రోడ్డు ప్రమాదంలో అక్కాచెల్లెళ్లు మృతి

ఆదిలాబాద్ : జిల్లా కేంద్రంలోని రవీందర్‌నగర్ కాలనీలో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కాచెల్లెళ్లు మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. సఫియా అంజుమ్ (19), షాజీ అంజుమ్ (19)లు అక్కాచెల్లెళ్లు. వీరు డైట్ విద్యార్థులు . కాలేజీకి వెళ్లి తమ సోదరుడి బైక్‌పై వస్తుండగా ఎదురుగా వచ్చిన పాఠశాల బస్సు ఢీకొంది. ఈ క్రమంలో షాజీ అంజుమ్ ఘటనాస్థలిలోనే చనిపోయింది. సఫియా రిమ్స్ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. ఈ ప్రమాదం నుంచి వారి […] The post రోడ్డు ప్రమాదంలో అక్కాచెల్లెళ్లు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఆదిలాబాద్ : జిల్లా కేంద్రంలోని రవీందర్‌నగర్ కాలనీలో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కాచెల్లెళ్లు మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. సఫియా అంజుమ్ (19), షాజీ అంజుమ్ (19)లు అక్కాచెల్లెళ్లు. వీరు డైట్ విద్యార్థులు . కాలేజీకి వెళ్లి తమ సోదరుడి బైక్‌పై వస్తుండగా ఎదురుగా వచ్చిన పాఠశాల బస్సు ఢీకొంది. ఈ క్రమంలో షాజీ అంజుమ్ ఘటనాస్థలిలోనే చనిపోయింది. సఫియా రిమ్స్ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. ఈ ప్రమాదం నుంచి వారి సోదరుడు సురక్షితంగా బయటపడ్డాడు. ఘటన జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ పరారయ్యాడు. ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెల్లెళ్లు చనిపోవడంతో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో విషాదం అలుముకుంది. పోస్టుమార్టం కోసం సఫియా, షాజీ అంజుమ్ మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు ఆదిలాబాద్ వన్‌టౌన్ పోలీసులు తెలిపారు.

Two Young Women Dead In Road Accident At Adilabad

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post రోడ్డు ప్రమాదంలో అక్కాచెల్లెళ్లు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: