370 రద్దు వద్దన్న వారు చరిత్రకెక్కుతారు

బీడ్ : ఆర్టికల్ 370 రద్దును తిట్టిపోసే వాళ్లకు చరిత్రలో అందుకు తగు విధమైన స్థానమే దక్కుతుందని ప్రధాని మోడీ చెప్పారు. గురువారం ఆయన మహారాష్ట్రలోని పర్లీలో ఎన్నికల సభలో మాట్లాడారు. చేష్టలను బట్టి చరిత్రలో స్థానం దక్కుతుందని, ఈ క్రమంలో ఆర్టికల్ 370 రద్దుపై విమర్శలకు దిగిన వారికి కూడా స్థానం ఉంటుందన్నారు. కేంద్రం సరైన నిర్ణయం తీసుకుని, నష్టదాయక ఆర్టికల్‌ను రద్దు చేసిందని, దీనిని విమర్శించిన వారికి ఈ ఎన్నికలలో మహారాష్ట్ర ప్రజలు తగు […] The post 370 రద్దు వద్దన్న వారు చరిత్రకెక్కుతారు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

బీడ్ : ఆర్టికల్ 370 రద్దును తిట్టిపోసే వాళ్లకు చరిత్రలో అందుకు తగు విధమైన స్థానమే దక్కుతుందని ప్రధాని మోడీ చెప్పారు. గురువారం ఆయన మహారాష్ట్రలోని పర్లీలో ఎన్నికల సభలో మాట్లాడారు. చేష్టలను బట్టి చరిత్రలో స్థానం దక్కుతుందని, ఈ క్రమంలో ఆర్టికల్ 370 రద్దుపై విమర్శలకు దిగిన వారికి కూడా స్థానం ఉంటుందన్నారు. కేంద్రం సరైన నిర్ణయం తీసుకుని, నష్టదాయక ఆర్టికల్‌ను రద్దు చేసిందని, దీనిని విమర్శించిన వారికి ఈ ఎన్నికలలో మహారాష్ట్ర ప్రజలు తగు విధంగా జవాబు చెపుతారని అన్నారు. ఈ నెల 21వ తేదీన జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి నాయకత్వపు కూటమి గెలుపు రికార్డులను బద్ధలు కొడుతుందని తెలిపారు. ఇక్కడ జరుగుతున్న ఎన్నికలు బిజెపికి సొంతమైన కార్యశక్తికి, ప్రతిపక్షాల స్వార్థశక్తికి మధ్య సాగుతున్న పోరు అని ప్రకటించారు. ప్రగతి దీక్షతో బిజెపి సాగుతోందని, స్వ చింతనతోనే ప్రతిపక్షాలు కదులుతున్నాయని, విజయం ఎవరిదనేది ఈ ఎన్నికలలో తేలుతుందని చెప్పారు. ఇక్కడి వారిని, వారి దేశభక్తిని తాను అన్ని విధాలుగా విశ్వసిస్తానని, ఇక్కడి వారు దేశ ప్రయోజనాలకోసం నినదిస్తారన, దేశ వ్యతిరేకులను తిప్పికొడుతారని, ఈ ఎన్నికలలో ఇదే జరుగుతుందని జోస్యం చెప్పారు.

చరిత్ర దేనిని చూస్తూ ఊరుకోదని, అన్నింటికీ కొలమానంగా ఉంటుందని, ఆర్టికల్ 370 రద్దుపై విమర్శలకు దిగిన వారికి చరిత్ర పుటల్లో ఉండాల్సిన స్థానం ఖరారు అయిందని అన్నారు. కశ్మీర్‌లో హిందూ జనాభా ఎక్కువగా ఉండి ఉంటే కేంద్రం ఈ ఆర్టికల్‌ను ఎత్తివేయకపోయి ఉండేదని కాంగ్రెస్ నేతలు చెపుతున్నారని, అయితే దేశ ఐక్యత సమగ్రతలకు సంబంధించిన విషయాలలో హిందూ ముస్లింల గురించి ఆలోచిస్తామా? ఇటువంటి ఆలోచన తగునా? అని ప్రశ్నించారు. దేశ ప్రయోజనాలకు భంగకరమైన రీతిలో కేంద్రం చర్యలను విమర్శించే వారికి ఈ నెలలోనే ఇక్కడి ప్రజలు తగు సమాధానం ఇస్తారని చెప్పారు. ఆర్టికల్ 370ని రద్దు చేయడంపై విమర్శలకు దిగిన వారిని దెబ్బతీసే అధికారిక తొలి అవకాశం ఈ ఎన్నికల ద్వారా మరాఠాలకు వచ్చిందని, ఇది ఇక్కడి తలుపు తట్టిందని, దీనిని వినియోగించుకోవాలని కోరారు. ప్రజాధనాన్ని దోచుకుతింటూ వచ్చిన వారిని జైలుకు పంపే ప్రక్రియ ప్రారంభం అయిందని తెలిపారు. బీఢ్ జిల్లా ఎందరో బిజెపి అతిరధ మహారథులకు వేదికగా నిలిచిందని, గోపీనాథ్ ముండే, ప్రమోద్ మహాజన్ వంటి వారు ఇక్కడివారే అని , ఇక ఈ ప్రాంతం బిజెపికి బ్రహరథం పడుతుందని చెప్పడంలో ఇక్కడ కమల వికాసానికి తిరుగులేదని తెలియచేయడంలో తనకు ఎటువంటి అపనమ్మకం లేదన్నారు. కాంగ్రెస్ , ఎన్‌సిపిలు ఒకరితో ఒకరు పోటీపడుతున్నారని, వారికి బిజెపిని ఎదిరించే ధైర్యం లేదని, బిజెపి సభలకు తరలివస్తున్న జనాన్ని చూసి వారు జడుసుకుంటున్నారని తెలిపారు.

PM Modi addresses Public Meeting at Parli

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post 370 రద్దు వద్దన్న వారు చరిత్రకెక్కుతారు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: