మంగ్లీ స్పెషల్ ఎట్రాక్షన్‌గా

  తెలుగు రాష్ట్రాలను తన గానంతో ఉర్రూతలూగించిన మంగ్లీ తొలిసారిగా ‘ఊల్లాల ఊల్లాల’ చిత్రంలో నటించింది. అలాగే ఈ చిత్రంలో ఆమె ఒక పాట కూడా పాడింది. దాంతోపాటు హీరోయిన్ నూరిన్‌కి డబ్బింగ్ కూడా చెప్పింది. నటరాజ్ , నూరిన్, అంకిత హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం ‘ఊల్లాల ఊల్లాల’. సీనియర్ నటుడు సత్యప్రకాష్ ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయమవుతున్నారు. సుఖీభవ మూవీస్ పతాకంపై ఏ.గురురాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న […] The post మంగ్లీ స్పెషల్ ఎట్రాక్షన్‌గా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

తెలుగు రాష్ట్రాలను తన గానంతో ఉర్రూతలూగించిన మంగ్లీ తొలిసారిగా ‘ఊల్లాల ఊల్లాల’ చిత్రంలో నటించింది. అలాగే ఈ చిత్రంలో ఆమె ఒక పాట కూడా పాడింది. దాంతోపాటు హీరోయిన్ నూరిన్‌కి డబ్బింగ్ కూడా చెప్పింది. నటరాజ్ , నూరిన్, అంకిత హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం ‘ఊల్లాల ఊల్లాల’. సీనియర్ నటుడు సత్యప్రకాష్ ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయమవుతున్నారు. సుఖీభవ మూవీస్ పతాకంపై ఏ.గురురాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం నవంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్మాత ఏ . గురురాజ్ మాట్లాడుతూ “మంగ్లీకి తెలుగునాట మంచి పాపులారిటీ ఉంది.

ఆమె మా సినిమాలో పాట పాడింది, నటించింది. హీరోయిన్ నూరిన్‌కి డబ్బింగ్ చెప్పింది. ఈ రకంగా మంగ్లీ మా సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలువనుంది. అలాగే బిగ్ బాస్- 2తో క్రేజ్ తెచ్చుకున్న రోల్ రైడా ఇందులో ఓ పాట పాడడంతో పాటు… ఆ పాటలో నటించారు కూడా. ఇంకా ఈ చిత్రంలో ఇలాంటి విశేషాలు చాలా ఉన్నాయి. భారీ తారాగణంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాము”అని చెప్పారు. దర్శకుడు సత్యప్రకాష్ మాట్లాడుతూ- “ఇదొక రొమాంటిక్ ఎంటర్‌టైనింగ్ థ్రిల్లర్. మా అబ్బాయి నటరాజ్ ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయం అవుతున్నందుకు చాలా గర్వంగా ఉంది.

ఈ సినిమాలో చాలా గొప్ప కంటెంట్ ఉంది. భారీ గ్రాఫిక్స్ కూడా వున్నాయి”అని తెలిపారు. గురురాజ్, సత్యప్రకాష్, ‘బాహుబలి’ ప్రభాకర్, పృథ్వీరాజ్, ‘అదుర్స్’ రఘు, జబర్దస్త్ నవీన్, లోబో, జ్యోతి, గీతాసింగ్, జయవాణి తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణంః జె.జి.కృష్ణ, దీపక్, సంగీతంః జాయ్, ఎడిటింగ్‌ః ఉద్ధవ్, నృత్య దర్శకత్వంః శేఖర్ మాస్టర్, దిలీప్ కుమార్, యాక్షన్‌ః డ్రాగన్ ప్రకాష్, పాటలుః కాసర్ల శ్యామ్, గురుచరణ్.

Mangli in ullala ullala movie

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మంగ్లీ స్పెషల్ ఎట్రాక్షన్‌గా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: