దూసుకుపోతున్న ‘సామజవరగమన…’

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తోన్న ‘అల వైకుంఠపురంలో’ని మొదటిపాట ‘సామజవరగమన…’ విడుదలైన విషయం తెలిసిందే. ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన ఈ గీతానికి తమన్ స్వరాలు సమ్మోహన పరుస్తున్నాయి. గాయకుడు సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాట ప్రస్తుతం విశేష ఆదరణకు నోచుకుంటోంది. ఈ పాట విడుదలైన 24 గంటల్లో 6 మిలియన్‌ల వ్యూస్, 3 లక్షలకు పైగా లైక్స్ రావడం విశేషం. తెలుగులో మొదటిసారి […] The post దూసుకుపోతున్న ‘సామజవరగమన…’ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తోన్న ‘అల వైకుంఠపురంలో’ని మొదటిపాట ‘సామజవరగమన…’ విడుదలైన విషయం తెలిసిందే. ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన ఈ గీతానికి తమన్ స్వరాలు సమ్మోహన పరుస్తున్నాయి. గాయకుడు సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాట ప్రస్తుతం విశేష ఆదరణకు నోచుకుంటోంది. ఈ పాట విడుదలైన 24 గంటల్లో 6 మిలియన్‌ల వ్యూస్, 3 లక్షలకు పైగా లైక్స్ రావడం విశేషం. తెలుగులో మొదటిసారి ఫస్ట్ సింగల్‌కు ఇన్ని వ్యూస్, లైక్స్ రావడం హర్షించదగ్గ విషయం. ‘సామజవరగమన…’ పాట విడుదలైన మొదటి 35 నిమిషాల్లో 50 వేల లైక్స్, 88 నిమిషాలకు 1 లక్ష లైక్స్, మూడు గంటల 7 నిమిషాలకు లక్ష 50 వేల లైక్స్, 6 గంటల 12 నిమిషాలకు 2 లక్షల లైక్స్, 10 గంటల 22 నిమిషాలకు 2 లక్షల 50 వేల లైక్స్, 22 గంటల 5 నిమిషాలకు 3 లక్షల లైక్స్ రావడం విశేషం.

అలాగే ఇప్పటివరకు ఈ పాటకు 40 మిలియన్‌ల వ్యూస్, 7 లక్షల లైక్స్ వచ్చాయి. తెలుగులో ఒక సాంగ్‌కు ఇన్ని లైక్స్ , వ్యూస్ రావడం ఇదే ప్రథమం. అల్లు అర్జున్, పూజాహెగ్డే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో టబు, రాజేంద్రప్రసాద్, సచిన్ ఖేడ్కర్, తనికెళ్ల భరణి,మురళీ శర్మ, సముద్ర ఖని, జయరాం, సునీల్, నవదీప్, సుశాంత్, నివేతా పేతురాజ్, గోవిందా పద్మసూర్య, రోహిణి, ఈశ్వరీరావు, కల్యాణి నటరాజన్, శిరీష, బ్రహ్మాజీ, హర్షవర్ధన్, అజయ్ పమ్మిసాయి, రాహుల్ రామకృష్ణ ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరామెన్‌ః పి.ఎస్.వినోద్, ఎడిటర్: నవీన్ నూలి: ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్, ఫైట్స్: రామ్ -,లక్ష్మణ్.

 

Samajavaragamana song with hit talk

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post దూసుకుపోతున్న ‘సామజవరగమన…’ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.