మినీ ఎన్నికల సమరమే

  నేడే హర్యానా, మహారాష్ట్రాలో పోలింగ్ 51 అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాల్లో ఉపపోరు 18 రాష్ట్రాలలో బ్యాలెట్ హంగామా న్యూఢిల్లీ: నేడు (సోమవారం) దేశంలో మినీ ఎన్నికల సమరం జరుగనుంది. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీలకు ఎన్నికలు,51 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు, రెండు లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికలుండటంతో వీటిపై ఆసక్తి నెలకొంది. ప్రత్యేకించి హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు ఎన్నికల సంఘం సకల ఏర్పాట్లు చేసింది. సున్నిత ప్రాంతాలను గుర్తించి భద్రతా ఏర్పాట్లను […] The post మినీ ఎన్నికల సమరమే appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

నేడే హర్యానా, మహారాష్ట్రాలో పోలింగ్
51 అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాల్లో ఉపపోరు
18 రాష్ట్రాలలో బ్యాలెట్ హంగామా

న్యూఢిల్లీ: నేడు (సోమవారం) దేశంలో మినీ ఎన్నికల సమరం జరుగనుంది. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీలకు ఎన్నికలు,51 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు, రెండు లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికలుండటంతో వీటిపై ఆసక్తి నెలకొంది. ప్రత్యేకించి హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు ఎన్నికల సంఘం సకల ఏర్పాట్లు చేసింది. సున్నిత ప్రాంతాలను గుర్తించి భద్రతా ఏర్పాట్లను చేపట్టారు. మొత్తం 18 రాష్ట్రాలను విస్తరించుకుని జరిగే ఈ ఎన్నికలు బిజెపి, కాంగ్రెస్ ఇతర ప్రధాన రాజకీయ పార్టీలకు కీలకంగానే మారాయి.

మహారాష్ట్రలో రెండు కూటముల మధ్య పోటీ
ఇప్పటికైతే కాషాయ పార్టీల ప్రాబల్యమే ఉన్న మహారాష్ట్రలో రెండు రాజకీయ పార్టీల కూటముల మధ్య ఎన్నికల పోరు సాగుతోంది. బిజెపి శివసేనలు ప్రధాన భాగస్వామ్య పార్టీలుగా ఉన్న మహా యుతి ( మహాకూటమి) ఓ వైపు, కాంగ్రెస్ ఎన్‌సిపిలు ప్రానంగా ఉన్న మహా అగాథిలు తలపడుతున్నాయి. రాష్ట్రంలో దాదాపు 9 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటారు. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటిలో 53 రిజర్వ్‌డ్ స్థానాలు. ఓటర్లలో నాలుగున్నర కోట్ల మంది పురుషులు, నాలుగు కోట్ల మంది మహిళలు ఉన్నారు. 235 మహిళలు సహా మొత్తం 3,237 మంది ఎన్నికల బరిలో నిలిచారు. నాందేడ్ సౌత్ స్థానంలో అత్యధికంగా 38 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

కేంద్ర ఎన్నికల సంఘం మొత్తం 97వేల వరకూ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. పలు చిన్న పార్టీలు రెండు ప్రధాన కూటములకు అనుబంధంగా ఉన్నాయి. బిజెపి నాయకత్వపు కూటమిలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎ), శివ్‌సంగ్రామ్, రాష్ట్రీయ సమాజ్ పక్ష వంటివి ఉన్నాయి. ఇక కాంగ్రెస్ ఆధ్వర్యపు కూటమిలో పీజెంట్స్ అండ్ వర్కర్స్ పార్టీ , బహుజన వికాస్ అగాథీ, ఎస్‌పి, పీపుల్స్ రిపబ్లికన్ పార్టీ వంటివి ఉన్నాయి. లోక్‌సభ ఎన్నికలలో బిజెపి శివసేన కూటమి మొత్తం 48 స్థానాలలో 41 స్థానాలను గెల్చుకుంది. 51.3 ఓట్ల శాతం దక్కించుకుంది. ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు మహారాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి బల్దేవ్ సింగ్ తెలిపారు.

హర్యానాలో త్రిముఖ పోటీ
రాజకీయంగా ప్రాధాన్యత గల హర్యానాలో త్రిముఖ పోటీ నెలకొంది. అధికారంలో ఉన్న బిజెపి, ప్రతిపక్ష కాంగ్రెస్, నేషనల్ లోక్‌దళ్‌లు తమతమ అభ్యర్థులను రంగంలోకి దింపారు. 90 స్థానాలున్న అసెంబ్లీకి మొత్తం కోటి ఎనభయి మూడు లక్షల మంది ఓటర్లు తమ హక్కు వినియోగించుకుంటారు. మొత్తం 1,163 మంది అభ్యర్థులు ఇప్పుడు రంగంలో నిలిచారు. వీరిలో 104 మంది మహిళలు. ఓటర్లలో 99 లక్షల మంది మగవారు, 85 లక్షల మంది స్త్రీలు ఉన్నారు. హన్సీ నియోజకవర్గంలో అత్యధికంగా పాతిక మంది బరిలో ఉన్నారు. రాష్ట్రంలోని 90 స్థానాలకు బిజెపి, కాంగ్రెస్‌లు తలపడుతున్నాయి.

ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ (ఎన్‌ఎల్‌డి) 81 స్థానాలలో అభ్యర్థులను దింపింది. బిఎస్‌పి, ఆప్, జననాయక్ జనతా పార్టీలు కూడా తమ బలాన్ని పరీక్షించుకుంటున్నాయి. లోక్‌సభ ఎన్నికలలో బిజెపి మొత్తం పది లోక్‌సభ స్థానాలనూ కైవసం చేసుకుంది. 58.21 ఓట్ల శాతాన్ని దక్కించుకుంది. దీనితో ఈసారి అసెంబ్లీ ఎన్నికలలో తమది ఘనవిజయం అని బిజెపి నేతలు ధీమాతో ఉన్నారు. పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు హర్యానా ఎన్నికల ప్రధానాధికారి అనురాగ్ అగర్వాల్ తెలిపారు. హర్యానాలో 252 మంది ట్రాన్స్‌జెండర్లు కూడా పోటీకి దిగారు.

సతారా, సమస్తిపూర్ లోక్‌సభ స్థానాలు
మహారాష్ట్రని సతారా లోక్‌సభ స్థానం లోబీహార్‌లోని సమస్తిపూర్ లోక్‌సభ స్థానానికి కూడా సోమవారం ఉప ఎన్నిక జరుగుతుంది.సతారాలో ఎన్‌సిపి మాజీ నేత, సిట్టింగ్ ఎంపి ఉదయన్‌రాజే భోసలే బిజెపి నుంచి బరిలో ఉన్నారు. సమస్తిపూర్ ఇంతకు ముందు లోక్‌జన శక్తి పార్టీ విజయం సాధించింది. ఇక తెలంగాణలోని హుజుర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి, ఉత్తరప్రదేశ్‌లో 11 అసెంబ్లీ స్థానాలకు, గుజరాత్‌లో ఆరు, బీహార్‌లో ఐదు, అసోంలో నాలుగు, హిమాచల్‌ప్రదేశ్, తమిళనాడులో రెండేసి చొప్పున, పంజాబ్‌లో 4, తెలంగాణలో 1, రాజస్థాన్‌లో 2, కేరళలో 5, సిక్కింలో 3, రాజస్థాన్‌లో 2, అరుణాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిషా, చత్తీస్‌గఢ్, పాండిచ్చేరి, మేఘాలయాలలో ఒక్కొక్కటి చొప్పున అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతాయి.

యుపిలో ఎమ్మెల్యేలు లోక్‌సభ ఎన్నికలలో గెలుపొంది ఎంపిలు కావడంతో ఆయా స్థానాలలో ఇప్పుడు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. సిక్కింలోని గ్యాంగ్‌టక్ అసెంబ్లీ స్థానం నుంచి ఈసారి ఫుట్‌బాల్ మాజీ క్యాప్టెన్ భాయిచంగ్ భూటియా హెచ్‌ఎస్‌పి తరఫున పోటీలో నిలిచారు. సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్‌సింగ్ తమంగ్ పక్లోక్ కమ్రాంగ్ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. సోమవారం నాటి పోలింగ్ తరువాత ఓట్ల లెక్కింపు ఫలితాల వెల్లడి ప్రక్రియ ఈ నెల 24న (గురువారం) వెలువడుతాయి.

Voting in Maharashtra, Haryana assembly Polls on Monday

The post మినీ ఎన్నికల సమరమే appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: