పేదల బతుకులు మారేదెన్నడు?

భారత దేశంలో ఇప్పటికీ 50 శాతం కంటే ఎక్కువ మంది ప్రజలు తమ జీవనోపాధి కొరకు వ్యవసాయంపైన ఆధారపడుతున్నారు. రైతులు,  వ్యవసాయ కూలీలు ఎక్కువ. అంతేకాక చాలామంది ప్రజల జీవనోపాధి వ్యవసాయంపైనే ఆధారపడి ఉంది. కాబట్టి వ్యవసాయం ప్రగతి సాధించడం ముఖ్యం. వ్యవసాయం అభివృద్ధి చెందితే గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఉపాధి ఆదాయాలను సమకూరుస్తుంది. అంతేకాకుండా వ్యవసాయ ఉత్పత్తి బాగుంటే ఆహార ధరలు ఎక్కువ మందికి అందుబాటులో ఉండే  అవకాశం ఉంది. ప్రస్తుత వ్యవసాయం అనేక సమస్యలను […] The post పేదల బతుకులు మారేదెన్నడు? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

భారత దేశంలో ఇప్పటికీ 50 శాతం కంటే ఎక్కువ మంది ప్రజలు తమ జీవనోపాధి కొరకు వ్యవసాయంపైన ఆధారపడుతున్నారు. రైతులు,  వ్యవసాయ కూలీలు ఎక్కువ. అంతేకాక చాలామంది ప్రజల జీవనోపాధి వ్యవసాయంపైనే ఆధారపడి ఉంది. కాబట్టి వ్యవసాయం ప్రగతి సాధించడం ముఖ్యం. వ్యవసాయం అభివృద్ధి చెందితే గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఉపాధి ఆదాయాలను సమకూరుస్తుంది. అంతేకాకుండా వ్యవసాయ ఉత్పత్తి బాగుంటే ఆహార ధరలు ఎక్కువ మందికి అందుబాటులో ఉండే  అవకాశం ఉంది. ప్రస్తుత వ్యవసాయం అనేక సమస్యలను ఎదుర్కొంటున్నది.

భారత దేశాన్ని వెంటాడుతున్న సమస్యలలో పేదరికం ప్రధాన సమస్య. పేదరిక నిర్మూలన కోసం అన్ని దేశాలు ప్రణాళికలు రూపొందించుకొని అమలు పరుస్తున్నాయి. మన దేశానికి స్వాతం త్య్రం వచ్చి దశాబ్దాలు గడిచినా ఇంకా భారతదేశంలో పేదరికం పోలేదు. ప్రభుత్వ పథకాలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. చిత్తశుద్ధితో అమలు పరచలేదు. ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారంగా ఎక్కువ మంది పేదలు మన భారతదేశంలోనే ఉన్నారు. పేదరిక నిర్మూలన కోసం ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 17 న ‘అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం‘ నిర్వహిస్తున్నాము . ఈ 2019 సంవత్సరాన్ని ‘పేదరికాన్ని అంతం చేయడానికి పిల్లలను, వారి కుటుంబాలను, సంఘాలను శక్తివంతం చేయడానికి కలిసి పని చేయడం’ అనే నినాదంతో జరుపుకుంటున్నాము. ప్రపంచంలో అత్యంత నిరుపేదలు ఉన్న దేశం భారతదేశం.

పేదరికంలో భారత దేశానికి మూడవ స్థానం. తరాలు మారినా కూడా ఇంకా మారని బ్రతుకులు స్వాతంత్య్ర భారతదేశానికి పెను సవాలుగా మారింది. ఈ పేదరికం వలన ఐదేళ్లలోపు శిశువుల మరణాలు కూడా మన దేశంలో ఎక్కువే. ప్రపంచంలో 17 శాతం ప్రసూతి మరణాలు కూడా భారతదేశంలోనే జరుగుతున్నాయి. పేదల సంఖ్య ఎలా పెరుగుతుందో, కోటీశ్వరుల సంఖ్య కూడా అలాగే పెరుగుతున్నది. ప్రపంచంలో అనుసరిస్తున్న వ్యాపార విధానాల వలన పేదరికం ఎక్కువ అవుతున్నది. ఏటా 15 శాతం మరణాల నమోదు భారతదేశంలోనే ఉన్నది. అనేక దేశాలలో కూడా ధనిక పేదల మధ్య అంతరం పెరుగుతూనే ఉన్నది.

మనం రోజువారీ పనులు చేయడానికి మనకు శక్తి కావాలి. శక్తి మనం తినే ఆహారం నుండి వస్తుంది. ఆహారం లేక చాలామంది అలసటకు గురి అవుతారు. పేదలకు పని చేయడానికి సరిపోయేంత ఆహారం దొరకదు వాళ్లు తినవలసిన దానికంటే తక్కువ తింటారు. ఈ పరిస్థితి చాలా కాలం కొనసాగడాన్ని తీవ్ర ఆకలి అంటారు. తీవ్ర ఆకలి కూడా పేదరికమే. తీవ్ర ఆకలి వలన వాళ్ళు బలహీనంగా ఉండి తరచూ రోగాల బారిన పడుతుంటారు. సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ అత్యంత పేదల ఆహారంలో కేలరీలు పరిమాణం తగ్గుతూ ఉండటం చాలా ఆందోళన కలిగిస్తున్నది. ప్రస్తుతం మన దేశం మొత్తం సంపద పెరిగినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కువ వస్తువులు, సేవలు అందుబాటులో ఉన్నాయి. కానీ అత్యంత పేదలు మాత్రం ఆకలికి గురి కావడం నిత్యం జరుగుతుంది. నేడు పేదలకు 20 సంవత్సరాల క్రితం కంటే అందినడాని కంటే తక్కువ కేలరీల శక్తి ప్రస్తుతం అందుతున్నది.

తీవ్ర ఆకలికి గురయ్యే ప్రజలకు తగినంత పోషక ఆహారం దొరకదు సరైన మోతాదులో ఆహారం తీసుకోకపోతే మానసిక శారీరక లోపానికి గురవుతారు. పిల్లలలో పోషకాహార లోపం ఉంటే చదవటం, పని చేయడం, శారీరక పనులు చేయడం కష్టమవుతుంది. పోషకాహార లోపం ఉండే పిల్లలు ఆరోగ్యంగా ఉండే పిల్లల అంత వేగంగా పెరగరు. మానసికంగా కూడా అంత బాగా అభివృద్ధి చెందరు. నిత్యం ఆకలితో ఉండటం వల్ల రోగ నిరోధక శక్తి తగ్గి జబ్బు పడుతారు. గర్భిణులు సాధారణంగా బరువు తక్కువ, బలహీనంగా ఉండే పిల్లలకు జన్మనిస్తారు. నేటి ఆరోగ్యకరమైన బాలలే రేపటి అభివృద్ధి భారతదేశానికి పునాదులు కాబట్టి భారతదేశం అభివృద్ధి పుట్టే ఆరోగ్యవంతమైన పిల్లల పైన ఆధారపడి ఉంటుంది.

భారత దేశంలో ఆకలి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో పేదరికం, ఆకలి నుంచి తప్పించుకోవాలంటే పనికి, ఆహారానికి హక్కు రెండు తప్పనిసరిగా ఉండాలి. అయితే పేదరికం నుంచి బయటపడడం, గౌరవప్రదమైన జీవనం గడపడం, అంటే ఇంకా ఎన్నో ఉన్నాయి ఆరోగ్యం, విద్య, గుడ్డ, ఆవాసం, నీరు, పారిశుద్ధ్యం, కాలుష్యం లేని గాలి, ఇంధన వనరులు, మౌలిక సదుపాయాలు, వివక్షకు గురి కాకుండా ఉండడం, ప్రజాస్వామ్యం లో పాల్గొనడం, ఆర్థిక సామాజిక హక్కులు, కూడా జీవించే హక్కులు కూడా పేదరికంలో భాగమే. ఈ విస్తృతమైన అవగాహన దిశగా సమాజం ముందుకు వెళ్లాలి.

దాని ద్వారా మాత్రమే పేదరిక నిర్మూలన చేయడానికి అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వం కుటుంబ ఆదాయం, జీవనోపాధి మార్గాలు, రోజు తింటున్న ఆహారం, బట్టలు, గృహ వసతి, వలస, అప్పు వంటి అంశాలను సేకరించి ఒక కుటుంబం పేదరికంలో ఉందో లేదో నిర్ణయిస్తుంది. పేదరికానికి కారణం క్రమం తప్పకుండా పని దొరకక పోవడమేనని ఇక్యరాజ్య సమితి వెల్లడించింది. ఉపాధి అవకాశాలు లేక పోతే మౌలిక అవసరాలు తీర్చుకునే ప్రజల కొనుగోలు శక్తి, ఆదాయం తగ్గుతుంది. కనీస కొనుగోలు శక్తి లేనప్పుడు వాళ్లు తీవ్ర ఆకలికి, అనారోగ్యానికి గురి అవుతారు.

భారత దేశంలో ఇప్పటికీ 50 శాతం కంటే ఎక్కువ మంది ప్రజలు తమ జీవనోపాధి కొరకు వ్యవసాయం పైన ఆధార పడుతున్నారు. రైతులు, వ్యవసాయ కూలీలు ఎక్కువ. అంతేకాక చాలామంది ప్రజల జీవనోపాధి వ్యవసాయంపైనే ఆధారపడి ఉంది. కాబట్టి వ్యవసాయం ప్రగతి సాధించడం ముఖ్యం. వ్యవసాయం అభివృద్ధి చెందితే గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఉపాధి ఆదాయాలను సమకూరుస్తుంది. అంతేకాకుండా వ్యవసాయ ఉత్పత్తి బాగుంటే ఆహార ధరలు ఎక్కువ మందికి అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ప్రస్తుత వ్యవసాయం అనేక సమస్యలను ఎదుర్కొంటున్నది. కారణం ఉత్పాదకాల ఖర్చులు పెరగడం, తక్కువ దిగుబడులు రావడం, విఫలమవటం వంటి వాటి వల్ల రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. కుటుంబం గడవడానికి చాలా మంది రైతులు వ్యవసాయ కూలీలుగా పని చేయాల్సి వస్తోంది.

తెలంగాణ గ్రామీణ కుటుంబాలలో 40 శాతం ప్రధానంగా వ్యవసాయ కూలీలు. ఈ కుటుంబాలకు భూమి లేదు, ఉన్నా కూడా చాలా కొద్ది భూమి మాత్రమే ఉంది. వీళ్లకు పని అవకాశాలు చాలా తక్కువ. ప్రాథమిక అవసరాలు సమకూర్చుకోవడానికి ప్రతి వ్యక్తికి పని కల్పించాలని పని హక్కు చెబుతోంది భారత రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలలో పని హక్కు పొందుపరిచి ఉంది. అధికరణం 41 ఇలా పేర్కొంటోంది ‘తన ఆర్థిక సామర్థ్యం అభివృద్ధి పరిమితులకు లోబడి పని హక్కు కల్పించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలి’ అయితే ప్రజలు ఈ హక్కులను ఉపయోగించుకోలేక పోతున్నారు. పేదరికానికి ముఖ్య కారణాలు తక్కువ తలసరి ఆదాయం, నిరుద్యోగం, అధిక జనాభా, వ్యవసాయం ప్రధానంగా ఉన్న ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక అసమానతలు, వనరుల అల్ప వినియోగం, ఆర్థిక స్వేచ్ఛ లేకపోవడం, పోషకాలు కలిగిన ఆహార లోపం, అవినీతి, అలసత్వం, సమ న్యాయం పాటించక పోవడం, అంతర్యుద్ధాలు లాంటివి.

Poverty is one of the major problems haunt India

నెరుపటి ఆనంద్, 9989048428

The post పేదల బతుకులు మారేదెన్నడు? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.