మృతుడి కళ్లను పీక్కుతిన్న చీమలు

ఐదుగురు డాక్టర్ల సస్పెన్షన్ భోపాల్: మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వ ఆస్పత్రిలో మృతి చెందిన ఓ రోగి కళ్లను గంటల తరబడి చీమలు పీక్కుతింటున్నప్పటికీ వైద్యులు నిర్లక్షం వహించారు. మృతుడి భార్య ఆయన కళ్లలో చీమలను తొలగిస్తున్న దృశ్యం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయింది. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ముఖ్యమంత్రి కమల్‌నాథ్ విచారణకు ఆదేశించారు. విధి నిర్వహణలో నిర్లక్షంగా వ్యవహారించిన సర్జన్ సహా ఐదుగురు డాక్టర్లను ఆయన సస్పెండ్ […] The post మృతుడి కళ్లను పీక్కుతిన్న చీమలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
ఐదుగురు డాక్టర్ల సస్పెన్షన్

భోపాల్: మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వ ఆస్పత్రిలో మృతి చెందిన ఓ రోగి కళ్లను గంటల తరబడి చీమలు పీక్కుతింటున్నప్పటికీ వైద్యులు నిర్లక్షం వహించారు. మృతుడి భార్య ఆయన కళ్లలో చీమలను తొలగిస్తున్న దృశ్యం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయింది. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ముఖ్యమంత్రి కమల్‌నాథ్ విచారణకు ఆదేశించారు.

విధి నిర్వహణలో నిర్లక్షంగా వ్యవహారించిన సర్జన్ సహా ఐదుగురు డాక్టర్లను ఆయన సస్పెండ్ చేశారు. ఇటువంటి సంఘటనలు మానవత్వానికి అవమానం, దీనిని సహించలేము.విచారణకు ఆదేశించానని, దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటానని కమల్‌నాథ్ ట్వీట్ చేశారు. క్షయ రోగి బల్‌చంద్ర లోధి (50)ని మంగళవారం ఆస్పత్రిలో చేర్పించారు. ఐదు గంటల తర్వాత ఆయన మృతి చెందారు. అదే వార్డులో ఇతర రోగులు విషయాన్ని వైద్య సిబ్బందికి తెలియజేసినప్పటికీ మృతదేహాన్ని గంటల తరబడి అక్కడే ఉంచినట్లు తెలుస్తోంది.

ants found crawling inside eye of dead man

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మృతుడి కళ్లను పీక్కుతిన్న చీమలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: