బహిరంగంగా మూత్ర విసర్జిస్తే…జరిమాన పడుద్ది

తస్మాత్ జాగ్రత్త…! రూ. 100 జరిమానా వ్యర్థాలు, నీటిని రోడ్లపై వేస్తే కఠిన చర్యలు ఒక్క రోజులోనే 211 కేసులు జరిమానాలు రూ. 18.21 లక్షలు హైదరాబాద్: నగరవాసులూ తస్మాత్ జాగ్రత్త…! గ్రేటర్‌లో బహిరంగంగా మూత్రవిసర్జన చేస్తే రూ. 100లు జరిమానా విధించడం కూడా కొనసాగిస్తున్నది. బుధవారం జిహెచ్‌ఎంసి ఎన్‌ఫోర్స్‌మెంట్ టీం బహిరంగంగా మూత్ర విసర్జన చేసిన వ్యక్తికి జరిమానాను విధించింది. ఇటీవల బహిరంగంగా సిగరేట్స్ తాగినా, అనుమతులు లేకుండా పోస్టర్‌లు వేసినా జరిమానాలు విధించడం చేస్తున్నారు […] The post బహిరంగంగా మూత్ర విసర్జిస్తే… జరిమాన పడుద్ది appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
తస్మాత్ జాగ్రత్త…!
రూ. 100 జరిమానా
వ్యర్థాలు, నీటిని రోడ్లపై వేస్తే కఠిన చర్యలు
ఒక్క రోజులోనే 211 కేసులు
జరిమానాలు రూ. 18.21 లక్షలు

హైదరాబాద్: నగరవాసులూ తస్మాత్ జాగ్రత్త…! గ్రేటర్‌లో బహిరంగంగా మూత్రవిసర్జన చేస్తే రూ. 100లు జరిమానా విధించడం కూడా కొనసాగిస్తున్నది. బుధవారం జిహెచ్‌ఎంసి ఎన్‌ఫోర్స్‌మెంట్ టీం బహిరంగంగా మూత్ర విసర్జన చేసిన వ్యక్తికి జరిమానాను విధించింది. ఇటీవల బహిరంగంగా సిగరేట్స్ తాగినా, అనుమతులు లేకుండా పోస్టర్‌లు వేసినా జరిమానాలు విధించడం చేస్తున్నారు నగర పోలీసులు. నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడంపై గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది. ప్లాస్టిక్ రహిత నగరంగా, పరిశుభ్రతకు పెట్టింది పేరుగా నగరాన్ని తీర్చిదిద్దడంపై నిరంతరం చర్యలను కొనసాగిస్తున్నది. వ్యాపార వాణిజ్య సంస్థలు తమ కేంద్రాల్లో వెలువడే వ్యర్థాలను నిర్వహణాను సరైన పద్దతిలో చేపట్టకపోయినా జరిమానాలను అపరిమితంగా వేస్తున్నది. అందులో భాగంగానే బుధవారం అనిల్ రామన్ గోయల్‌కు చెందిన జెఎస్‌టిసి లాజిస్టిక్ సంస్థకు లక్ష రూపాయలను జరిమాను గ్రేటర్ అధికారులు విధించారు.

ఒక్క రోజులోనే రూ. 18.21లక్షలు జరిమానా

గ్రేటర్‌పై రోడ్డు మీద నీటిని పారబోసినా, నిర్మాణ వ్యర్థాలు వేసినా గ్రేటర్ అధికారులు కొరడా ఝలిపిస్తున్నారు. ఒక్క రోజులోనే 211 కేసులు నమోదు చేసి నిబంధనలను ఉల్లంఘించిన వారికి రూ. 18,21,300లు జరిమానాగా విధించారు. ఇందులో ప్రధానంగా 50 మైక్రాన్‌ల మందంకన్నా తక్కువగా ఉన్న ప్లాస్టిక్ కవర్లను వినియోగిస్తున్న వారు, వ్యర్థాలను రోడ్డుపై వేస్తున్నవారే అధికంగా ఉన్నారు. ఆనంద్ అనే వ్యాపారికి రూ. 30 వేలు, ప్రవీణ్ టిప్పర్ అదనపులోడు వేసుకుని వెళ్తున్నందుకు రూ. 25 వేలు, ఈశ్వర్‌నాథ్‌కు రూ. 25వేలు తక్కువ మందం కలిగి ఉన్న ప్లాస్టిక్ కవర్లను వాడినందుకు ఇలా 211 మందికి జరిమానాలు విధించారు. గత 5 మాసాల్లో రూ. 2.16 కోట్లు జరిమానాల రూపంలో జిహెచ్‌ఎంసి వసూలు చేసింది.

public urination law and penalties in hyderabad

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post బహిరంగంగా మూత్ర విసర్జిస్తే… జరిమాన పడుద్ది appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: