తివారీ కుటుంబానికి సిఎం ఆదిత్యనాథ్ భరోసా

  లక్నో : హత్యకు హిందూ సమాజ్ పార్టీ అధినేత కమలేష్ తివారీ కుటుంబీకులను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ ఆదివారం వారి ఇంటివద్ద కలుసుకుని అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. శోకంలో మునిగిన తివారీ తల్లి, భార్య, ముగ్గురు కుమారులతో 30 నిమిషాల సేపు మాట్లాడారు. కొడుకుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని, తమ కుటుంబానికి భద్రత కల్పించాలని, రక్షణ కోసం తమకు ఆయుదాల లైసెన్సు మంజూరు చేయాలని కుటుంబీకులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని డిమాండ్ […] The post తివారీ కుటుంబానికి సిఎం ఆదిత్యనాథ్ భరోసా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

లక్నో : హత్యకు హిందూ సమాజ్ పార్టీ అధినేత కమలేష్ తివారీ కుటుంబీకులను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ ఆదివారం వారి ఇంటివద్ద కలుసుకుని అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. శోకంలో మునిగిన తివారీ తల్లి, భార్య, ముగ్గురు కుమారులతో 30 నిమిషాల సేపు మాట్లాడారు. కొడుకుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని, తమ కుటుంబానికి భద్రత కల్పించాలని, రక్షణ కోసం తమకు ఆయుదాల లైసెన్సు మంజూరు చేయాలని కుటుంబీకులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని డిమాండ్ చేసినట్టు తెలిసింది. కేసు విచారణ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో జరిపించాలని, కాలనీలో తివారీ విగ్రహం ప్రతిష్టించాలని, కాలనీకి తివారీ పేరు పెట్టాలని కూడా డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి ఆదుకుంటామని ఇచ్చిన హామీపై తివారీ కుటుంబం సంతృప్తి చెందింది. ఇదిలా ఉండగా తివారీ కేసుపై దర్యాప్తు ముమ్మరం చేశారు. హంతకులు ఆరోజు నాకా హిందోళా ఏరియా హోటల్‌లో ఉన్నట్టు తమ దర్యాప్తులో తేలిందని డిజిపి ఒపి సిం గ్ చెప్పారు. నిందితులు ఇద్దరు షేక్ అష్‌ఫకుల్ హుస్సేన్; ముయినుద్దీన్ గా హోటల్ సిబ్బంది గుర్తించారని, హత్య జరిగిన రోజు వారిద్దరూ కాషాయం కుర్తాలు ధరించారని, చేతిలో స్వీట్ బాక్సు పట్టుకుని బయటకు వెళ్లారని హోటల్ సిబ్బంది చెప్పినట్టు వివరించారు. అక్టోబర్ 17న వారు హోటల్‌కు రాగా, 18న వెళ్లిపోయారన్నారు. వారి పక్కపై రక్తపు మరకల కాషాయ కుర్తా పడి ఉందని, టవ ల్‌పై రక్తపు మరకలు ఉన్నాయని తెలిపారు. అక్కడ మొబైల్ ఫోన్ల కొత్త బాక్సు ఉందని దర్యాప్తులో ఇది పెద్ద విజయమని సింగ్ పేర్కొన్నారు. వీడియో క్లిప్పింగ్‌లో వారితో పాటు ఒకామె కూడా ఉన్నట్టు కనిపించిందని చెప్పారు.

CM Adityanath assures the Tiwari family

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post తివారీ కుటుంబానికి సిఎం ఆదిత్యనాథ్ భరోసా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: