నాలుగు మర్డర్లు.. కారులో శవం

అమెరికాలో ఎన్నారై సరెండర్ రోజెవిల్లే : తాను నాలుగు హత్యలు చేశానని, ఒక శవం తీసుకుని వచ్చానని భారతీయ సంతతి వ్యక్తి ఇక్కడ పోలీసులకు లొంగిపొయ్యాడు. ఉత్తర కాలిఫోర్నియాలోని మౌంట్ షస్తా పోలీసు స్టేషన్‌లో ఈ ఘటన జరిగింది. తన పేరు శంకర్ హంగడ్ అని చెపుతూ 53 సంవత్సరాల వ్యక్తి రోజెవిల్లేలోని పోలీసు స్టేషన్‌కు వచ్చాడు. తాను హంతకుడిని, తన కారులో ఒక శవం ఉందని చెప్పాడు. అయితే ఈ వ్యక్తి మాటలను పోలీసు అధికారులు […] The post నాలుగు మర్డర్లు.. కారులో శవం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
అమెరికాలో ఎన్నారై సరెండర్

రోజెవిల్లే : తాను నాలుగు హత్యలు చేశానని, ఒక శవం తీసుకుని వచ్చానని భారతీయ సంతతి వ్యక్తి ఇక్కడ పోలీసులకు లొంగిపొయ్యాడు. ఉత్తర కాలిఫోర్నియాలోని మౌంట్ షస్తా పోలీసు స్టేషన్‌లో ఈ ఘటన జరిగింది. తన పేరు శంకర్ హంగడ్ అని చెపుతూ 53 సంవత్సరాల వ్యక్తి రోజెవిల్లేలోని పోలీసు స్టేషన్‌కు వచ్చాడు. తాను హంతకుడిని, తన కారులో ఒక శవం ఉందని చెప్పాడు. అయితే ఈ వ్యక్తి మాటలను పోలీసు అధికారులు ముందు నమ్మలేదు. ఉత్తుత్తి మాటలని అనుకున్నారు. అయితే చెప్పింది వినండి కావాలంటే కారులో శవాన్ని చూడండని శంకర్ చెపుతూ ఉండటంతో పోలీసులు వెళ్లి చూడగా నిజంగానే కారులో ఒక కుళ్లిన అస్తిపంజరం ఉంది.

తరువాత ఈ వ్యక్తిని బోలెవార్డ్ జంక్షన్‌లోని అపార్ట్‌మెంట్‌కు తీసుకువెళ్లగా అక్కడ ఓ పెద్ద వ్యక్తి, ఇద్దరు బాలలు చనిపోయి పడి ఉండటాన్ని గుర్తించారు. హత్యలకు పాల్పడినట్లు నేరాంగీకరానికి ఆ వ్యక్తి పోలీసు స్టేషన్‌కు వచ్చాడని, శవాలను కూడా చూపించడానికి తీసుకువెళ్లడానికి తమ పోలీసు అనుభవంలో ఇటువంటి అనుభవంలేదని పోలీసు అధికారి రాబర్ట్ గిబ్స న్ తెలిపారు. గత కొద్ది రోజులుగా తన సమీప బంధువుల ను లేదా ఇంటివారినే ఈ వ్యక్తి చంపి ఉంటాడని పోలీసు లు భావిస్తున్నారు. చాలా నింపాదిగా తాను హత్యలు చేసినట్లు చెప్పిన ఈ వ్యక్తి ఎందుకు చేశాడనేది వివరించలేదు. ఒకే ఇంట్లో జరిగిన నాలుగు హత్యలు ఏ విధంగా జరిగాయనేది తెలియచేసేందుకు పోలీసులు నిరాకరించారు.

Man allegedly went to police with body in car

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post నాలుగు మర్డర్లు.. కారులో శవం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: