు. ఈ సిరీస్ లో పాజిటీవ్ ఎనర్జీతో బ్యాటింగ్ చేశానని, ముఖ్యంగా కొత్త బంతిని ఎలా ఎదర్కోవాలనే దానిపైనే ఎక్కువగా శ్రద్ధా చూపానన్నాడు. ప్రపంచంలో ఎక్కడైనా కొత్త బంతిని ఎదుర్కోవడం కొంచెం కష్టంగానే ఉంటుందని అన్నాడు. ప్రారంభంలో క్రమశిక్షణతో బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నానని.. కుదురుకున్న తర్వాత తన శైలిలో బ్యాటింగ్ చేశానని హిట్ మ్యాన్ తెలిపాడు. వన్డే, టీ20ల్లోనూ ఓపెనర్‌గా ఆడినప్పటికీ, టెస్టుల్లో రెడ్‌బాల్‌తో గేమ్‌ కొత్తగా అనిపించిందని పేర్కొన్నాడు. ఇక, తనపై నమ్మకముంచి ఓపెనర్‌గా అవకాశమిచ్చిన జట్టు యాజమాన్యం, కోచ్‌ రవిశాస్త్రి, కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి ఈ సందర్భంగా రోహిత్‌ ధన్యవాదాలు తెలిపాడు.

కాగా, ఈ సిరీస్ లో రోహిత్ పలు రికార్డులు కూడా నెలకొల్పాడు. ఓ టెస్టు సిరీస్‌లో అత్యధిక సిక్సర్లు (19) బాదిన బ్యాట్స్‌మెన్‌ గానూ రోహిత్‌ రికార్డు సృష్టించాడు. అంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్ బ్యాట్స్ మెన్ హిట్ మెయర్(15) పేరిట ఉంది.  అంతేకాదు, ఆసీస్ దిగ్గజం బ్రాడ్‌మన్‌ టెస్టు సగటు(98.22)ను సైతం రోహిత్‌(99.84) బ్రేక్ చేశాడు. ఇండియా-సౌతాఫ్రికా మధ్య ఇప్పటివరకు జరిగిన సిరీస్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రోహిత్‌(529) రికార్డు సృష్టించాడు.

Rohit sharma thanks to Coach Ravi Shastri and Kohli

The post ఓపెనర్‌గా రాణించడం ఆనందంగా ఉంది… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: