ఎస్‌బిఐకి రూ.185కోట్ల టోపీ

మనతెలంగాణ/ సిటిబ్యూరో : గుడ్‌విల్ పేరుతో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని మోసం చేసిన ఘరానా మోసగాడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్ కరుణాకర్ రెడ్డి తెలిపారు. పంజాగుట్ట పిఎస్‌లో చదలవాడ రవీంద్రబాబుపై వారెంటు ఉందని, దానిని అమలు చేసేందుకు వెతుకుతున్నామని తెలిపారు. పోలీసు స్టేషన్‌కు వచ్చాడనే సమాచారం తప్పని, పిఎస్‌కు రాలేదని స్పష్టం చేశారు.విద్యుత్ సబ్‌స్టేషన్ల నిర్మాణ కాంట్రాక్టు పనులు చేసే రవీంద్రబాబు వాటిపేరుతో బ్యాంకుల నుంచి రుణా లు తీసుకున్నాడు. […] The post ఎస్‌బిఐకి రూ.185కోట్ల టోపీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మనతెలంగాణ/ సిటిబ్యూరో : గుడ్‌విల్ పేరుతో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని మోసం చేసిన ఘరానా మోసగాడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్ కరుణాకర్ రెడ్డి తెలిపారు. పంజాగుట్ట పిఎస్‌లో చదలవాడ రవీంద్రబాబుపై వారెంటు ఉందని, దానిని అమలు చేసేందుకు వెతుకుతున్నామని తెలిపారు. పోలీసు స్టేషన్‌కు వచ్చాడనే సమాచారం తప్పని, పిఎస్‌కు రాలేదని స్పష్టం చేశారు.విద్యుత్ సబ్‌స్టేషన్ల నిర్మాణ కాంట్రాక్టు పనులు చేసే రవీంద్రబాబు వాటిపేరుతో బ్యాంకుల నుంచి రుణా లు తీసుకున్నాడు. ఆరు రాష్ట్రాల్లో విద్యుత్ సబ్‌స్టేషన్లు నిర్మించిన మోసగాడు చ దలవాడ రవీంద్రబాబు ఎస్‌బిఐ నుంచి రూ.185 కోట్ల రుణం తీసుకుని నిండాముంచాడు.

నాచారంలోని ఎస్‌బిఐ కేంద్రంగా మోసాలకు తెరతీశాడు. నాచారంలోని ఎస్‌బిఐ బ్రాంచ్ ద్వారానే వివిధ రాష్ట్రాల్లో నిర్మిస్తున్న సబ్‌స్టేషన్ల నిర్మాణ పనులకు రూ.185కోట్ల రుణం పొందినట్లు తెలిసింది. కోల్‌కతాలో సబ్‌స్టేషన్ నిర్మాణ కాంట్రాక్టు దక్కించుకున్న రవీంద్రబాబు నాచారం ఎస్‌బిఐ లో పత్రాలు సమర్పించి, కోఠిలోని బ్యాంక్ ప్రధాన శాఖ అధికారులతో చెప్పించి రుణాలు తీసుకున్నట్లు తెలిసింది. ఇలా ఎక్కడ సబ్‌స్టేషన్ నిర్మిస్తే అక్కడి ఎస్‌బిఐ అధికారులకు పైస్థాయి అధికారులతో చెప్పించుకుని రుణాలు తీసుకున్నాడు. మొండి బకాయిల కింద లెక్కగట్టి ఒకేసారి సెటిల్‌మెంట్ చేసుకుందామని బ్యాంకు అధికారులు ప్రతిపాదిస్తే తన దగ్గర నయాపైసా కూడా లేదని మొండికేశేవాడు. దీంతో చేసేదేమిలేక బ్యాంకు అధికారులు ఈవిషయాన్ని పక్కనపెట్టేశారు.

Man Arrested For Allegedly Cheating Bank Loans

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఎస్‌బిఐకి రూ.185కోట్ల టోపీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: