హర్రర్ సినిమాలంటే చాలా భయం!

అలీ ప్రముఖ తెలుగు సినిమా హాస్యనటుడు, టీవీ వ్యాఖ్యాత. బాల నటుడిగా తెలుగు చలనచిత్ర రంగంలో ప్రవేశించాడు. తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రిలో ఒక పేద ముస్లిం కుటుంబంలో జన్మించాడు. వీరి కుటుంబం బర్మాలో వ్యాపారం చేస్తుండేది. రెండవ ప్రపంచయుద్ధం కారణంగా బర్మాను వదలి రాజమండ్రిలో స్థిరపడ్డారు. తండ్రి అబ్దుల్ సుభాన్, దర్జీ పని చేసేవాడు. తల్లి జైతున్ బీబీ గృహిణి. చిన్నప్పటి నుంచే చదువు మీద పెద్దగా ఆసక్తి లేకుండా నటన మీద ఆసక్తి పెంచుకున్నాడు. […] The post హర్రర్ సినిమాలంటే చాలా భయం! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

అలీ ప్రముఖ తెలుగు సినిమా హాస్యనటుడు, టీవీ వ్యాఖ్యాత. బాల నటుడిగా తెలుగు చలనచిత్ర రంగంలో ప్రవేశించాడు. తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రిలో ఒక పేద ముస్లిం కుటుంబంలో జన్మించాడు. వీరి కుటుంబం బర్మాలో వ్యాపారం చేస్తుండేది. రెండవ ప్రపంచయుద్ధం కారణంగా బర్మాను వదలి రాజమండ్రిలో స్థిరపడ్డారు. తండ్రి అబ్దుల్ సుభాన్, దర్జీ పని చేసేవాడు. తల్లి జైతున్ బీబీ గృహిణి. చిన్నప్పటి నుంచే చదువు మీద పెద్దగా ఆసక్తి లేకుండా నటన మీద ఆసక్తి పెంచుకున్నాడు. అలీకి భార్య జుబేదా, ముగ్గురు సంతానం. తమ్ముడు ఖయ్యూం కూడా నటుడే.

సినీరంగ ప్రస్థానం

ఒకసారి రాజమండ్రిలో ప్రెసిడెంట్ పేరమ్మ చిత్రీకరణ జరుగుతోంది. అక్కడ చిత్రబృందానికి వినోదం పంచడానికి వచ్చిన అలీని చూసి దర్శకుడు కె. విశ్వనాథ్ ఆ సినిమాలో బాలనటుడిగా అవకాశం ఇచ్చాడు. తర్వాత దేవుడు మామయ్య, ఘరానా దొంగ, సిరిమల్లె నవ్వింది, ముక్కోపి మొదలైన సినిమాల్లో బాలనటుడిగా నటించాడు. తమిళ దర్శకుడు భారతీరాజా రూపొందిస్తున్న సీతాకోక చిలుక అలీకి నటుడిగా మంచి గుర్తింపునిచ్చింది. తర్వాత బాల నటుడిగా కొన్ని చిత్రాలలో నటించాడు. ప్రేమఖైదీ సినిమాలో హాస్యనటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

* ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన రాజేంద్రుడు గజేంద్రుడు సినిమాలో ‘ఎంద చాట’ అంటూ అలీ పలికిన అర్థం కాని మలయాళీ భాష అతనికి మంచి గుర్తింపు తెచ్చింది.
* యమలీల చిత్రం ద్వారా కథానాయకుడిగా స్థిరపడ్డాడు. అడపా దడపా కథానాయక పాత్రలను పోషిస్తున్నా మొదటి ప్రాధాన్యత మాత్రం హాస్య పాత్రలకే ఇస్తున్నాడు.
ఇప్పటి వరకు సుమారు 1100 పైగా చిత్రాలలో నటించాడు.
* అలీ తండ్రి పేరు మీదుగా మహమ్మద్ బాషా చారిటబుల్ ట్రస్ట్ అనే పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి దాని ద్వారా పేదలకు సేవ చేస్తున్నాడు.

పురస్కారాలు: అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి చిత్రానికి ఉత్తమ హాస్య నటుడి గా ఫిల్మ్ ఫేర్ పురస్కారం. సూపర్ (2005) సినిమాకి గాను ఉత్తమ హాస్య నటుడిగా ఫిల్మ్ ఫేర్ పురస్కారం లభించాయి. అకాడమీ ఆఫ్ యూనివర్సల్ పీస్ వారు అలీకి గౌరవ డాక్టరేట్ ను ప్రకటించారు.

టీవీ కార్యక్రమాలు

1999 లో జెమిని టివి అధినేత కిరణ్ కు డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అనే కార్యక్రమం ఆలోచన అలీ ఇచ్చాడు. ఈ కార్యక్రమం ద్వారా చాలామంది నటులు, వ్యాఖ్యాతలు తయారయ్యారు. ఈటీవీ తెలుగులో అలీ 369, అలీతో జాలీగా, అలీతో సరదాగా మొదలైన కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. “వీడు బాగా నవ్విస్తాడు, ఏడిపిస్తాడు అని ప్రేక్షకులు ఎవర్ని భావిస్తారో వారే గొప్ప నటుడు” అంటాడు అలీ. ఓంకార్ దర్శకత్వంలో అశ్విన్ బాబు, అవికా గోర్ జంటగా తెరకెక్కిన ‘రాజుగారి గది 3’ చిత్రంలో కీలక పాత్ర పోషించి మెప్పించాడు అలీ.

వెయ్యికి పైగా చిత్రాల్లో నటించి, నాలుగు దశాబ్దాలుగా తెలుగు తెరపై నవ్వులు పంచుతున్నారు హాస్య నటుడు అలీ. బ్రహ్మానందం, మల్లికార్జునరావు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎంఎస్ నారాయణ నాకు నచ్చిన హాస్యనటులు. వాళ్లంతా రచయితలుగా కెరీర్ స్టార్ట్ చేసి కామెడీ యాక్టర్స్ అయ్యారు. కామెడీ ఎంత మోతాదులో ఉండాలో వాళ్లకు తెలుసు. అందుకే గొప్ప హాస్యనటులుగా పేరు తెచ్చుకున్నారు.

* హారర్ సినిమాలో నటించడం నాకు కొత్త. ఇలాంటి సినిమా ఇప్పటిదాకా చేయలేదు. చెన్నైలో ఉన్నప్పుడు ఓ హారర్ సినిమా చూసి థియేటర్ నుంచి ఇంటికెళ్లేందుకు భయపడిపోయా. ఈ సినిమాలో నేను నటించినా, టీజర్ చూసి భయపడిపోయా.

actor ali basha biography

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post హర్రర్ సినిమాలంటే చాలా భయం! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.