కాబోయే వాడు అలా ఉండాల్సిందే

  బాలీవుడ్ హీరోయిన్ కంగనారనౌత్ మిగతా హీరోయిన్లకంటే ఎప్పుడూ కాస్తంత భిన్నంగా ఉంటుంది. ఆమెను ఏదైనా ప్రశ్న అడిగితే ఠక్కున సమాధానం చెప్పేస్తుంది. మనసులో ఏమనుకుంటుందో అది నిర్మొహమాటంగా చెబుతుంది. ముక్కుసూటిగా మాట్లాడినా అందరూ ఆలోచించేలా మాట్లాడుతుంది. ఇది కొన్నిసార్లు వివాదంగా మారినా కంగన మాత్రం తన రూటే సపరేట్ అన్నట్టుగానే ఉంటుంది. ఇక కొత్తవాళ్ల నుంచి సీనియర్ హీరోయిన్ల వరకు అందరికీ ఎదురయ్యే ఓ ప్రశ్న… కాబోయే వాడు ఎలా ఉండాలి అని. సరదాగా ఉండాలి… […] The post కాబోయే వాడు అలా ఉండాల్సిందే appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

బాలీవుడ్ హీరోయిన్ కంగనారనౌత్ మిగతా హీరోయిన్లకంటే ఎప్పుడూ కాస్తంత భిన్నంగా ఉంటుంది. ఆమెను ఏదైనా ప్రశ్న అడిగితే ఠక్కున సమాధానం చెప్పేస్తుంది. మనసులో ఏమనుకుంటుందో అది నిర్మొహమాటంగా చెబుతుంది. ముక్కుసూటిగా మాట్లాడినా అందరూ ఆలోచించేలా మాట్లాడుతుంది. ఇది కొన్నిసార్లు వివాదంగా మారినా కంగన మాత్రం తన రూటే సపరేట్ అన్నట్టుగానే ఉంటుంది. ఇక కొత్తవాళ్ల నుంచి సీనియర్ హీరోయిన్ల వరకు అందరికీ ఎదురయ్యే ఓ ప్రశ్న… కాబోయే వాడు ఎలా ఉండాలి అని.

సరదాగా ఉండాలి… హ్యాండ్సమ్‌గా ఉండాలి… నిజాయితీకి నిలువెత్తు రూపంలా ఉండాలి… ఇంత హైట్, అంత వెయిట్ అంటూ హీరోయిన్లు ఏమేమో చెబుతారు. అదే కంగనను కాబోయే వాడు ఎలా ఉండాలి అని అడిగితే మాత్రం… తనకు కాబోయేవాడు ఖచ్చితంగా దేశభక్తుడై ఉండాలని చెప్పింది. ఒకవేళ తనకు లవర్ అయ్యాక దేశభక్తుడు కాదని తెలిస్తే తక్షణం అతన్ని వదిలేస్తానంటోంది. నేను నా దేశాన్ని ప్రేమిస్తా… నా బాయ్‌ఫ్రెండ్ కూడా అలాగే ఉండాలని కోరుకుంటానంటోంది కంగనారనౌత్. పుట్టి పెరిగిన దేశాన్ని గౌరవించలేని వాడికి ప్రేమించిన అమ్మాయంటే గౌరవం ఉంటుందని నేను అనుకోను అని నిర్మొహమాటంగా చెప్పింది.

The Fiance must be a Patriot

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కాబోయే వాడు అలా ఉండాల్సిందే appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.