సందేశాత్మక చిత్రం ‘తుపాకీ రాముడు’

  బిత్తిరి సత్తి, ప్రియ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘తుపాకీ రాముడు’. రసమయి ఫిలింస్ పతాకంపై టి.ప్రభాకర్ దర్శకత్వంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈనెల 25న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. బిగ్ సీడీని […] The post సందేశాత్మక చిత్రం ‘తుపాకీ రాముడు’ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

బిత్తిరి సత్తి, ప్రియ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘తుపాకీ రాముడు’. రసమయి ఫిలింస్ పతాకంపై టి.ప్రభాకర్ దర్శకత్వంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈనెల 25న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. బిగ్ సీడీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ “రసమయి అన్న ఓ సాహసమే చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఓ సినిమా చేశారు. ఇప్పుడొక సినిమా చేశారు. నిర్మాత రసమయి ఓ తెలంగాణ వ్యక్తి, ఉద్యమకారుడు. దర్శకుడు ప్రభాకర్ తెలంగాణ వ్యక్తి. హీరోహీరోయిన్లు తెలంగాణ బిడ్డలే.

ఈ సినిమాలో అందరూ తెలంగాణ వారినే పెట్టి ఓ అద్భుతమైన సినిమా తీశారు. అది కూడా ఓ తెలంగాణ పల్లెలో తీశారు. తెలంగాణ కళలు, సంప్రదాయం, బతుకమ్మ పండుగ గురించి తెలియజేసే సినిమా ఇది. సందేశాత్మకమైన చిత్రమిది. ట్రైలర్ చూడగానే నచ్చింది. రవి అలియాస్ బిత్తిరి సత్తి అయ్యాడు. ఈ సినిమా తర్వాత అలియాస్ తుపాకీ రాముడుగా మారిపోతాడేమో అనిపించింది. అతను అద్భుతమైన నటుడిగా ఎదగాలని కోరుకుంటున్నాను”అని అన్నారు. మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ “రసమయి మంచి సృజనాత్మక ఉన్న మిత్రుడు. అతను నిర్మించిన ఈ సినిమాను దిల్‌రాజు విడుదల చేయడానికి ముందుకు వచ్చినందుకు థాంక్స్. సినిమా పెద్ద సక్సెస్ అయి బిత్తిరి సత్తి, ప్రియకు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను”అని చెప్పారు.

మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ “తెలంగాణ ఉద్యమ సమయంలో రసమయి పాటలు పాడిన విషయం అందరికీ తెలిసిందే. కళల పట్ల ఉన్న మక్కువతో రసమయి ఈ సినిమా నిర్మించారు. బిత్తిరి సత్తి గురించి తెలియని తెలుగువారు లేరు. అతను హీరోగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను”అని చెప్పారు. ఎమ్మెల్యే, నిర్మాత రసమయి బాలకిషన్ మాట్లాడుతూ “ప్రజల గుండెల్లో నుండి వచ్చిన బ్రేకింగ్ స్టార్ బిత్తిరి సత్తిని హీరోగా పెట్టి ఈ సినిమా చేశాను. హీరోయిన్ ప్రియ కరీంనగర్‌కు చెందిన అమ్మాయి. ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చినందుకు దిల్‌రాజుకు థాంక్స్‌”అని అన్నారు. దిల్‌రాజు మాట్లాడుతూ “మంచి ప్రయత్నం చేశారు. ఈ చిత్రం ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది”అని అన్నారు. బిత్తిరి సత్తి మాట్లాడుతూ “నన్ను నమ్మి ఇంత ఖర్చు పెట్టి సినిమా చేసిన రసమయికి కృతజ్ఞతలు.

బిత్తిరి సత్తి పాత్రతో టివి ఛానల్ నుండి నా ప్రయాణం ‘తుపాకీ రాముడు’ వరకు చేరింది. దర్శకుడు ప్రభాకర్ నాతో అద్భుతంగా నటింపచేశారు. మా సినిమా కోసం సింగపూర్ పోలేదు. సింగరేణికి వెళ్లాం. ఈ సినిమాలోని నటీనటులందరూ అద్భుతంగా నటించారు. ఎప్పుడూ నవ్వించే సత్తి ఈ సినిమాతో ఏడిపిస్తాడు. ఈ సినిమాకు వచ్చే ప్రతి ప్రేక్షకుడు నవ్వుకుంటాడు… ఏడుస్తాడు”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్.శంకర్, కర్నె ప్రభాకర్, మల్కాపురం శివకుమార్, యాదన్న, దర్శకుడు ప్రభాకర్, హీరోయిన్ ప్రియ, సుమ, రాజ్‌తరుణ్, ప్రియదర్శి తదితరులు పాల్గొన్నారు.

Message oriented pictures is the Tupaki Ramudu

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post సందేశాత్మక చిత్రం ‘తుపాకీ రాముడు’ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: