అశ్విన్ గాడిలో పడినట్టే..

సౌతాఫ్రికా సిరీస్‌లో పూర్వ వైభవం రాంచీ: టెస్టు క్రికెట్‌లో తానెంత కీలక బౌలరో రవిచంద్రన్ అశ్విన్ మరోసారి నిరూపించాడు. కొంతకాలంగా పేలవమైన ఫామ్‌తో సతమతమవుతున్న అశ్విన్ తాజాగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న సిరీస్‌లో అసాధారణంగా రాణిస్తున్నాడు. తనపై విమర్శలు చేసిన వారికి బంతితోనే దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో అశ్విన్‌కు తుది జట్టులో చోటు దక్కలేదు. దీంతో అశ్విన్ కెరీర్‌పై నీలి మేఘాలు కమ్ముకున్నాని వార్తలు వినవచ్చాయి. పేలవమైన ఫామ్ నేపథ్యంలో అశ్విన్ భవిష్యత్తు […] The post అశ్విన్ గాడిలో పడినట్టే.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
సౌతాఫ్రికా సిరీస్‌లో పూర్వ వైభవం

రాంచీ: టెస్టు క్రికెట్‌లో తానెంత కీలక బౌలరో రవిచంద్రన్ అశ్విన్ మరోసారి నిరూపించాడు. కొంతకాలంగా పేలవమైన ఫామ్‌తో సతమతమవుతున్న అశ్విన్ తాజాగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న సిరీస్‌లో అసాధారణంగా రాణిస్తున్నాడు. తనపై విమర్శలు చేసిన వారికి బంతితోనే దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో అశ్విన్‌కు తుది జట్టులో చోటు దక్కలేదు. దీంతో అశ్విన్ కెరీర్‌పై నీలి మేఘాలు కమ్ముకున్నాని వార్తలు వినవచ్చాయి. పేలవమైన ఫామ్ నేపథ్యంలో అశ్విన్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.

ఇలాంటి పరిస్థితుల్లో సొంత గడ్డపై బలమైన దక్షిణాఫ్రికాతో జరుగుతున్న సిరీస్ అశ్విన్ సత్తాకు పరీక్షగా మారింది. ఈ సిరీస్‌లో రాణించడం ద్వారా విమర్శకులకు గట్టి జవాబు చెప్పాలనే పట్టుదల, కసి అశ్విన్‌లో కనిపించింది. దీనికి తగినట్టుగానే సిరీస్‌లో అశ్విన్ అత్యంత విజయవంతమైన బౌలర్‌గా కొనసాగుతున్నాడు. తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో అశ్విన్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు. బౌలింగ్‌కు ఏమాత్రం సహకరించని పిచ్‌పై అద్భుతంగా రాణించాడు. వరుసగా వికెట్లు తీస్తూ జట్టుకు అండగా నిలిచాడు. అంతేగాక దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌కు సింహాస్వప్నంగా మారాడు. అతని బౌలింగ్‌ను ఎదుర్కొవడం ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు సవాలుగా తయారైంది. ఎల్గర్, డికాక్ తప్పించి ఇతర బ్యాట్స్‌మెన్ ఎవరూ కూడా అశ్విన్ ధాటికి ఎదురు నిలువలేక పోయారు.

అసాధారణ బౌలింగ్‌తో ఆకట్టుకున్న అశ్విన్ విశాఖ టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో ఏకంగా ఏడు వికెట్లు తీసి సత్తా చాటాడు. ఈ మ్యాచ్‌లో అశ్విన్‌కు 8 వికెట్లు లభించాయి. ఇక, పుణెలో జరిగిన రెండో టెస్టులో కూడా అశ్విన్ సత్తా చాటాడు. ఈసారి కూడా ఆరు వికెట్లతో చెలరేగాడు. భారత్ విజయంలో తనవంతు పాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్‌లో అశ్విన్ అద్భుతంగా రాణించాడు. పిచ్ నుంచి సహకారం లేకున్నా అశ్విన్ అద్భుత బౌలింగ్‌ను కనబరిచాడు. ఈసారి నాలుగు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో కూడా రాణించి రెండు వికెట్లు పడగొట్టాడు.

ఊరిస్తున్న మరో రికార్డు

ఇక, సిరీస్‌లో ఇప్పటికే 14 వికెట్లు తీసిన అశ్విన్ మూడో టెస్టులో కూడా రాణించాలనే పట్టుదలతో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో మరో 9 వికెట్లు పడగొడితే అశ్విన్ ఖాతాలో మరో అరుదైన రికార్డు చేరుతుంది. ఈ వికెట్లను తీస్తే దక్షిణాఫ్రికాపై అత్యధిక వికెట్లు తీసిన మూడో భారత బౌలర్‌గా అశ్విన్ నిలుస్తాడు. దిగ్గజ బౌలర్ హర్భజన్ సింగ్ 11 టెస్టుల్లో 60 వికెట్లు పడగొట్టి మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక, అశ్విన్ 9 టెస్టుల్లోనే 52 వికెట్లు పడగొట్టి నాలుగో స్థానంలో నిలిచాడు. ఈ మ్యాచ్‌లో రాణించడం ద్వారా హర్భజన్ రికార్డును బద్దలు కొట్టాలని తహతహలాడుతున్నాడు. అంతేగాక ఈ రికార్డు సాధిస్తే ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్ అవార్డు కూడా అశ్విన్‌కు దక్కే అవకాశం ఉంటుంది. కాగా, దక్షిణాఫ్రికాపై కుంబ్లే 21 టెస్టుల్ల 84 వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా, శ్రీనాథ్ 64 రెండో స్థానంలో ఉన్నాడు.

india vs south africa ashwin wickets

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post అశ్విన్ గాడిలో పడినట్టే.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: