బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ కు అనారోగ్యం

ముంబయి: బాలీవుడ్‌ బిగ్ బి అమితాబ్‌ బచ్చన్‌ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయన ముంబయిలోని నానావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని బాలీవుడ్ లో వార్తలు గుప్పుమంటున్నాయి. అమితాబ్ కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని, ఈ క్రమంలోనే ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అమితాబ్ ఆరోగ్య పరిస్థితిపై నానావతి ఆస్పత్రి వైద్యులు స్పందించారు. రెగ్యులర్ చెకప్ కోసమే ఆయన ఆస్పత్రిలో చేరారని […] The post బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ కు అనారోగ్యం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ముంబయి: బాలీవుడ్‌ బిగ్ బి అమితాబ్‌ బచ్చన్‌ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయన ముంబయిలోని నానావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని బాలీవుడ్ లో వార్తలు గుప్పుమంటున్నాయి. అమితాబ్ కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని, ఈ క్రమంలోనే ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అమితాబ్ ఆరోగ్య పరిస్థితిపై నానావతి ఆస్పత్రి వైద్యులు స్పందించారు. రెగ్యులర్ చెకప్ కోసమే ఆయన ఆస్పత్రిలో చేరారని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. అమితాబ్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎటువంటి ఆందోళన వద్దని వారు వెల్లడించారు. అమితాబ్ కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని వైద్యులు తేల్చి చెప్పారు.

Bollywood Star Amitabh Is Sick

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ కు అనారోగ్యం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: