శ్రీరాంసాగర్ నుంచి నీటి విడుదల

  కాకతీయ కాలువకు 6వేల క్యూసెక్కులు, ప్రారంభమైన విద్యుదుత్పత్తి మెండోరా : ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయినిగా పేరొందిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువ కాకతీయ ద్వారా నీటిని దిగువకు వదులుతున్నట్లు ప్రాజెక్టు డీఈ జగదీష్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎగువ ప్రాంతాల నుండి ఎస్సారెస్పీకి వరద నీరు వస్తుండడంతో రిజర్వాయర్లో నీటిమట్టం రోజురోజుకు పెరుగుతుంది. దీంతో ప్రాజెక్టు పూర్తి స్ధాయి నీటి మట్టం 1090.90 అడుగులు 90 టీఎంసీలకు గాను ఆదివార ం సాయంత్రానికి […] The post శ్రీరాంసాగర్ నుంచి నీటి విడుదల appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

కాకతీయ కాలువకు 6వేల క్యూసెక్కులు, ప్రారంభమైన విద్యుదుత్పత్తి

మెండోరా : ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయినిగా పేరొందిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువ కాకతీయ ద్వారా నీటిని దిగువకు వదులుతున్నట్లు ప్రాజెక్టు డీఈ జగదీష్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎగువ ప్రాంతాల నుండి ఎస్సారెస్పీకి వరద నీరు వస్తుండడంతో రిజర్వాయర్లో నీటిమట్టం రోజురోజుకు పెరుగుతుంది. దీంతో ప్రాజెక్టు పూర్తి స్ధాయి నీటి మట్టం 1090.90 అడుగులు 90 టీఎంసీలకు గాను ఆదివార ం సాయంత్రానికి 1090.00 అడుగులు 84.841 టీఎంసీల నీరు ఉందని ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు.

ప్రాజెక్టుకు ఎగువ నుండి 35వేల క్యూసెక్కుల వరద నీరు రావడం జరుగుతుందన్నారు. దీంతో ప్రాజెక్టు ప్రధాన కాలువ కాకతీయకు 6వేల క్యూసెక్కుల నీటిని వదిలారు. కాకతీయ కాలువ నీటిని వదలడంతో ఒకింత రైతులు తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. గత ఏడాది ఇదే రోజున ప్రాజెక్టు నీటిమట్టం 1075.90 అడుగులు 41.952 టీఎంసీలు ఉంది. జూన్ 1వ తేది నుండి సోమవారం సాయంత్రం వరకు ప్రాజెక్టుకు 83.359 టీఎంసీల నీరు వచ్చి చేరిందని ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు.

జెన్‌కోలో ప్రారంభమైన విద్యుత్ ఉత్పత్తి
తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైందని అధికారులు చెబుతున్నారు. ప్రాజెక్టు నుండి ప్రధాన కాలువైన కాకతీయ కాలువకు 6వేల క్యూసెక్కుల నీటి విడుదల జరుగుతున్నందున రెండు టర్బయిన్‌లతో ఆ నీటిని వినియోగించుకుని విద్యుత్ ఉత్పత్తి అవుతుందని ఇంచార్జీ డీఈఓఎం శ్రీనివాస్ తెలిపారు. ఒక టర్బయిన్‌లో 8.5 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చొప్పున, ఆదివారం రెండు టర్బయిన్లతో 22.52 మెగావాట్ల విద్యుత్ ఉత్పతి అవుతుందన్నారు.

Water Release from Sriramsagar

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post శ్రీరాంసాగర్ నుంచి నీటి విడుదల appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: