‘కోనాపురంలో జరిగిన కథ’ను విజయవంతం చేయాలి

  అనూష సినిమా బ్యానర్‌లో బట్టు అంజిరెడ్డి, మచ్చ వెంకట్ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన సినిమా ‘కోనాపురంలో జరిగిన కథ’. సోమవారంనాడు హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ఈ సినిమా ట్రైలర్, పోస్టర్‌ను లాంచ్ చేశారు. కాగా ఈ సినిమాకు సంబంధించిన నిర్మాతలు, హీరో గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన వారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నియోజకవర్గం నుండి తొలి హీరోగా, తొలి సినిమాగా వస్తున్న నేపథ్యంలో తెలుగు ప్రజలు అందరూ కూడా ఈ […] The post ‘కోనాపురంలో జరిగిన కథ’ను విజయవంతం చేయాలి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

అనూష సినిమా బ్యానర్‌లో బట్టు అంజిరెడ్డి, మచ్చ వెంకట్ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన సినిమా ‘కోనాపురంలో జరిగిన కథ’. సోమవారంనాడు హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ఈ సినిమా ట్రైలర్, పోస్టర్‌ను లాంచ్ చేశారు. కాగా ఈ సినిమాకు సంబంధించిన నిర్మాతలు, హీరో గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన వారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నియోజకవర్గం నుండి తొలి హీరోగా, తొలి సినిమాగా వస్తున్న నేపథ్యంలో తెలుగు ప్రజలు అందరూ కూడా ఈ సినిమాను ఆదరించాలని సంతోష్ కుమార్ కోరారు.

మంచి సామాజిక దృక్పథంతో, సామాజిక బాధ్యతతో తెరకెక్కిన ఈ సినిమాను విజయవంతం చేయాలన్నారు. ఇక ఈ సినిమా నవంబర్ 1న విడుదలవుతున్నట్లు దర్శక నిర్మాతలు తెలియజేశారు. వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన కె.బి.కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. గజ్వేల్ నుండి తొలి హీరోగా వస్తున్న అనిల్ మొగిలిని ఎంపి సంతోష్ కుమార్ అభినందించారు. ఈ చిత్రంలో సునీత హీరోయిన్‌గా చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాతలు బట్టు అంజిరెడ్డి ,మచ్చ వెంకట్ రెడ్డి, దర్శకుడు కె.బి.కృష్ణ, బాల లింగారెడ్డి, మహాదేవుని శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Konapuramlo jarigina katha movie trailer release

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ‘కోనాపురంలో జరిగిన కథ’ను విజయవంతం చేయాలి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: