హుజూర్‌నగర్ పోలింగ్ నేడే

  సమగ్రంగా ఏర్పాట్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది మొత్తం ఓటర్లు 2,36,842 పురుషులు : 1,16,415 మహిళలు : 1,20,427 హైదరాబాద్ : నువ్వా నేనా అన్నట్లు సాగిన హుజూర్‌నగర్ ఉపఎన్నికలకు నేడు పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటలవరకు పోలింగ్ జరుగుతుంది. ఏడుగంటలకు ఎన్నికలపరిశీలకులు, రాజకీయపార్టీల ఏజెంట్స్ సమక్షంలో ఎన్నికల అధికారులు మాక్ పోలింగ్ నిర్వహించిన అనంతరం పోలింగ్ ప్రారంభం అవుతుంది. పోలింగ్‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికలకమిషన్ […] The post హుజూర్‌నగర్ పోలింగ్ నేడే appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

సమగ్రంగా ఏర్పాట్లు
పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది
మొత్తం ఓటర్లు 2,36,842
పురుషులు : 1,16,415
మహిళలు : 1,20,427

హైదరాబాద్ : నువ్వా నేనా అన్నట్లు సాగిన హుజూర్‌నగర్ ఉపఎన్నికలకు నేడు పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటలవరకు పోలింగ్ జరుగుతుంది. ఏడుగంటలకు ఎన్నికలపరిశీలకులు, రాజకీయపార్టీల ఏజెంట్స్ సమక్షంలో ఎన్నికల అధికారులు మాక్ పోలింగ్ నిర్వహించిన అనంతరం పోలింగ్ ప్రారంభం అవుతుంది. పోలింగ్‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికలకమిషన్ పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. సోమవారం జరగనున్న ఈ పోలింగ్ నిర్వహణకోసం 302 పోలింగ్ కేంద్రాల్లో పిఓలు,ఎపిఓలు,ఓపిఓలతో పాటు ఇతర సిబ్బంది ఈ ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. 27 సేక్టార్లలోని 300 రూట్లకు 1200 సిబ్బందిని నియమించారు.

రిజర్వడ్‌గా 140 మంది అధికారులను సిద్ధం చేశారు. సామాగ్రి పంపిణీకోసం ఏర్పాటుచేసిన 27 సెక్టార్లద్వారా ఇవిఎంలను ఇతర సామాగ్రిని పంపిణీ చేశారు. ఎన్నికల నిర్వహణ సిబ్బంది ఆదివారం సాయంత్రం వరకు నిర్ణీత పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. సమస్యాత్మకమైన 79 పోలింగ్ కేంద్రాలకు సీనియర్ అధికారుల నిర్వహణలో పటిష్టమైన పోలీసు బందోబస్తు మధ్య నిర్వహించేందుకు అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. హుజూర్‌నగర్ నియోజకవర్గంలో ఉన్న ఏడు మండలాల్లో మహిళల ఒట్లు కీలకం కానున్నాయి. ఇందులో గిరిజన తండాల్లో మహిళలు అధికంగా ఉన్నారు.

మహిళా ఓటర్లు కీలకం
హుజూర్‌నగర్ నియోజకవర్గంలో మహిళ ఓటర్లు కీలకం కానున్నారు. పురుషఓటర్ల కంటే మహిళా ఓటర్లు ధికంగా ఉన్నారు. హుజూర్‌నగర్ నియోజకవర్గం జనాభ 3,21,142 ఉండగా 2,36,842 ఓటర్లు ఉన్నారు. ఇందులో మహిళ ఓటర్లు 1,20,427 ఉండగా పురుష ఓటర్లు 1,16,415 మంది ఉన్నారు. పురుషులకంటే మహిళలు 4012 మంది ఓటర్లు అధికంగా ఉండటం గమనార్హం. అలాగే సర్వీసు ఓటర్లు 196 ఉండగా అందులోనూ మహిళలే ప్రధానంగా ఉన్నారు. హుజూర్‌నగర్ 47886, చింతలపాలెం 25228, మేళ్లచెరువు 31270, పాలకీడు 19639, మఠంపల్లి 34855, నేరేడుచర్ల 34087, గరిడెపల్లి 43877 ఓటర్లు ఉన్నారు.

సిద్ధమైన ఈవిఎంలు
హుజూర్‌నగర్ ఉపఎన్నికకు ఈవిఎంలు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నాయి. అధికార యంత్రాంగం ఆదివారం సాయంత్రం పంపిణీ చేశారు. ఇవిఎంలు మోరాయిస్తే అదనపు ఈవిఎంలు సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. ఏడు మండలాల్లోని 302 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో అర్బన్ 31 ఉండగా రూరల్ గ్రామాల్లో 271 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 3782 ఇవిఎంలు వినియోగించనున్నారు.

నియోజకవర్గానికి సంబంధంలేని వారంతా నియోజకవర్గం వదిలివెళ్లాలని ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. నియోజకవర్గంలో ఎక్కడా ఏపార్టీ గుర్తు లేకుండా చర్యలు తీసుకున్నారు. పోలింగ్ స్టేషన్ల ముందు గుంపులుగా చేరితే చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. మద్యం షాపులు పోలింగ్ అయ్యేంతవరకు మూసివేయాలనే ఆదేశాలు అమల్లో ఉన్నాయి. ఎన్నికల ఏర్పాట్లు, నిర్వహణ కలెక్టర్ అజయ్‌కుమార్ పర్యవేక్షణలో పటిష్టంగా జరుగుతున్నాయి.

ఇవిఎంల్లో నిక్షిప్తంకానున్న భవితవ్యం
హుజూర్‌నగర్ శాసనసభ్యత్వానికి ఉత్తమ్‌కుమార్ రెడ్డి రాజీనామాతో ఏర్పిడిన కాళీని పూరించేందుకు ఎన్నికల కమిషన్ ఉపఎన్నికకు ప్రకటన విడుదల చేసింది. సెప్టెంబర్ 23 నుంచి 30వరకు నామినేషన్స్ ప్రక్రియ కొనసాగింది. అక్టోబర్ ఒకటిన నామినేషన్ల పరిశీఇంచి 3న ఉపసంహరణలను స్వీకరించింది. అయితే సుమారు 75 మంది నామినేషన్లు దాఖలు చేయగా చివరివరకు ఎన్నికల బరిలో నిలిచింది 28 మంది అభ్యర్థులు.ఇందులో కాంగ్రెస్ నుంచి పద్మావతిరెడ్డి, బిజెపినుంచి కోట రామారావు, టిఆర్‌ఎస్ నుంచి శానంపూడి సైదిరెడ్డి,టిడిపి నుంచి కిరణ్మయి పోటీలో ఉన్నారు.

అలాగే ఇతర రాజకీయపార్టీల నుంచి 9 మంది పోటీ చేస్తున్నారు. 15 మంది స్వతంత్ర అభ్యర్థులు హుజూర్‌నగర్ ఉపఎన్నికల్లో పోటీలో ఉన్నారు. అయితే హోరాహోరిపోరు కాంగ్రెస్ టిఆర్‌ఎస్ మధ్యలోనే ఉన్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు. ఈ 28 మంది అభ్యర్థుల భవితవ్యం సోమవారం ఇవిఎంల్లో నిక్షిప్తం కానుంది. 24వ తేదీన కౌంటింగ్ ఫలితాలు వెలుబడనున్నాయి.

మళ్లీ రోడ్‌రోలర్ గుర్తు
హుజూర్‌నగర్ ఉప ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ ప్రత్యేకదృష్టి సారించింది. ప్రధానరాజకీయపార్టీలన్నీ ఎన్నికల బరిలో నిలవడంతో పాటు ఇండిపెండెంట్లు కూడా ఎన్నికలబరిలో ఉండటంతో ఎన్నికల కమిషన్ ప్రత్యేదృష్టి సారించింది. రాష్ట్రంలో ఓకే నియోజకవర్గంలో ఎన్నికలు జరుగుతుండటంతో ప్రధాన రాజకీయపార్టీల ముఖ్యనాయకులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో పటిష్టమైన ఏర్పాట్లు అధికారయంత్రాంగంచేసింది. అయితే గత డిసంబర్‌లో జరిగిన హుజూర్‌నగర్ ఉపన్నికల్లో కారుగుర్తును పోలిన రోడ్‌రోలర్‌తో టిఆర్‌ఎస్‌కు నష్టంవచ్చిందని టిఆర్‌ఎస్ అధిష్టానం ఎన్నికలకమిషన్‌కు ఫిర్యాదు చేసినా ప్రస్తుత ఉపఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులకు రోడ్‌రోలర్, అటో గుర్తులను ఎన్నికల కమిషన్ కేటాయించింది.

డిసెంబర్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ అభ్యర్థి సైదిరెడ్డిపై ఉత్తమ్ కేవలం 7466 ఓట్ల తేడాతో గెలిచారు. ఈ తేడాకు అనేక కారణాలున్నాయని ప్రధానంగా రోడ్‌రోలర్ గుర్తు ఓట్లను చీల్చగలిగిందని టిఆర్‌ఎస్ ఆరోపించింది. అయితే ప్రస్తుత ఎన్నికల్లో రోడ్ రోలర్ ఉన్నప్పటికీ దానిప్రభావం ఉండదనే ఆలోచనలో టిఆర్‌ఎస్ ఉంది. కారుగుర్తు రోడ్‌రోలర్‌గుర్తుకు ఉన్న తేడాను ఓటర్లు గమనిస్తారనే ఆలోచనలో టిఆర్‌ఎస్ ఉంది. అలాగే డిసెంబర్ నాటి హుజూర్‌నగర్ ఎన్నికల్లో 1555 నోటాకు పడటంతో ప్రస్తుత ఎన్నికల్లో ప్రధానరాజకీయపార్టీలు హోరాహోరిగా ప్రచారం నిర్వహించాయి.

టిఆర్‌ఎస్‌కు కాంగ్రెస్‌తోనే పోటీ
అనేకపర్యాయాలు హుజూర్‌నగర్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలిచినప్పటికీ ప్రస్తుత ఎన్నికల్లో టిఆర్‌ఎస్ దూకుడు పెంచింది. అలాగే కాంగ్రెస్ కూడా ప్రచారాన్ని విస్తృతం చేయడంతో హుజూర్‌నగర్ ఉపఎన్నికల్లో టిఆర్‌ఎస్ కాంగ్రెస్ నువ్వానేనా అనేవిధంగా ప్రజల్లోకి దూసుకుపోయాయి. అయితే గత డిసెంబర్‌ఎన్నికల నాటికి ప్రస్తుత ఉపఎన్నికల నాటికి టిఆర్‌ఎస్ బలం పుంజుకుందనీ, ఆనాడు రోడ్‌రోలర్ గుర్తుతో ఓట్లు చీలిపోయినా ప్రస్తుతం ఆపరిస్థితి ఉండదని టిఆర్‌ఎస్ భావిస్తుంది. బిజెపి, టిడిపి కూడా తమపార్టీ ఓటర్లు చీలకుండా ప్రచారం కొనసాగించాయి. అయితే పోటీలో లేని కామ్రేడ్ల ఓట్లు చీలిపోయే అవకాశాలు అధికంగా అగుపిస్తున్నాయి.

Polling for Huzoornagar by-Elections Today

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post హుజూర్‌నగర్ పోలింగ్ నేడే appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.