చెన్నూరుకు కాళేశ్వరం

  బ్యాక్ వాటర్‌తో 79వేల ఎకరాల కొత్త ఆయకట్టు – ఎంఎల్‌ఎ బాల్క సుమన్ హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు లింక్- వన్‌లోని మూడు బ్యారేజీల బ్యాక్ వాటర్స్ నుండి మూడు లిఫ్టుల ద్వారా చెన్నూరు నియోజకవర్గంలోని 1,31,8 0 ఎకరాలకు సాగునీరు అందనుంది. బ్యాక్ వాటర్ వినియోగానికి సంబంధించి సవరించిన ప్రతిపాదనల ద్వారానే ఇది సాధ్యం కానుందని ప్రభుత్వ విప్, చెన్నూరు నియోజకవర్గ ఎంఎల్‌ఎ బాల్కసుమన్ పేర్కొన్నారు. ఆయన బుధవారం హైదరాబాద్‌లోని ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ […] The post చెన్నూరుకు కాళేశ్వరం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

బ్యాక్ వాటర్‌తో 79వేల ఎకరాల కొత్త ఆయకట్టు – ఎంఎల్‌ఎ బాల్క సుమన్

హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు లింక్- వన్‌లోని మూడు బ్యారేజీల బ్యాక్ వాటర్స్ నుండి మూడు లిఫ్టుల ద్వారా చెన్నూరు నియోజకవర్గంలోని 1,31,8 0 ఎకరాలకు సాగునీరు అందనుంది. బ్యాక్ వాటర్ వినియోగానికి సంబంధించి సవరించిన ప్రతిపాదనల ద్వారానే ఇది సాధ్యం కానుందని ప్రభుత్వ విప్, చెన్నూరు నియోజకవర్గ ఎంఎల్‌ఎ బాల్కసుమన్ పేర్కొన్నారు. ఆయన బుధవారం హైదరాబాద్‌లోని ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ కార్యాలయంలో చీఫ్ ఇంజినీర్ జి. శ్రీనివాస్ రెడ్డి, కాళేశ్వరం ఎస్‌ఇ విష్ణు ప్రసాద్ ఇతర అధికారులతో సమావేశమై కాళేశ్వరం లింక్ వన్ ద్వారా చెన్నూరుకు వచ్చే సాగునీటి ప్రతిపాదనలపై చర్చించారు. దీని ప్రకారం 1.31 లక్షల ఎ కరాలలో 79,470 ఎకరాలు కొత్త ఆయకట్టు కా గా, 52,370 ఎకరాలు చిన్న, మీడియం ప్రాజెక్టుల స్థిరీకరణ చేయనున్నారు.

ఇందులో మొదటి లిఫ్ట్ మేడిగడ్డ బ్యాక్ వాటర్స్ (ప్రాణహిత నది) ద్వారా 25,100 ఎకరాలకు నీరు అందనుంది. వెంచపల్లి గ్రామం (30 మీటర్లు), వేమనపల్లి మండలం దగ్గర ప్రాణహిత నది (మేడిగడ్డ బ్యాక్ వాటర్స్) మీద ఒక లిఫ్ట్ నిర్మించనున్నారు. ఈ లిఫ్ట్ సాయంతో వేమనపల్లి, కోట్పల్లి (20 మీటర్లు) మండలాల్లో 23,770 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరు అందనుంది. 1330 ఎకరాల స్థిరీకరణ జరగనుంది. మొత్తంగా 25, 100 ఎకరాలకు లబ్ది చేకూరనుంది. ఇక రెండో లిఫ్ట్ ద్వారా అన్నారం బ్యారేజీ ఫోర్ షోర్ (50 మీటర్ల లిఫ్ట్) 61,743 ఎకరాలకు సాగునీరు అందనుంది. అన్నారం బ్యారేజీ నుండి 50 మీ టర్లు నీరు లిఫ్ట్ చేసి చెన్నూరు, కోటపల్లి మండలాల్లో 31,252 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరు అందిస్తూ, 30,491 ఎకరాల పాత ఆయకట్టును స్థిరీకరించనున్నారు.

మూడో లిఫ్ట్‌తో సుందిళ్ళ బ్యారేజీ (83 మీటర్ల లిఫ్ట్)నుంచి 51,297 ఎకరాలకు నీరు అందించనున్నారు. సుందిళ్ళ బ్యారేజి నుండి 83 మీటర్లు నీరు లిఫ్ట్ చేసి భీమారం, జైపూర్, మందమర్రి మండలాల్లో 29,418 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరు అందించడంతో పాటుగా 21,879 ఎకరాల పాత ఆయకట్టును స్థిరీకరించనున్నారు. సవరించిన ప్రతిపాదనలపై అధికారులు సమగ్ర అధ్యయనం చేయనున్నారు.

చెన్నూరు నియోజకవర్గ పరిధిలోని కమాండ్ ఏరియా వివరణాత్మక దర్యాప్తుకు, సమగ్ర ప్రాజెక్టు రిపోర్ట్‌కు ప్రభుత్వం నుంచి పరిపాలనా అనుమతి తీసుకోవడానికి పరిధిని స్పష్టంగా పేర్కొనాలని నిర్ణయించారు. ఈ ప్రతిపాదన సిఎం కెసిఆర్ కోరినట్లు ప్రస్తుత ట్యాంకులను నింపడంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు జలాలను సమర్థవంతంగా ఉపయోగించుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. మునుపటి ప్రతిపాదనతో తలెత్తే ఆలస్యం, అడ్డంకులను ఇది తగ్గిస్తుంది. డిపిఆర్ ఆమోదానికి ప్రతిపాదనలు తయారు చేసి పంపాలని నిర్ణయించారు.

Kaleshwaram water to Chennur constituency

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post చెన్నూరుకు కాళేశ్వరం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: