మలేషియాతో వాణిజ్యానికి బ్రేకులు?

మలేషియన్ పామాయిల్ కౌన్సిల్ ప్రకారం ఈ సంవత్సరం జనవరి నుంచి సెప్టెంబరు వరకు 106.98 శాతం పెరిగాయి. అంటే దాదాపు 1400 కోట్ల రూపాయల విలువైన దిగుమతులు మలేషియాతో శతాబ్దాలుగా భారతదేశానికి సంబంధాలున్నాయి. అందుకే వాణిజ్య నియమాలను సరళీకరించి అక్కడి నుంచి ఎక్కువగా పామాయిల్ దిగుమతి చేసుకుంటున్నామని తనేజా అన్నారు. అయితే జమ్ము కశ్మీరు విషయంలో మలేషియా విధానాలు భారత ప్రజల మనోభావాలను తీవ్రంగా గాయపరిచాయని చెప్పారు. కాని తొందరపడి తీసుకునే నిర్ణయాలు మంచివి కావని కూడా […] The post మలేషియాతో వాణిజ్యానికి బ్రేకులు? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మలేషియన్ పామాయిల్ కౌన్సిల్ ప్రకారం ఈ సంవత్సరం జనవరి నుంచి సెప్టెంబరు వరకు 106.98 శాతం పెరిగాయి. అంటే దాదాపు 1400 కోట్ల రూపాయల విలువైన దిగుమతులు మలేషియాతో శతాబ్దాలుగా భారతదేశానికి సంబంధాలున్నాయి. అందుకే వాణిజ్య నియమాలను సరళీకరించి అక్కడి నుంచి ఎక్కువగా పామాయిల్ దిగుమతి చేసుకుంటున్నామని తనేజా అన్నారు. అయితే జమ్ము కశ్మీరు విషయంలో మలేషియా విధానాలు భారత ప్రజల మనోభావాలను తీవ్రంగా గాయపరిచాయని చెప్పారు. కాని తొందరపడి తీసుకునే నిర్ణయాలు మంచివి కావని కూడా అన్నారు. ఈ సంక్షోభం విషయమై మహదీర్ ముహమ్మద్ కూడా అక్కడి మీడియాలో మాట్లాడారు.

భారతదేశంలో పామాయిల్ వ్యాపారులు ఇప్పుడు మలేషియా విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. మలేషియా నుంచి పామాయిల్ దిగుమతులపై ఆంక్షలు విధిస్తామని భారత ప్రభుత్వం నుంచి హెచ్చరికలు వచ్చిన తర్వాత కొంత అయోమయస్థితి కనబడుతోంది. హఠాత్తుగా మలేషియాపై ఈ వ్యతిరేకత ఎందుకంటే, కశ్మీరు విషయంలో మలేషియా ప్రధాని మహదీర్ ముహమ్మద్ ఐక్యరాజ్యసమితిలో భారత విధానాలను తీవ్రంగా విమర్శించిన తర్వాత భారత ప్రభుత్వం కఠిన వైఖరి తీసుకుంటుంది.

నిజానికి సెప్టెంబర్ 5 వ తేదీన భారత ప్రభుత్వం మలేషియా నుంచి దిగుమతి చేసుకునే రీఫైన్డ్ పామాయిల్ పై 5 శాతం దిగుమతి సుంకం విధించింది. 180 రోజుల పాటు ఈ పెంచిన కొత్త సుంకాలు అమల్లో ఉంటాయని చెప్పారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమిడీస్ సిఫారసుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. సాల్వెంట్ ఎక్స్ ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఫిర్యాదు మేరకు డిజిటిఆర్ చేసిన విచారణలో మలేషియా నుంచి దిగుమతులు అసాధారణంగా పెరిగాయని గుర్తించి తీసుకున్న చర్య ఇది. అప్పటి వరకు ముడి పామాయిల్ పై 40 శాతం దిగుమతి సుంకం ఉండేది. రీఫైన్డ్ పామాయిల్ పై 45 శాతం దిగుమతి సుంకం ఉండేది. ఇప్పుడు రెండింటిపై 50 శాతం చేశారు. కాని ఇదంతా మహదీర్ ముహమ్మద్ ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించడానికి ముందే జరిగింది. సెప్టెంబర్ 28వ తేదీన ఐక్యరాజ్యసమితిలో మలేషియా ప్రధాని ప్రసంగించారు.

జమ్ము కశ్మీరును భారతదేశం దురాక్రమించుకుందని తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ ప్రసంగం తర్వాత భారతదేశం తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేసింది. మలేషియా వైఖరి పట్ల భారతదేశానికి ఆగ్రహం కలగడం సహజమే. మలేసియా ఉత్పత్తులపై విధించే సుంకాల వల్ల వ్యాపారులకు ఇప్పుడు దాదాపు 20 శాతం నష్టం తప్పదనే అనుమానాలున్నాయి. కొందరు వ్యాపారులు తమ ఆర్డర్లను క్యాన్సిల్ చేసుకున్నారు. ఇండోనేషియా, థాయ్ లాండ్ వంటి దేశాల నుంచి ప్రత్యామ్నాయాలను వెదుక్కుంటున్నారు.

వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ అంచనాల ప్రకారం ప్రపంచంలో పామాయిల్ ఉత్పత్తిలో ఇండోనేషియా, మలేషియా దేశాలు కలిసి 87 శాతం ఉత్పత్తి చేస్తాయి. ఇండోనేషియా ఏటా 3 కోట్ల 30 లక్షల మెట్రిక్ టన్నుల పామాయిల్ ఉత్పత్తి చేస్తుంది. మలేషియా 1 కోటి 95 లక్షల మెట్రిక్ టన్నుల పామాయిల్ ఉత్పత్తి చేస్తుంది. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీకి చెందిన నరేంద్ర తనేజా ప్రకారం భారతదేశం ప్రధానంగా మలేషియా నుంచి పామాయిల్ దిగుమతి చేసుకుంటుంది. కొంత ఇండోనేషియా నుంచి కూడా దిగుమతులున్నాయి.

మలేషియన్ పామాయిల్ కౌన్సిల్ ప్రకారం ఈ సంవత్సరం జనవరి నుంచి సెప్టెంబరు వరకు 106.98 శాతం పెరిగాయి. అంటే దాదాపు 1400 కోట్ల రూపాయల విలువైన దిగుమతులు మలేషియాతో శతాబ్దాలుగా భారతదేశానికి సంబంధాలున్నాయి. అందుకే వాణిజ్య నియమాలను సరళీకరించి అక్కడి నుంచి ఎక్కువగా పామాయిల్ దిగుమతి చేసుకుంటున్నామని తనేజా అన్నారు. అయితే జమ్ము కశ్మీరు విషయంలో మలేషియా విధానాలు భారత ప్రజల మనోభావాలను తీవ్రంగా గాయపరిచాయని చెప్పారు. కాని తొందరపడి తీసుకునే నిర్ణయాలు మంచివి కావని కూడా అన్నారు. ఈ సంక్షోభం విషయమై మహదీర్ ముహమ్మద్ కూడా అక్కడి మీడియాలో మాట్లాడారు. పామాయిల్ దిగుమతులపై భారతదేశం ఆంక్షలు విధించినట్లయితే దౌత్యపరమైన పరిష్కారాలుకు ప్రయత్నిస్తామని చెప్పారు.

ఒక్క భారతదేశమే కాదు ప్రపంచంలో చాలా దేశాలు పామాయిల్ విషయంలో దిగుమతులపై ఆధారపడి ఉన్నాయి. పామాయిల్ అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. వంటనూనెగా, డిటర్జంట్లు, షాంపూ, లిప్ స్టిక్స్, చాక్లెట్, బయోడీజిల్ ఇలా అనేక రంగాల్లో ఉపయోగపడుతుంది. భారతదేశంలో ఎక్కువగా వంటనూనెగా వాడతారు. భారతదేశంలో అవసరమైన వంటనూనెలో 65 శాతం దిగుమతి చేసుకోవలసిందే. 42 శాతం పామాయిల్ వాడతారు. 22 శాతం సోయాబిన్ ఆయిల్ వాడతారు. 12 శాతం సన్ ఫ్లవర్ వాడతారు. ప్రపంచంలో వంటనూనె అత్యధికంగా దిగమతి చేసుకునేది మనమే.

భారతదేశంలో పామాయిల్ డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. 1990 నుంచి 2002 మధ్య కాలంలో పామాయిల్, సోయాబిన్ ఇవి రెండు ప్రధానంగా మార్కెట్‌లో ఎక్కువగా అమ్ముడు పోయాయి. ఇందులో పామాయిల్ మరీ ఎక్కువ. వంటనూనెల ఉత్పత్తి దారులు, వ్యాపారులు దీనివల్ల లాభాలు కూడా గడిస్తున్నారు. ఇతర నూనెల కన్నా పామాయల్ చవకగా కూడా లభిస్తుండడం వల్ల వినియోగదారులు కూడా దీనిపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు.

భారతదేశం నుంచి డిమాండ్ అధికంగా ఉండడం వల్లనే ఆగ్నేయాసియా దేశాల్లో అడవులను కూడా నరికి పామాయిల్ సేద్యం అధికం చేశారు. మరో ముఖ్యమైన విషయమేమంటే, పామాయిల్ వ్యాపారం కేంద్రీకృత వ్యవస్థ ద్వారా జరగడం లేదు. వ్యక్తిగత ఒప్పందాల ద్వారా వ్యాపారుల మధ్య జరుగుతోంది. భారతదేశంతో ఉచిత వాణిజ్య ఒప్పందం ఉండడం వల్ల మలేషియా ఎగుమతి దారులు ఆకర్షణీయమైన లాభాలు ప్రయోజనాలు భారత దిగుమతి దారులకు చూపిస్తున్నారు. అందువల్లనే మలేషియా నుంచి ఎక్కువగా పామాయిల్ దిగుమతులు జరుగుతున్నాయి. కాని ఇప్పుడు పరిస్థితి మారుతుందా? ఏది ఏమైనా భారతదేశం తీసుకునే చర్యలు ఇక్కడి వ్యాపారులపై కూడా ప్రభావం వేసే అవకాశం ఉంది.

Avoid Buying Palm Oil From Malaysia

* సమ్యక్ పాండే (ప్రింట్)

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మలేషియాతో వాణిజ్యానికి బ్రేకులు? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: