భారత్‌లో పేదరికం తగ్గింది

15 ఏళ్లలో 7 శాతం పైబడిన వృద్ధి రేటు పేర్కొన్న ప్రపంచ బ్యాంక్ న్యూఢిల్లీ: 1990ల నుంచి ఇప్పటివరకు భారతదేశంలో పేదరికం సగం తగ్గిందని, గత 15 ఏళ్లలో ఏడు శాతానికి పైగా వృద్ధి రేటు సాధించిందని ప్రపంచంబ్యాంక్ అక్టోబర్ 15న పేర్కొంది. తీవ్రస్థాయి పేదరికాన్ని నిర్మూలించడంతో పాటు అంతర్జాతీయంగా అభివృద్ధిలో కూడా విజయం సాధించింది. వాతావరణ మార్పులను ఎదుర్కోవడం వంటి ప్రపంచానికి మేలుచేసే అంశాల్లో కూడా ప్రభావితం చేస్తోంది. మానవ వనరుల అభివృద్ధిలో కూడా శక్తివంతమైన […] The post భారత్‌లో పేదరికం తగ్గింది appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

15 ఏళ్లలో 7 శాతం పైబడిన వృద్ధి రేటు
పేర్కొన్న ప్రపంచ బ్యాంక్

న్యూఢిల్లీ: 1990ల నుంచి ఇప్పటివరకు భారతదేశంలో పేదరికం సగం తగ్గిందని, గత 15 ఏళ్లలో ఏడు శాతానికి పైగా వృద్ధి రేటు సాధించిందని ప్రపంచంబ్యాంక్ అక్టోబర్ 15న పేర్కొంది. తీవ్రస్థాయి పేదరికాన్ని నిర్మూలించడంతో పాటు అంతర్జాతీయంగా అభివృద్ధిలో కూడా విజయం సాధించింది. వాతావరణ మార్పులను ఎదుర్కోవడం వంటి ప్రపంచానికి మేలుచేసే అంశాల్లో కూడా ప్రభావితం చేస్తోంది. మానవ వనరుల అభివృద్ధిలో కూడా శక్తివంతమైన ఫలితాలను సాధించింది అని కొనియాడింది. ప్రపంచ బ్యాంకుకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థకు మధ్య వార్షిక సమావేశం జరగబోతున్న సందర్భంలో వరల్డ్ బ్యాంక్ ఈ వివరణ ఇచ్చింది.

భారతదేశం అభివృద్ధి పయనం కొనసాగుందని, ఈ దశాబ్దంలో తీవ్రస్థాయి పేదరికాన్ని నిర్మూలించగలదని భావిస్తున్నామని, అయితే అదే సమయంలో దేశాభివృద్ధిపరంగా ఓ స్థాయిలో సవాళ్లను కూడా ఎదుర్కోవలసి ఉంటుందని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది. వీటిని అధిగమించాలంటే సుస్థిరాభివృద్ధి సాధించడం అవసరమని, అందుకు భారతదేశం వనరుల సామర్థాన్ని పెద్ద ఎత్తున పెంపొందించుకోవాల్సి ఉంటుందని కూడా ప్రపంచబ్యాంక్ అభిప్రాయపడింది.
ఉత్పత్తి సాధనకు భూమి

పట్టణ ప్రాంతాల్లో మరింత ఉత్పత్తి సాధించాలంటే అందుకు తగ్గట్టు భూమి కూడా అవసరమవుతుంది. పల్లె ప్రాంతాల్లో వ్యవసాయ ఉత్పాదకత పెరగాలి. నీటి నిర్వహణలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని, నీటి కేటాయింపుల్లో అత్యంత విలువగల అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలని, నీటి విలువను గుర్తించి, తగిన విధంగా వాడుకోగల విధానాలను పెంపొందించుకోవాలనీ ప్రపంచ బ్యాంక్ సూచించింది. ఇలా ఉండగా దేశంలో ఇప్పటికీ 23 కోట్లమందికి సరిగా విద్యుత్ అందడంలేదు. కార్బన్ తక్కువ స్థాయిలో ఉండేలా విద్యుదుత్పత్తి జరగాల్సిన అవసరముందని తెలిపింది.
పెట్టుబడుల ఆవశ్యకత

అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో భారతదేశం మౌలిక సదుపాయాల కల్పనకు పెట్టుబడులు పెట్టాల్సిన అవసరముందని ప్రపంచబ్యాంక్ భావిస్తోంది. అలా చేయగలిగితే 2030 వరకూ 8.8 శాతం స్థూల జాతీయోత్పత్తి లేదా ఏడాదికి 343 బిలియన్ డాలర్ల ఆర్థికతను అంచనావేయవచ్చని చెప్పింది. సుస్థిరాభివృద్ధికి సమీకృత వేగం అవసరమని, ఎక్కువ ఉద్యోగాల్ని కల్పించడం ద్వారా వీలవుతుందని తెలిపింది. ఏటా కోటీ 30 లక్షల మంది ఉద్యోగం చేసే లేదా ఉపాధి సంపాదించుకునే వయసులోకి అడుగుపెడుతున్నారని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది.

Poverty has decreased in India 2019

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post భారత్‌లో పేదరికం తగ్గింది appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: