నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్నారు

  ‘రాజుగారి గది 3’ విడుదలై సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో పాత్రికేయులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దర్శకుడు ఓంకార్ మాట్లాడుతూ “నా తమ్ముడు అశ్విన్‌ను ఆదరించిన ప్రేక్షకులు అందరికీ ధన్యవాదాలు. ప్రేక్షకుల సపోర్ట్ ఉంటే ఎవరైనా ఎక్కడికైనా వెళ్తారు. వైజాగ్ మెలోడీ థియేటర్‌లో పెద్ద హీరో షోస్ మాత్రమే ఫుల్ అవుతుంటాయి. కానీ మా చిత్రం కూడా హౌస్‌ఫుల్ అవుతోంది. రానున్న రోజుల్లో పిల్లలు, ఫ్యామిలీ ఆడియన్స్ ఇంకా బాగా ఆదరిస్తారని […] The post నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్నారు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

‘రాజుగారి గది 3’ విడుదలై సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో పాత్రికేయులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దర్శకుడు ఓంకార్ మాట్లాడుతూ “నా తమ్ముడు అశ్విన్‌ను ఆదరించిన ప్రేక్షకులు అందరికీ ధన్యవాదాలు. ప్రేక్షకుల సపోర్ట్ ఉంటే ఎవరైనా ఎక్కడికైనా వెళ్తారు. వైజాగ్ మెలోడీ థియేటర్‌లో పెద్ద హీరో షోస్ మాత్రమే ఫుల్ అవుతుంటాయి. కానీ మా చిత్రం కూడా హౌస్‌ఫుల్ అవుతోంది. రానున్న రోజుల్లో పిల్లలు, ఫ్యామిలీ ఆడియన్స్ ఇంకా బాగా ఆదరిస్తారని భావిస్తున్నాను”అని అన్నారు. ఆలీ మాట్లాడుతూ “అందరూ కష్టపడి పని చేయడంతోనే ఈ సినిమా విజయం సాధించింది.

ప్రేక్షకులు సినిమాను నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్నారు”అని చెప్పారు. చోటా కె.నాయుడు మాట్లాడుతూ “సినిమాను వినోదం కోసం తీస్తారు. ఈ సినిమాలో అది ఎక్కువగా ఉంది”అని పేర్కొన్నారు. అశ్విన్ మాట్లాడుతూ “ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు బాగుందని చెబుతున్నారు. సినిమాకు స్పందన అద్భుతంగా ఉంది”అని అన్నారు. అవికా గోర్ మాట్లాడుతూ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అయినందుకు మా చిత్ర యూనిట్ అందరికి అభినందనలు తెలుపుతున్నానని చెప్పారు. ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ షబ్బీర్, గెటప్ శ్రీను పాల్గొన్నారు.

Raju Gari gadhi 3 movie success meet

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్నారు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: