‘రాములో రాములా…‘ సాంగ్ వాయిదా

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తోన్న క్రేజీ మూవీ ‘అల వైకుంఠపురంలో’. ఈ చిత్రంలో బన్నీ సరసన రెండోసారి పొడుగుకాల సుందరి పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్, రాధాకృష్ణ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా, ఇటీవల విడుదల చేసిన ‘సామజవరగమన…’ పాట రికార్డు వ్యూస్ తో బజ్ క్రియేట్ చేసింది. ఇప్పటివరకు ఈ పాటకు 40 మిలియన్‌ల వ్యూస్, 7 లక్షల లైక్స్ […] The post ‘రాములో రాములా…‘ సాంగ్ వాయిదా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తోన్న క్రేజీ మూవీ ‘అల వైకుంఠపురంలో’. ఈ చిత్రంలో బన్నీ సరసన రెండోసారి పొడుగుకాల సుందరి పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్, రాధాకృష్ణ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా, ఇటీవల విడుదల చేసిన ‘సామజవరగమన…’ పాట రికార్డు వ్యూస్ తో బజ్ క్రియేట్ చేసింది. ఇప్పటివరకు ఈ పాటకు 40 మిలియన్‌ల వ్యూస్, 7 లక్షల లైక్స్ వచ్చాయి. తెలుగులో ఒక సాంగ్‌కు ఇన్ని లైక్స్ , వ్యూస్ రావడం ఇదే ప్రథమం. ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన ఈ గీతానికి తమన్ స్వరాలు అందించగా… గాయకుడు సిద్ శ్రీరామ్ ఆలపించాడు.

కాగా, ఇదే ఊపులో చిత్రయూనిట్ రెండో పాటను విడుదల చేయాలనుకున్నారు. ఈ సందర్భంగా అక్టోబర్ 21 సాయంత్రం 4 గంటలకు ‘రాములో రాములా…‘ అనే పాటను విడుదల చేస్తామని ప్రకటించారు. చేతిలో మందు గ్లాసుతో బన్నీ మంచి ఊపులో ఉన్న ఈ సాంగ్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. దీంతో ఈ పాటకోసం బన్నీ అభిమానుల ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే, చిత్రయూనిట్ మాత్రం అభిమానుల ఆశలపై నీళ్లు చల్లారు. కొన్ని కారణాల వల్ల ఈ పాటను రేపటకి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రంలో టబు, రాజేంద్రప్రసాద్, తనికెళ్ల భరణి, మురళీ శర్మ, సునీల్, నవదీప్, సుశాంత్, నివేతా పేతురాజ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇక, ఈ చిత్రాన్ని వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి అన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు చిత్రయూనిట్.

Ala VaikuntaPuramlo Movie Unit Disappoints Bunny Fans

The post ‘రాములో రాములా…‘ సాంగ్ వాయిదా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.