ధోనీ భవిష్యత్తుపై గంగూలీ స్పందన…

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ భవిష్యత్తుపై బిసిసిఐ కాబోయే అధ్యక్షుడు, భారత క్రికెట్ దిగ్గజం గంగూలీ స్పందించారు. గంగూలీ బిసిసిఐ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. అక్టోబర్ 23న నూతన అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలను స్వీకరించనున్నారు. క్రికెట్ లో ఎంతో అనుభవం ఉన్న గంగూలీ ఈ బాధ్యతలను చేపట్టడంతో టీమిండియా క్రికెట్ లో చాలా మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బిసిసిఐలోకి గంగూలీ ఎంట్రీ ఇవ్వడంతో, ఇప్పుడు మొత్తం చర్చ […] The post ధోనీ భవిష్యత్తుపై గంగూలీ స్పందన… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ భవిష్యత్తుపై బిసిసిఐ కాబోయే అధ్యక్షుడు, భారత క్రికెట్ దిగ్గజం గంగూలీ స్పందించారు. గంగూలీ బిసిసిఐ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. అక్టోబర్ 23న నూతన అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలను స్వీకరించనున్నారు. క్రికెట్ లో ఎంతో అనుభవం ఉన్న గంగూలీ ఈ బాధ్యతలను చేపట్టడంతో టీమిండియా క్రికెట్ లో చాలా మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బిసిసిఐలోకి గంగూలీ ఎంట్రీ ఇవ్వడంతో, ఇప్పుడు మొత్తం చర్చ ధోనీపై జరగుతుంది.

ధోనీకి గంగూలీ చెక్ పెట్టడం ఖాయమనే క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో గంగూలీ మీడియాతో మాట్లాడారు. ఈ నెల 24న సెలక్టర్లతో తాను భేటీ అయిన తర్వాత.. ధోనీ గురించి ఆ సమావేశంలో సెలక్టర్ల అభిప్రాయాన్ని తెలుసుకుంటానని చెప్పారు. అనంతరం ధోనీతో భేటీ అవుతానని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా పాల్గొననున్నారు. మారిన నిబంధనల వల్ల ఈ సమావేశానికి భారత కోచ్ రవిశాస్త్రి అందుబాటులో ఉండకపోవచ్చని గంగూలీ పేర్కొన్నారు.

Ganguly said he will speak to selectors about MS Dhoni

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ధోనీ భవిష్యత్తుపై గంగూలీ స్పందన… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: