జుట్టు కేసరి

జుట్టు విరబోసుకున్నట్టు కనిపిస్తున్న ఈ జంతువేంటా అనుకుంటున్నారా… అంత అనుమానం అక్కర్లేదు ఇది కుక్కే. దీన్ని ఆఫ్గాన్ హౌండ్ అని పిలుస్తారు. ఆడవాళ్ల జట్టును పోలినట్లు తలమీద పొడవాటి వెంట్రుకలు ఉండటం వీటి ప్రత్యేకత. తోక మినహా ఒళ్లంతా ఉండే ఈ వెంట్రుకలు విపరీతమైన చలి, వేడిల నుంచి ఈ కుక్కలను కాపాడతాయి. ఆఫ్గాన్‌హౌండ్ గంటకు సుమారు 65 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతుంది. అంటే ఒక రేసు గుర్రం పరిగెత్తేంత వేగం అన్నమాట. ప్రస్తుతం భూమిమీద ఉన్న […] The post జుట్టు కేసరి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

జుట్టు విరబోసుకున్నట్టు కనిపిస్తున్న ఈ జంతువేంటా అనుకుంటున్నారా… అంత అనుమానం అక్కర్లేదు ఇది కుక్కే. దీన్ని ఆఫ్గాన్ హౌండ్ అని పిలుస్తారు. ఆడవాళ్ల జట్టును పోలినట్లు తలమీద పొడవాటి వెంట్రుకలు ఉండటం వీటి ప్రత్యేకత. తోక మినహా ఒళ్లంతా ఉండే ఈ వెంట్రుకలు విపరీతమైన చలి, వేడిల నుంచి ఈ కుక్కలను కాపాడతాయి. ఆఫ్గాన్‌హౌండ్ గంటకు సుమారు 65 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతుంది. అంటే ఒక రేసు గుర్రం పరిగెత్తేంత వేగం అన్నమాట. ప్రస్తుతం భూమిమీద ఉన్న అతి పురాతనమైన కుక్కల జాతిలో ఇది ఒకటట. 4000 ఏళ్లక్రితమే ఈ జాతి శునకాలు భూమ్మీద ఉన్నట్టు ఆధారాలున్నాయి. ప్రఖ్యాత చిత్రకారుడు పికాసో కూడా ఈ జాతి కుక్కను ఎంతో ప్రేమగా పెంచుకున్నాడట. చర్మంలో ఉండే ప్రత్యేక గ్రంథుల వల్ల వీటి నుంచి ఒకరకమైన సువాసన వస్తుందట. ఈ శునకాలు ఎక్కువగా ఆఫ్గనిస్థాన్‌లో పెరుగతాయి.

Afghan Hound Dog

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post జుట్టు కేసరి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.