6 వేల మందికి ఉపాధి

  ఇండస్ట్రియల్ పార్కుతో పెరగనున్న ఉద్యోగ అవకాశాలు సిద్దిపేట నియోజకవర్గంలో 322 ఎకరాల్లో పరిశ్రమల ఏర్పాటు మార్చిలో ప్రారంభం కానున్న డిఎక్స్‌ఎన్ పరిశ్రమ ఉత్పత్తులు : మంత్రి హరీశ్‌రావు సిద్దిపేట : సిద్దిపేట నియోజకవర్గంలో 322 ఎకరాల్లో ఇండస్ట్రీయల్ పార్కు ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. జిల్లాలోని సిద్దిపేట అర్బన్ మండలంలో మిట్టపల్లి గ్రామ శివారులో నిర్మిస్తున్న ఇండస్ట్రీయల్ పార్కుకు వెళ్ళే 100 ఫీట్ల రోడ్డు నిర్మాణంకు ఆయన ఆదివారం […] The post 6 వేల మందికి ఉపాధి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఇండస్ట్రియల్ పార్కుతో పెరగనున్న ఉద్యోగ అవకాశాలు
సిద్దిపేట నియోజకవర్గంలో 322 ఎకరాల్లో పరిశ్రమల ఏర్పాటు
మార్చిలో ప్రారంభం కానున్న డిఎక్స్‌ఎన్ పరిశ్రమ ఉత్పత్తులు : మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట : సిద్దిపేట నియోజకవర్గంలో 322 ఎకరాల్లో ఇండస్ట్రీయల్ పార్కు ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. జిల్లాలోని సిద్దిపేట అర్బన్ మండలంలో మిట్టపల్లి గ్రామ శివారులో నిర్మిస్తున్న ఇండస్ట్రీయల్ పార్కుకు వెళ్ళే 100 ఫీట్ల రోడ్డు నిర్మాణంకు ఆయన ఆదివారం శంకుస్థాపన చేసి మాట్లాడారు. రూ. 17.50 కోట్లతో ఈ రోడ్డును నిర్మిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. 322 ఎకరాల్లో ఇండస్ట్రీయల్ పార్కు నిర్మాణంతో భారీగా పరిశ్రమలు ఏర్పాటై నియోజకవర్గంలోని 6వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా ప్రజలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్షంతో నియోజకవర్గంలో ఈ ఇండస్ట్రీయల్ పార్కులను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ పార్కు ఏర్పాటుకోసం మంత్రి కేటిఆర్ పరిశ్రమల చైర్మన్ గ్యాదరీ బాలమల్లు, ఇండస్ట్రీయల్ ఎండి నర్సింహారెడ్డి, జిల్లా ఇండస్ట్రీయల్ అధికారిక బృందం ఎంతో సహకరించినట్లు తెలిపారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో మలేషియా దేశానికి చెందిన డిఎక్స్‌ఎన్ పరిశ్రమ ఏర్పాటు పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని, వచ్చే మార్చికల్లా ఈ పరిశ్రమలో ఉత్పత్తులు ప్రారంభం కాబోతున్నట్లు తెలిపారు. అలాగే పెన్నార్ పరిశ్రమ ఏర్పాటు చేయడానికి ఆ సంస్థ ప్రతినిధులు ముందుకు వచ్చారని, అంబికా దర్భార్ బత్తి పరిశ్రమ సైతం త్వరలోనే ఏర్పాటు కాబోతుందన్నారు. ఈ పరిశ్రమ ఏర్పాటుతో బీడి కార్మికులకు ప్రత్యామ్నాయంగా ఉపాధి లభించబోతుందని తెలిపారు.

పరిశ్రమలకు పూర్తి స్థాయి సదుపాయాలను కల్పించడంతో, పరిశ్రమ ప్రతినిధులు పరిశ్రమలు నెలకొల్పడానికి ముందుకు వస్తున్నారన్నారు. ఇండస్ట్రీయల్ పార్కు సమీపంలో ఉన్న రైతులు తమ భూములను తొందరపడి అమ్ముకోవద్దన్నారు. అనంతరం ఇండస్ట్రీయల్ రోడ్డు నిర్మాణానికి స్థలాలు ఇచ్చిన భూ నిర్వాసితులకు రూ. 1.25 కోట్ల చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పిచైర్‌పర్సన్ వేలేటి రోజాశర్మ, మున్సిపల్ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, సుడా చైర్మన్ మారేటి రవీందర్ రెడ్డి, ఆర్డివో అనంత రెడ్డి, ఇండస్ట్రీయల్ సిఇవో శ్యాంసుందర్, జోనల్ మేనేజర్ మాధవి, మేనేజర్లు శివప్రసాద్, విజయ తదితరులున్నారు.

Industrial Park Foundation at Siddipet

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post 6 వేల మందికి ఉపాధి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: