ప్యారడైజ్ హోటల్‌కు జరిమానా

 లక్ష రూపాయలు ఫైన్ విధించిన జిహెచ్‌ఎంసి  బిర్యానీలో వెంట్రుకలపై వినియోగదారుడి ఫిరాదుకు స్పందన మన తెలంగాణ/బేగంపేట : బిర్యానీకి జాతీయస్థాయిలో పేరుగాంచిన ప్యారడైజ్ హోటల్‌లో అపరిశుభ్రమైన ఆహారం అందిస్తున్నారని జీహెచ్‌ఎంసీ అధికారులు లక్ష రూపాయలు జరిమానా విధించారు. ఓ వినియోగదారుడికి వడ్డించిన బిర్యానీలో వెంట్రుకలు కనిపించడంతో సిబ్బందిని ప్రశ్నించాడు. వారి నుంచి నిర్లక్షపు సమాధానం రావడంతో అధికారులకు ఫిర్యాదు చేశాడు. గురువారం ఫుడ్‌సేఫ్టీ అధికారి సుదర్శన్‌రెడ్డి, ఏఎంహెచ్‌వో రవీందర్‌గౌడ్, వెటర్నరీ అధికారి శ్రీనివాస్‌రెడ్డి హోటల్‌కు వెళ్లి తనిఖీలు […] The post ప్యారడైజ్ హోటల్‌కు జరిమానా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 లక్ష రూపాయలు ఫైన్ విధించిన జిహెచ్‌ఎంసి
 బిర్యానీలో వెంట్రుకలపై వినియోగదారుడి ఫిరాదుకు స్పందన

మన తెలంగాణ/బేగంపేట : బిర్యానీకి జాతీయస్థాయిలో పేరుగాంచిన ప్యారడైజ్ హోటల్‌లో అపరిశుభ్రమైన ఆహారం అందిస్తున్నారని జీహెచ్‌ఎంసీ అధికారులు లక్ష రూపాయలు జరిమానా విధించారు. ఓ వినియోగదారుడికి వడ్డించిన బిర్యానీలో వెంట్రుకలు కనిపించడంతో సిబ్బందిని ప్రశ్నించాడు. వారి నుంచి నిర్లక్షపు సమాధానం రావడంతో అధికారులకు ఫిర్యాదు చేశాడు. గురువారం ఫుడ్‌సేఫ్టీ అధికారి సుదర్శన్‌రెడ్డి, ఏఎంహెచ్‌వో రవీందర్‌గౌడ్, వెటర్నరీ అధికారి శ్రీనివాస్‌రెడ్డి హోటల్‌కు వెళ్లి తనిఖీలు నిర్వహించారు. అందులో సింగల్ యూజ్ ప్లాస్టిక్ క్యారీబాగులు కనిపించాయి. అదే విధంగా కుళ్లిపోయిన కూరగాయలు వినియోగిస్తుండటం కిచెన్‌లో అపరిశుభ్ర వాతావరణం కనిపించింది. దీంతో అధికారులు హోటల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసి నోటీసులు జారీ చేసి లక్ష రూపాయల జరిమానా విధించారు. వినియోగాదారులకు నాణ్యమైన భోజనం వడ్డించడంతో పాటు మర్యాదగా మెలగాలని సూచించారు. ఇలాంటి చర్యలు పునరావృతం అయితే హోటల్‌నే మూసివేస్తామని అధికారులు హెచ్చరించారు.
జమ్‌జమ్ బేకరికి 15వేలు జరిమానా
ప్యారడైజ్ సర్కిల్‌లో ఉండే జమ్‌జమ్ బేకరీకి రూ. 15వేలు జరిమానా విధించారు. ఈబేకరిలో సింగల్ యూజ్ ప్లాస్టిక్ వాడుతుండటం, కిచెన్‌లో అపరిశుభ్రత కనిపించడటంతో నోటీసుల జారీ చేసి జరిమానా వేశారు.

 Paradise Biryani restaurant fined Rs 1 lakh

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ప్యారడైజ్ హోటల్‌కు జరిమానా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: