పారదర్శక టౌన్ ప్లానింగ్

 పూర్తి ఆన్‌లైన్ కానున్న భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియ, దేశంలోకెల్లా తెలంగాణలోనే అత్యుత్తమ విధానం  కొత్త టౌన్‌షిప్ విధాన ముసాయిదాకు బిల్డర్ల సంఘాలు సలహాలివ్వాలి : రియల్‌ఎస్టేట్ ప్రతినిధులతో మంత్రి కెటిఆర్ మన తెలంగాణ/హైదరాబాద్:భవన నిర్మాణ అనుమతుల్లో తెలంగాణ విధానం దేశంలోని అత్యుత్తమ విధానా ల్లో ఒకటి అని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. ఇప్పటికే భవ న నిర్మాణ అనుమతుల విషయంలో పా రదర్శక విధానాలకు శ్రీకారం చుట్టామ ని, ఇందుకోసం మెత్తం […] The post పారదర్శక టౌన్ ప్లానింగ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 పూర్తి ఆన్‌లైన్ కానున్న భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియ, దేశంలోకెల్లా తెలంగాణలోనే అత్యుత్తమ విధానం
 కొత్త టౌన్‌షిప్ విధాన ముసాయిదాకు బిల్డర్ల సంఘాలు సలహాలివ్వాలి : రియల్‌ఎస్టేట్ ప్రతినిధులతో మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్:భవన నిర్మాణ అనుమతుల్లో తెలంగాణ విధానం దేశంలోని అత్యుత్తమ విధానా ల్లో ఒకటి అని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. ఇప్పటికే భవ న నిర్మాణ అనుమతుల విషయంలో పా రదర్శక విధానాలకు శ్రీకారం చుట్టామ ని, ఇందుకోసం మెత్తం ప్రక్రియను అన్ లైన్ చేస్తున్నామన్నారు. ఇందులో మరి ంత పారదర్శకంగా ఉండే విధానాన్ని రూపకల్పన చేస్తున్నామన్నారు. గురువారం రియల్ ఎస్టేట్ సంఘాలు పురపాలక కాంప్లెక్స్‌లోని మంత్రి కార్యాలయ ంలో కెటిఆర్‌ను కలిశాయి. ఈ సందర్భంగా ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్డింగ్ అనుమతుల ప్రక్రియను వారికి మం త్రి తెలియజేశారు. ఈ ప్రక్రియపైన క్షేత్రస్ధాయిలో ఉన్న స్పందనను కెటిఆర్ అడిగి తెలుసుకున్నారు. దీన్ని మరింత సులభతరం చేసేందుకు, మున్సిపల్ శాఖ ఉన్నతాధికారుల బృందం అధ్యయ నం చేస్తున్నదని, బిల్డర్ల సంఘాల నుంచి ఒకరిద్దరు పతినిధులు అధికారులతో కలసి పనిచేయాలని ఈ సందర్భంగా మంత్రి సూచించారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలో ఉన్న బిల్డింగ్ అ నుమతుల విధానాలను పరిశీలించి, అ త్యుత్తమ విధానంగా మార్చేందుకు సూ చనలు చేయాలన్నారు. ఇప్పటికే అన్ని మున్సిపల్ విభాగాల్లో ఈ-..ఆఫీస్ సాప్ట్‌వేర్ ఉపయోగిస్తున్నామన్నారు. ఈ విధానంలో ఫైళ్ల అనుమతులు ఏదశలో ఉ న్నాయో ఎప్పటికప్పుడు తెలుస్తుందన్నా రు. దీంతో అనుమతులు అలస్యం అ య్యే అవకాశం లేదని కెటిఆర్ స్పష్టం చేశారు. దేశంలోని రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ నగరం వృద్ది దిశలో కొనసాగుతున్నదని ఆయన పేర్కొన్నారు. ఇందుకోసం రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం అనేక విధానపరమైన చర్యలు తీసుకున్నామని మంత్రి తెలిపారు. వేలాది మందికి ఉపాది కల్పించే భవన నిర్మాణ రంగానికి, రియల్ ఎస్టేట్ రంగానికి ప్రభుత్వం సహకరిస్తుందని, అదే సమయంలో నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే అంతే కఠినంగా చర్యలు ఉంటాయన్నారు. నగరంలో ఇప్పటికే భవన నిర్మాణ వ్యర్ధాల రిసైక్లింగ్ ప్లాంట్లను ఏర్పాటు చేశామని, నిర్మాణ వ్యర్ధ్యాలను చెరువులు, ఖాళీ ప్రదేశాల్లో వేస్తే చర్యలు తప్పవన్నారు.

దీంతోపాటు భవన నిర్మాణ నిబంధనలు పాటించేలా చూడాలని, ఈ దిశగా సంఘాలే తమ భాగస్వాముల్లో మరింత చైతన్యం చూపాలన్నారు. తెలంగాణ ప్రభుత్వ డ్రాప్ట్ టౌన్ షిప్ పాలసీని అన్ని బిల్డర్ సంఘాలకు అందిస్తామని, దానిపైన సలహాలు, సూచనలు ఇవ్వాలని సూచించారు. నగర అభివృద్ది నలుదిశలా విస్తరించాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యమని, ఇందుకోసం బిల్డర్లు కూడా మద్దతు ఇవ్వాలని కోరారు. పశ్చిమ హైదరాబాద్ నగరం ఇప్పటికే కంపెనీలతో నిండిపొయిందని, జనసాంద్రత పెరిగిన నేపథ్యం ఇతర ప్రాంతాలకు కంపెనీలు వచ్చేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్న మంత్రి, అయా ప్రాంతాల్లో గృహ నిర్మాణాలు అందుబాటులోకి వచ్చేలా కృషి చేయాలన్నారు. రియల్ ఎస్టేట్ సంఘాలు కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమాల్లో భాగంగా జియచ్‌యంసితో కలిసి పనిచేయాలని మంత్రి కోరారు. ఈ సమావేశంలో క్రెడాయ్ తెలంగాణ, తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ పలు ఇతర సంఘాల ప్రతినిధులు ఉన్నారు.

Building permits in Online

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post పారదర్శక టౌన్ ప్లానింగ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: