లోకో పైలట్లకు సాంకేతిక పరికరాలు

  జోనల్ జనరల్ మేనేజర్ గజానన్ మాల్య వెల్లడి హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే జోన్ యాజమాన్యం లోకో పైలట్‌లకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన సామాగ్రి విస్తృతంగా పంపిణి చేస్తున్నారు. ఈ మేర కు లోకో పైలట్‌లు తమ సామర్ధాలను పెంచేందుకు గాను అండ్రాయిడ్ ట్యాబ్‌లు(ట్యాబ్లెట్ పిసి)లు పంపిణీ చేయడం జరగుతుందని జిఎం.గజానన్ మాల్య పేర్కొన్నారు. ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో తొలి దశలో విజయవాడ డివిజన్ పరిధిలోని మెయిల్, ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లలో పని […] The post లోకో పైలట్లకు సాంకేతిక పరికరాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

జోనల్ జనరల్ మేనేజర్ గజానన్ మాల్య వెల్లడి

హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే జోన్ యాజమాన్యం లోకో పైలట్‌లకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన సామాగ్రి విస్తృతంగా పంపిణి చేస్తున్నారు. ఈ మేర కు లోకో పైలట్‌లు తమ సామర్ధాలను పెంచేందుకు గాను అండ్రాయిడ్ ట్యాబ్‌లు(ట్యాబ్లెట్ పిసి)లు పంపిణీ చేయడం జరగుతుందని జిఎం.గజానన్ మాల్య పేర్కొన్నారు. ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో తొలి దశలో విజయవాడ డివిజన్ పరిధిలోని మెయిల్, ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లలో పని చేస్తున్న లోకో పైలట్లకు ట్యాబ్ లెట్ పిసిలను సరఫరా చేయడం జరిగిందన్నారు.

ఈ నూతన ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన సామాగ్రి మూలంగా లోకో పైలెట్ నుంచి సానుకూల స్పందన లభిస్తుందని వెల్లడించారు. ఈ మేరకు అన్ని డివిజన్ కేంద్రాలలో పైలెట్‌లకు ట్యాబ్ లెట్ పిసిల పంపిణికి ప్రణాళికలు సిద్థమైతున్నాయని తెలిపారు. అలాగే పని భారాన్ని తగ్గించేందుకు కామన్ లైన్ బ్యాక్ పద్ధతి అమ లు చేయడం ప్రారంభించామన్నారు.

రైళ్ల నిర్వహణలో లోకో పైలట్‌ల పాత్ర ఎంతో కీలకమైంది. సాధారణంగా లోకో పైలట్లను నియమించే ముందు వారికి డ్రైవింగ్‌తో పాటు సిగ్నల్ అమరికలోని విభాగాలకు సంబంధించిన ఆధునిక సాంకేతిక, భద్రతా నియమాలు, ఎలక్ట్రిక్, డిజిల్ ఇంజన్లు పని చేయు పద్దతి, నిర్వహణ సందర్భంగా తలెత్తు లోపాలు పరిష్కారానికి చక్కగా గుర్తించి, తదనుగుణంగా పరిష్కరించడం, రైలు మార్గం పై అవగాహన, రైలు పట్టాల స్థితి, కాషన్ అర్డర్‌లు, వేగ నిబంధనలు, ఆప్ అండ్ డౌన్ రూట్‌లకు సంబంధించిన విషయాల మీద సమగ్రమైన శిక్షణ ఇవ్వడం జరుగుతుందని వెల్లడించారు.

లోకో పైలెట్ల పనితీరు మెరుగుపరిచే దిశలో ప్రవేశపెట్టిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పై జిఎం గజనన్ మాల్య హర్షం వ్యక్తం చేస్తారు. రాబోవు కాలంలో రైలు ఇంజన్‌లలో క్రమక్రమంగా ఎయిర్ కండిషన్‌లను కూడా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన విరించారు. ఈ సదుపాయాలను జోన్ పరిధి డివిజన్ కేంద్రాలలో విస్తరించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను అదేశించారు.

పైలట్లకు ప్రత్యేకంగా పిసి ట్యాబ్ పరికరాలు
దక్షిణ మధ్య రైల్వే ఆండ్రాయిడ్ యాప్‌ను అభివృద్ధి చేసింది. ఈ యాప్‌ను టాబ్లెట్ పిసిలో లోడ్ చేయడం జరిగింది. డ్యూటిలో ఎప్పుడైన ఏ విషయంలోనైనా అవసరమైతే, లోకో పైలట్ పిసి పై సులభంగా వివరాలను టైప్ చేసి అప్‌లోడ్ చేయవచ్చు. ఇది కేవలం 300 గ్రాముల బరువు కలిగిఉంటుంది. గతంలో లోకోపైలట్‌లు సామా న్య, అనుబంధ నియమాలకు సంబంధించిన కొన్ని రెఫరెన్స్ పుస్తకాలు, సమస్య పరిష్కార మాన్యువల్, ఆక్సిడెంట్ మాన్యువల్, వర్కింగ్, టైం ట్యాబ్ వివరాలను రఫ్ జర్నల్, అత్యవసర పరిస్థితుల అంశాల పై లోకో పాయి ంట్ల ఆధ్యయనం చేసి, తగిన చర్యలు చేపట్టాల్సి ఉండేది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ప్రవేశ పెట్టిన నూనత అధునిక పరికరాలు క్రీయాశీలంగా మారుతున్నాయి.

కామన్ మిని లైన్(సిఎంఎల్) బాక్సులు పంపిణీ
దక్షిణ మధ్య రైల్వే కామన్ మినీ లైన్(సీఎంఎల్) బాక్సులను జోన్‌లోని ఆరు డివిజన్‌లోను ప్రవేశపెట్టడం మూలంగా లోకో పైలెట్‌లు బాక్సులు దించడం, ఎత్తే అవసరం ఉండదు. సిఎంఎల్ బాక్సులను దక్షిణ మధ్య రైల్వేలోని మొదటి క్రూ చేంజ్ పాయింట్‌లో లోడ్ చేయబడి, జోన్‌లోని క్రూ ఛేంజ్ పాయింట్ వరకు ఇంజన్‌లోనే ఉంటుంది. ఈ మేరకు సిఎంఎల్ బాక్సుల లోడింగ్, ఆన్‌లోడింగ్ జోనల్ క్రూ చేంజ్ పాయింట్ల వద్ద మాత్రమే జరుగుతుంది. ఈ నూతన చొరవ వల్ల యేటా సుమారు రూ.1కోటి ఆదా అవుతుంది.

Modern Technological Equipment for Loco Pilots

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post లోకో పైలట్లకు సాంకేతిక పరికరాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: