తెలుగు తెరపైకి మరో దగ్గుబాటి వారసుడు

హైదరాబాద్ : ప్రముఖ నిర్మాత , సురేష్ ప్రొడక్షన్ అధినేత దగ్గుబాటి సురేష్ బాబు రెండో తనయుడు అభిరాం త్వరలోనే తెలుగు తెరకు పరిచయం కానున్నాడు. ఇప్పటికే ఆయన పెద్ద కొడుకు రానా విభిన్న పాత్రలు పోషిస్తూ మంచి పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అభిరాంను కూడా తెలుగు తెరకు పరిచయం చేయాలని సురేష్ బాబు రంగం సిద్ధం చేస్తున్నట్టు టాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే సురేష్ బాబు కథలు వింటున్నారని, […] The post తెలుగు తెరపైకి మరో దగ్గుబాటి వారసుడు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్ : ప్రముఖ నిర్మాత , సురేష్ ప్రొడక్షన్ అధినేత దగ్గుబాటి సురేష్ బాబు రెండో తనయుడు అభిరాం త్వరలోనే తెలుగు తెరకు పరిచయం కానున్నాడు. ఇప్పటికే ఆయన పెద్ద కొడుకు రానా విభిన్న పాత్రలు పోషిస్తూ మంచి పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అభిరాంను కూడా తెలుగు తెరకు పరిచయం చేయాలని సురేష్ బాబు రంగం సిద్ధం చేస్తున్నట్టు టాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే సురేష్ బాబు కథలు వింటున్నారని, ఇప్పటికే పలువురు దర్శకులు, నిర్మాతలు అభిరాంను హీరోగా పరిచయం చేసేందుకు ముందుకు వచ్చారని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అభిరాం ముంబయిలో నటన, డాన్స్, ఫైట్స్, హార్స్ రైడింగ్ తదితర వాటిలో శిక్షణ తీసుకుంటున్నారు. అభిరాంతో సొంత బ్యానర్ లోనే సినిమా తీయాలన్న ఆలోచనతో సురేష్ బాబు ఉన్నట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అయితే అభిరాం తన అన్న రానా లెవల్లో తెలుగు తెరపై తనదైన ముద్ర వేయడం ఖాయమని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

Daggubati Abhiram To Be Introduced As Hero

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post తెలుగు తెరపైకి మరో దగ్గుబాటి వారసుడు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: