శ్రమశక్తిలో ‘ఆమె’ అంతంతే

భారత్‌లో మహిళా కార్మికుల ప్రాతినిధ్యం చాలా తక్కువ 2005 లో 36.7 శాతం నుంచి 2018లో 26 శాతానికి తగ్గిన మహిళలు పనిచేసే చోట అభద్రతే ప్రధాన కారణం విద్యావకాశాల లోపం, సామాజిక, ఆర్థిక అడ్డంకులు ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరక్టర్ క్రిస్టలినా జార్జియివా వెల్లడి వాషింగ్టన్ : పనిచేసే చోట మహిళలకు అభద్రత వల్ల మహిళా కార్మిక శక్తి ప్రాతినిధ్యం భారత్‌లో చాలా తక్కువగా ఉంటోందని ఇంటర్నేషనల్ మోనిటరీ ఫండ్ ( ఐఎంఎఫ్) మేనేజింగ్ డైరక్టర్ క్రిస్టలినా […] The post శ్రమశక్తిలో ‘ఆమె’ అంతంతే appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

భారత్‌లో మహిళా కార్మికుల ప్రాతినిధ్యం చాలా తక్కువ
2005 లో 36.7 శాతం నుంచి 2018లో 26 శాతానికి తగ్గిన మహిళలు
పనిచేసే చోట అభద్రతే ప్రధాన కారణం
విద్యావకాశాల లోపం, సామాజిక, ఆర్థిక అడ్డంకులు
ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరక్టర్ క్రిస్టలినా జార్జియివా వెల్లడి

వాషింగ్టన్ : పనిచేసే చోట మహిళలకు అభద్రత వల్ల మహిళా కార్మిక శక్తి ప్రాతినిధ్యం భారత్‌లో చాలా తక్కువగా ఉంటోందని ఇంటర్నేషనల్ మోనిటరీ ఫండ్ ( ఐఎంఎఫ్) మేనేజింగ్ డైరక్టర్ క్రిస్టలినా జార్జియివా చెప్పారు. ఉమెన్, వర్క్, లీడర్‌షిప్: వన్‌ఆన్‌వన్ కాన్వర్సేషన్ అనే అంశంపై మంగళవారం జరిగిన సదస్సులో ఆమె మాట్లాడారు. స్కూలుకు లేదా పనికి వెళ్లడం భద్రత కాదని మహిళలు అనుకుంటున్నారని ఆమె చెప్పారు. ఈ సమస్యను నివారించడానికి మహిళలకు పనిచేసే చోట భద్రత కల్పించడానికి అంకిత భావం అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు.

ఈ వారం తరువాత జరగనున్న వార్షిక సదస్సుకు ముందుగా ఈ కార్యక్రమం జరిగింది. మహిళా కార్మిక ప్రాతినిధ్యం భారత్‌లో 2005లో 36.7 శాతం ఉండగా, 2018 నాటికి 26 శాతానికి తగ్గిందని, నాణ్యమైన విద్యావకాశాలు లోపించడం, సామాజిక, ఆర్థిక అడ్డంకులు మహిళలకు అవకాశాలను పరిమితం చేస్తున్నాయని డెలోయిట్ మార్చిలో విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. భారత్‌లో మహిళలు, బాలికల సాధికారత అనే నివేదిక ప్రకారం 195 మిలియన్ లేదా 95 శాతం మంది అసంఘటిత రంగంలో లేదా ఎలాంటి చెల్లింపు లేని పనిచేస్తున్నారని వెల్లడించారు. నాణ్యమైన విద్య, పునర్ నైపుణ్యం ద్వారా భారత్‌లో మహిళా సాధికారత సాధించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

Labour force participation of women in India is quite low

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post శ్రమశక్తిలో ‘ఆమె’ అంతంతే appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: