పరిషత్‌లకు నిధులు, విధులు

  త్వరలో జడ్‌పి చైర్మన్లు, జడ్‌పిటిసిలు, ఎంపిపిలు, ఎంపిటిసిలతో హైదరాబాద్‌లో సమావేశం 30 రోజుల ప్రణాళికలో ఆశించిన ఫలితాలు వచ్చాయి ఆదర్శ గ్రామాలుగా మారాలన్నదే నా అభిమతం తనను కలిసిన స్థానిక ప్రజా ప్రతినిధులతో సిఎం కెసిఆర్ హైదరాబాద్ : రాష్ట్రంలో పంచాయతీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేస్తామని, గ్రామ పంచాయతీలతో పాటు మండల పరిషత్, జిల్లా పరిషత్‌లను క్రియాశీలకంగా మారుస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. గ్రామ పంచాయతీ ట్రిబ్యునల్ సభ్యుడిగా నియామకమైన వరంగల్ రూరల్ […] The post పరిషత్‌లకు నిధులు, విధులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

త్వరలో జడ్‌పి చైర్మన్లు, జడ్‌పిటిసిలు, ఎంపిపిలు, ఎంపిటిసిలతో హైదరాబాద్‌లో సమావేశం
30 రోజుల ప్రణాళికలో ఆశించిన ఫలితాలు వచ్చాయి
ఆదర్శ గ్రామాలుగా మారాలన్నదే నా అభిమతం
తనను కలిసిన స్థానిక ప్రజా ప్రతినిధులతో సిఎం కెసిఆర్

హైదరాబాద్ : రాష్ట్రంలో పంచాయతీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేస్తామని, గ్రామ పంచాయతీలతో పాటు మండల పరిషత్, జిల్లా పరిషత్‌లను క్రియాశీలకంగా మారుస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. గ్రామ పంచాయతీ ట్రిబ్యునల్ సభ్యుడిగా నియామకమైన వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండకు చెందిన గటిక అజయ్ కుమార్ బుధవారం ప్రగతి భవన్‌లో ఎంపిపిలు, జడ్‌పిటిసిలు, స్థానిక ప్రజాప్రతినిధులతో పాటుగా ముఖ్యమంత్రిని కలిశారు. తనను ట్రిబ్యునల్ సభ్యుడిగా నియమించినందుకు సిఎంకు అజయ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. అజయ్ కుమార్‌కు సిఎం అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఇటీవల గ్రామాల్లో నిర్వహించిన 30 రోజుల ప్రణాళిక ఆశించిన ఫలితాలు సాధించిందని సంతృప్తి వ్యక్తం చేశారు.

గ్రామ పంచాయతీల మాదిరిగానే మండల పరిషత్, జిల్లా పరిషత్‌లకు కూడా నిర్దిష్టమైన విధులు, నిధులు, బాధ్యతలు అప్పగించడానికి కసరత్తు చేస్తున్నట్లు సిఎం వెల్లడించారు. త్వరలోనే ఎంపిపిలు, ఎంపిటిసిలు, జడ్‌పిటిసిలు, జడ్‌పి చైర్మన్లతో హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించనున్నట్లు సిఎం చెప్పారు. ఆర్థిక సంఘం నిధులను ప్రతీ నెలా రూ.339 కోట్ల చొప్పున గ్రామ పంచాయతీలకు విడుదల చేస్తున్నామని చెప్పారు. ఇదే తరహాలో మండల, జిల్లా పరిషత్ లకు కూడా నిధులు విడుదల చేస్తామని సిఎం చెప్పారు. తెలంగాణ పల్లెలు దేశంలో కెల్లా ఆదర్శ గ్రామాలుగా మారాలన్నదే తన అభిమతమన్నారు. ప్రజల విస్తృత భాగస్వామ్యం, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల నాయకత్వంలో పల్లెలు బాగు పడాలని సిఎం ఆకాంక్షించారు.

దీనికి అవసరమైన ఆర్థిక ప్రేరణను ప్రభుత్వం అందిస్తుందని, మంచి విధానం తీసుకొస్తుందని చెప్పారు. గ్రామ స్థాయిలో ప్రజలు సమైక్యంగా ఉండి, గ్రామాలను బాగు చేసుకోవాలని, నిధులను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. జెడ్‌పిటిసి సరోజ హరికిషన్ నాయక్, ఎంపిపి జాటోతు రమేశ్, టిఆర్‌ఎస్ నాయకులు కొమ్ము రమేశ్ యాదవ్, తాటిపల్లి శివకుమార్, సంపత్ రావు, శ్రీకాంత్, మూర్తి తదితరులు సిఎంను కలిసిన వారిలో ఉన్నారు.

Funds and functions for the Parishad

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post పరిషత్‌లకు నిధులు, విధులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: